JEE Main 2023 : జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ టెస్ట్(Engeneering entrance test) జేఈఈ మెయిన్(JEE Main) అభ్యర్థులకు అలర్ట్. పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సెషన్-1 పరీక్ష తేదీలను రివైజ్ చేసింది. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం పరీక్షలు జనవరి 24న ప్రారంభమై, జనవరి 31న ముగుస్తాయి. అయితే తాజాగా ఓ ప్రకటన జారీ చేసింది. జేఈఈ మెయిన్ సెషన్- 1 పరీక్షలు జనవరి 31 బదులు ఫిబ్రవరి 1న ముగియనున్నాయని వెల్లడించింది. ఇప్పటికే ఎగ్జామ్ సిటీ సిప్ల్ జారీ కాగా, త్వరలో అడ్మిట్ కార్డ్‌లు కూడా రిలీజ్ కానున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జేఈఈ మెయిన్ అడ్మిట్‌కార్డ్ నేడు లేదా రేపు విడుదలయ్యే అవకాశం ఉంది.
రివైజ్ వివరాలు
B.E./B.Tech కోసం జేఈఈ మెయిన్ (పేపర్ I, షిఫ్ట్- 1 & షిఫ్ట్- 2) పరీక్షలను జనవరి 24, 25, 29, 30, 31, ఫిబ్రవరి 1వ తేదీల్లో దేశవ్యాప్తంగా 290 నగరాలు, విదేశాల్లోని 25 నగరాల్లోని వివిధ సెంటర్స్‌లో నిర్వహించనున్నారు. B.Arch, B.Planning కోసం జేఈఈ మెయిన్ సెషన్-1 (పేపర్ 2A & పేపర్ 2B)ను జనవరి 28న(షిఫ్ట్-2) నిర్వహించనున్నారు.
అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ప్రాసెస్
అభ్యర్థులు ముందుగా ఎన్‌టీఏ జేఈఈ మెయిన్ అధికారిక వెబ్‌సైట్ jeemain-nta.nic.inను విజిట్ చేయాలి. ఆ తరువాత హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయాలి. దీంతో కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి. దీంతో జేఈఈ మెయిన్ -2023 మీ అడ్మిట్ కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకుని, సేవ్ చేసుకోవాలి.
Best Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫీచర్లు అదుర్స్,ధర తక్కువే..3కి.మీ నడిపితే రూ.1 ఖర్చు మాత్రమే
13 భాషల్లో పరీక్ష
జేఈఈ మెయిన్ -2023 పరీక్ష ఇంగ్లీష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ సహా మొత్తంగా 13 భాషల్లో నిర్వహించనున్నారు. JEE మెయిన్‌లో రెండు పేపర్లు ఉంటాయి. మొదటి పేపర్ ద్వారా NITs, CFTIs, ఐఐటీల్లో BE, BTech వంటి అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌ల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. B Arch, B Planning కోర్సుల్లో ప్రవేశాలను పేపర్ టూ ద్వారా కల్పించనున్నారు.
ఎగ్జామ్ ప్యాట్రన్
జేఈఈ మెయిన్‌లో 90 ప్రశ్నలు ఉంటాయి. గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ వెయిటేజ్ 100 మార్కులకు సమానంగా ఉంటుంది. మూడు సబ్జెక్టుల్లో 25 చొప్పున మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు (MCQs) ఉంటాయి. వీటితో పాటు మరో 10 ప్రశ్నలు న్యూమరికల్ వ్యాల్యూకు సంబంధించినవి ఉంటాయి. వీటిలో విద్యార్థులు కేవలం ఐదింటికి మాత్రమే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు కేటాయించనున్నారు. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తీసివేయనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, Jee, JEE Main 2023, Job, JOBS