హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main 2023: జేఈఈ మెయిన్ సెషన్-1 ఎగ్జామ్ సిటీ స్లిప్ రిలీజ్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!

JEE Main 2023: జేఈఈ మెయిన్ సెషన్-1 ఎగ్జామ్ సిటీ స్లిప్ రిలీజ్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జేఈఈ మెయిన్-2023 సెషన్-1 ఎగ్జామ్ సిటీ స్లిప్‌ను ఎన్‌టీఏ రిలీజ్ చేసింది. ఆ వివరాలు తెలుసుకోండి..

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Vijayawada

జాతీయ స్థాయిలో కఠినమైన ఎంట్రెన్స్ టెస్ట్‌ల్లో జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్ ఒకటి. దేశంలోని టాప్ ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులను భర్తీ చేయడానికి జేఈఈ మెయిన్ నిర్వహిస్తారు. ఈ టెస్ట్‌కు సంబంధించి పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నుంచి కీలక ప్రకటన వచ్చింది. జేఈఈ మెయిన్-2023 సెషన్-1 ఎగ్జామ్ సిటీ స్లిప్‌ను ఎన్‌టీఏ రిలీజ్ చేసింది.

జనవరి 24 నుంచి పరీక్షలు..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ సెషన్-1 పరీక్షలను జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు నిర్వహించనుంది. ఈ పరీక్ష కోసం త్వరలో అడ్మిట్ కార్డ్ జారీ చేయనుంది. అయితే తాజాగా ఎగ్జామ్ సిటీ స్లిప్‌ను విడుదల చేసింది. దీంతో జేఈఈ మెయిన్ అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ద్వారా ఎగ్జామ్ సిటీ స్లిప్‌ వివరాలను చెక్ చేసుకోవచ్చు.

ఎగ్జామ్ సిటీ స్లిప్ డౌన్‌లోడ్ ప్రాసెస్

అభ్యర్థులుముందు ఎన్‌టీఏ జేఈఈ మెయిన్ అధికారిక వెబ్‌సైట్ jeemain-nta.nic.inను విజిట్ చేయాలి. ఆ తరువాత హోమ్ పేజీలోకి వెళ్లాలి. అక్కడ ఎగ్జామ్ సిటీ స్లిప్ సంబంధించిన లింక్‌పై క్లిక్ చేయాలి.

ఇప్పుడు న్యూ పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ వివరాలను ఎంటర్ చేసి లాగిన్ అవ్వాలి.

తర్వాత మీకు సంబంధించిన జేఈఈ మెయిన్ సెషన్ -1 ఎగ్జామ్ సిటీ స్లిప్ డిస్‌ప్లే అవుతుంది. భవిష్యత్ అవసరాల కోసం దాన్ని సేవ్ చేసుకొని, ప్రింట్ తీసుకోండి.

అభ్యర్థులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ ద్వారా ఎగ్జామ్ సిటీ స్లిప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇందులో అభ్యర్థి పేరు, ఎగ్జామ్ సిటీ, అప్లికేషన్ నంబర్ తదితర వివరాలు ఉంటాయి. ఎగ్జామ్ సిటీ స్లిప్‌‌లో ఏవైనా తప్పులు రిపోర్ట్ చేయాలని ఎన్‌టీఏ సూచించింది.

జేఈఈ మెయిన్ రెండు పేపర్లు

జేఈఈ మెయిన్ -2023 మొదటి పేపర్ ద్వారా ఎన్‌ఐటీ, ఐఐటీ, సీఎఫ్‌టీఐ‌ల్లో BE, BTech వంటి అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలను కల్పించనున్నారు. ఇక BArch, BPlanning కోర్సుల్లో ప్రవేశాలను JEE మెయిన్ పేపర్ టూ ద్వారా కల్పించనున్నారు.

త్వరలో అడ్మిట్ కార్డుల జారీ..

జేఈఈ మెయిన్ సెషన్-1 కోసం ఎన్‌టీఏ త్వరలో అడ్మిట్ కార్డ్‌లను కూడా రిలీజ్ చేయనుంది. అధికారిక వెబ్‌సైట్‌ jeemain.nta.nic.inలో అడ్మిట్ కార్డ్‌లు అందుబాటులోకి రానున్నాయి. అడ్మిట్ కార్డ్ జారీ తరువాత రిపోర్టింగ్ టైమ్, వెరిఫికేషన్ డాక్యుమెంట్స్, పాస్‌పోర్ట్-సైజ్ ఫోటో వంటి వివరాలను సరిగ్గా చెక్ చేసుకోవాలని ఎన్‌టీఏ కోరింది. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే తెలియజేయాలని సూచించింది.

అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ ప్రాసెస్ ఇలా

జేఈఈ మెయిన్ సెషన్-1 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ jeemain-nta.nic.in ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయాలి.

ఆ తరువాత అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి. దీంతో జేఈఈ మెయిన్-2023 అడ్మిట్ కార్డ్ డిస్‌ప్లే‌పై కనిపిస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ తీసుకోండి.

First published:

Tags: Career and Courses, Exams, JEE Main 2023, JOBS

ఉత్తమ కథలు