హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main: ఈ వారంలోనే 2023 జేఈఈ మెయిన్ షెడ్యుల్‌? విద్యార్థులు తెలుసుకోవాల్సిన అంశాలివే..

JEE Main: ఈ వారంలోనే 2023 జేఈఈ మెయిన్ షెడ్యుల్‌? విద్యార్థులు తెలుసుకోవాల్సిన అంశాలివే..

JEE Main: ఈ వారంలోనే 2023 జేఈఈ మెయిన్ షెడ్యుల్‌? విద్యార్థులు తెలుసుకోవాల్సిన అంశాలివే

JEE Main: ఈ వారంలోనే 2023 జేఈఈ మెయిన్ షెడ్యుల్‌? విద్యార్థులు తెలుసుకోవాల్సిన అంశాలివే

ప్రతిష్ఠాత్మకమైన ట్రిపుల్‌ ఐటీలు, ఎన్‌ఐటీల వంటి ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రవేశానికిగాను నిర్వహించే జేఈఈ మెయిన్స్‌ షెడ్యుల్‌ ఈ వారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి.  2023 సంవత్సరానికి గాను జరిగే ఈ పరీక్ష తేదీలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించనుందని మీడియా నివేది

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

2022 సంవత్సరం ముగింపుకు వచ్చింది. వివిధ ప్రవేశ పరీక్షలు, పబ్లిక్‌ పరీక్షల సందడి మొదలైంది. ప్రతిష్ఠాత్మకమైన ట్రిపుల్‌ ఐటీలు (IIIT), ఎన్‌ఐటీల వంటి ఇంజినీరింగ్‌ కళాశాలలో ప్రవేశానికిగాను నిర్వహించే జేఈఈ (JEE) మెయిన్స్‌ షెడ్యుల్‌ ఈ వారంలో వచ్చే అవకాశాలు ఉన్నాయి. 2023 సంవత్సరానికి గాను జరిగే ఈ పరీక్ష తేదీలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ప్రకటించనుందని మీడియా నివేదికలు చెబుతున్నాయి. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షను 2023 జనవరి, ఏప్రిల్ నెలల్లో నిర్వహించే అవకాశం ఉంది. గత సంవత్సరం మాదిరిగానే JEE మెయిన్- 2023 కూడా రెండు సెషన్లలో జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(JEE) మెయిన్‌ జరిగే తేదీలు బహుశా ఈ నవంబర్ 30 లోపే తెలిసే అవకాశాలు ఉన్నాయి. 2023 జనవరిలో జరిగే మొదటి సెషన్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభమవుతుందని సమాచారం.

డిసెంబర్ 1 నుంచి కొత్త రూల్స్.. సామాన్యులకు గుడ్ న్యూస్? వారిపై ఎఫెక్ట్!

ఈ పరీక్షకు అప్లై చెయ్యడానికి ఉండాల్సిన ప్రధాన అర్హత.. ఫిజిక్స్‌, మ్యాథమెటిక్స్‌ తప్పనిసరి సబ్జెక్టులుగా 10+2(12వ తరగతి) ఉత్తీర్ణత కావాల్సి ఉంటుంది. జేఈఈ మెయిన్ - 2023 కోసం రిజిస్ట్రేషన్ ఆన్‌లైన్‌ ద్వారానే ఉంటుంది. ఈ ప్రక్రియలో ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్ నింపడం, అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయడం , దరఖాస్తు రుసుము చెల్లింపులు లాంటివి స్టెప్‌ బై స్టెప్‌ చేయాల్సి ఉంటుంది.

ఏటీఎం కార్డు ఉంటే ఉచితంగా రూ.10 లక్షల వరకు బెనిఫిట్.. వివరాలు ఇలా!

ఒక అభ్యర్థి రెండు సెషన్లలోనూ పరీక్ష రాయాలనే నియమాలు లేవు. అయితే రెండూ రాస్తే దేనిలో మెరిట్‌ వస్తే ఆ ర్యాంకును JEE మెయిన్ NTA స్కోర్‌లుగా పరిగణలోకి తీసుకుంటారు. కాబట్టి అభ్యర్థికి ఇదో మంచి అవకాశంగా మారుతుంది. మామూలుగా అయితే ఈ పరీక్ష ఒక సెషన్‌లో జరిగితే సరిపోతుంది. అయితే అభ్యర్థుల ప్రయోజనాలు, అవసరాలను దృష్టిలో ఉంచుకుని గతేడాది జేఈఈ మెయిన్‌ను రెండు సెషన్‌లుగా నిర్వహించారు. దీంతో ఈ పరీక్షలో హాజరయ్యే అభ్యర్థులకు తమ స్కోర్‌లను మెరుగుపరచుకోవడానికి రెండు అవకాశాలను వచ్చాయి. మొదటి సెషన్‌ను ఎటమ్ట్‌ చేసి పరీక్ష సమయంలో తాము వేటిపై దృష్టి పెట్టాలో అభ్యర్థులు తెలుసుకునే అవకాశమూ కలుగుతుంది. ఈ రెండు సెషన్ల విధానం వల్ల అభ్యర్థులకు ఏడాది కాలం వృథాగా పోయే ప్రమాదం తప్పుతుంది.

ఈ జేఈఈ మెయిన్‌లో రెండు పేపర్లు ఉంటాయి. మొదటిది పేపర్- 1. బీఈ(B.E), బీటెక్‌ (B.Tech) సహా అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ ప్రోగ్రాం లో ప్రవేశం కోసం ఇది రాయాల్సి ఉంటుంది. ఎన్‌ఐటీలు(NIT), ట్రిపుల్‌ ఐటీ(IIIT)లు, కేంద్ర నిధులతో పనిచేసే సాంకేతిక సంస్థలు (CFTI), రాష్ట్ర ప్రభుత్వాలు ఫండింగ్‌ ఇచ్చే కళాశాలలు, విశ్వవిద్యాలయాల వంటి విద్యాసంస్థల్లో చేరేందుకు మొదటి పేపరే రాయాల్సి ఉంటుంది. ఈ పరీక్ష JEE అడ్వాన్స్‌డ్‌కి కూడా అర్హత పరీక్ష. ఇది జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఐఐటీ(IIT)లలో ప్రవేశానికి నిర్వహిస్తారు. భారతదేశం అంతటా బి.ఆర్చ్, బి.ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశం కోసం పేపర్-2 రాయాల్సి ఉంటుంది.

First published:

Tags: EDUCATION, Iiit hyderabad, Jee mains, JOBS

ఉత్తమ కథలు