JEE Main: జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక ఎంట్రెన్స్ టెస్ట్‌ల్లో జేఈఈ(జాయింట్ ఎంట్రెన్స్ టెస్ట్) ఒకటి. ఈ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష ద్వారా దేశంలోని టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇప్పటికే ఈ ఏడాదికి సంబంధించి జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలు ముగియగా, త్వరలో సెషన్-2(JEE Main 2023 session 2) పరీక్షలు ప్రారంభం కానున్నాయి. షెడ్యూల్ ప్రకారం.. ఏప్రిల్ 6న ప్రారంభమై, 12న ముగియనున్నాయి. ఇక ఏప్రిల్ 13, 15 తేదీలను రిజర్వ్ డేస్‌గా ప్రకటించారు.
* త్వరలో ఎగ్జామ్ సిటీ స్లిప్ రిలీజ్
జేఈఈ మెయిన్ సెషన్-2కు సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. త్వరలో ఎగ్జామ్ సిటీ స్లిప్, అడ్మిట్‌కార్ట్‌లను ఎన్‌టీఏ విడుదల చేయనుంది. రిలీజ్ అయిన తరువాత అధికారిక పోర్టల్ jeemain.nta.nic.in నుంచి అభ్యర్థులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
* ఎగ్జామ్ సిటీ స్లిప్ డౌన్‌లోడ్ ప్రాసెస్
- అభ్యర్థులు ముందుగా అధికారిక పోర్టల్ jeemain.nta.nic.in ను విజిట్ చేయాలి. హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న JEE Mains Session 2 Exam City Slip లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
- అక్కడ అవసరమైన వివరాలను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. దీంతో మీకు సంబంధించిన జేఈఈ మెయిన్ సెషన్-2 ఎగ్జామ్ సిటీ స్లిప్ డిస్‌ప్లే అవుతుంది.
- అన్ని వివరాలను చెక్ చేసిన తరువాత ఎగ్జామ్ సిటీ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి.
* అడ్మిట్ కార్డ్‌కు భిన్నంగా..
జేఈఈ మెయిన్ ఎగ్జామ్ సిటీ స్లిప్ అనేది అడ్మిట్ కార్డ్‌కు భిన్నంగా ఉంటుంది. సిటీ స్లిప్‌లో అభ్యర్థుల ఎగ్జామ్ సెంటర్ ఉన్న సిటీ పేరు ఉంటుంది. ఇక అడ్మిట్‌కార్డ్‌లో అభ్యర్థి పేరు, జెండర్, పుట్టిన తేదీ, కేటగిరీ, పరీక్ష తేదీ, సమయం, ఫోటో, సంతకం, రోల్ నంబర్, అప్లికేషన్ నంబర్, ఎగ్జామ్ సెంటర్ వంటి వివరాలు ఉంటాయి. జేఈఈ మెయిన్ సిటీ స్లిప్ రిలీజ్ చేయడం ద్వారా అభ్యర్థులు తమ ప్రయాణం, బస ఏర్పాట్లను చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్ సిటీ స్లిప్ విడుదల చేసిన తరువాత అడ్మిట్ కార్డ్ లను జారీ చేయనున్నారు.
Demat Nomination: ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్ నామినేషన్స్‌కు గడువు పెంపు.. లాస్ట్ డేట్ ఎప్పుడంటే?
* 13 భాషల్లో పరీక్ష
JEE మెయిన్-2023 సెషన్-2 పరీక్ష ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, కన్నడ, అస్సామీ, బెంగాలీ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూతో సహా 13 భాషల్లో నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్ రెండు పేపర్లుగా ఉంటుంది. BTech/ BE కోర్సుల్లో ప్రవేశాలను పేపర్-1 ఆధారంగా చేపట్టనున్నారు. పేపర్-2 ద్వారా బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EDUCATION, Jee, JEE Main 2023, Jee mains, JOBS