హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main-2023: త్వరలో జేఈఈ మెయిన్-2023 నోటిఫికేషన్.. ఎగ్జామ్ ప్యాట్రన్‌ వివరాలు ఇవే..

JEE Main-2023: త్వరలో జేఈఈ మెయిన్-2023 నోటిఫికేషన్.. ఎగ్జామ్ ప్యాట్రన్‌ వివరాలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

JEE Main-2023: ఇంటర్ తర్వాత ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సులు చదవాలనుకునే వారికి అలర్ట్. జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష.. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్- 2023 నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఇంటర్(Inter) తర్వాత ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్ కోర్సులు (Engineering Courses) చదవాలనుకునే వారికి అలర్ట్. జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష.. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్- 2023 నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నెలలోనే నోటిఫికేషన్ రావచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. జేఈఈ మెయిన్-2023 కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ నవంబర్ చివరి నుంచి ఎన్‌టీఏ చేపట్టే అవకాశం ఉంది. ఇక పరీక్షలు రెండు సెషన్లలో జరగనున్నాయి. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత, ఎగ్జామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in లో అందుబాటులోకి రానున్నాయి.

* సెషన్-1 పరీక్షలు జనవరిలో..

జేఈఈ మెయిన్-2023 సెషన్-1 పరీక్షలు జనవరిలో, సెషన్-2 పరీక్షలు ఏప్రిల్‌లో నిర్వహించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఎన్‌టీఏ జేఈఈ -2023 నోటిఫికేషన్ లో వెల్లడించనుంది. నిబంధనల ప్రకారం రెండు సెషన్లలో దేంట్లో ఎక్కువ మార్కులు వస్తాయో, దాన్ని ర్యాంకులను లెక్కించడానికి పరిగణలోకి తీసుకోనున్నారు. విద్యార్థులు రెండింటిలో ఒక సెషన్‌ను మాత్రమే రాయటానికి కూడా ఎంపిక చేసుకోవచ్చు. రెండో సెషన్‌కు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ మార్చిలో ప్రారంభం కావచ్చు.

* ఈసారి కూడా భారీగా దరఖాస్తులు?

చాలా మంది అభ్యర్థులు తమ స్కోర్‌ పెంచుకోవడానికి జేఈఈ వివిధ సెషన్స్ కోసం అప్లై చేస్తుంటారు. ఇప్పటి వరకు ఒక సెషన్‌కు అప్లై చేసుకున్న అభ్యర్థుల సంఖ్య గరిష్టంగా 9.5 లక్షలకు చేరుకుంది. ఈ ఏడాది కూడా అదే స్థాయిలో అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

2022లో జూన్, జూలై ప్రయత్నాలతో సహా మొత్తంగా 10,26,799 మంది అభ్యర్థులు JEE మెయిన్ 2022 కోసం నమోదు చేసుకున్నారు. అయితే 9,05,590 మంది విద్యార్థులు మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఈ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలో మొత్తం 24 మంది అభ్యర్థులు 100 పర్సంటైల్ స్కోర్ సాధించి ఫస్ట్ ర్యాంక్ సొంతం చేసుకున్నారు. 2.5 లక్షలలోపు ర్యాంకు వచ్చిన అభ్యర్థులు IIT ప్రవేశ పరీక్ష - JEE అడ్వాన్స్‌డ్‌కు హాజరు కావడానికి అర్హులు.

* ఎగ్జామ్ ప్యాట్రన్

గతేడాది మాదిరిగానే జేఈఈ మెయిన్-2023 పేపర్ ప్యాట్రన్ రెండు సెక్షన్లుగా ఉంటుంది. సెక్షన్ -A మల్టిపుల్-ఛాయిస్ ప్రశ్నలు (MCQs) ఉంటాయి. ఇక, సెక్షన్-Bలో న్యూమరికల్ వాల్యు‌గా ఆన్సర్ చేయాల్సిన ప్రశ్నలు ఉంటాయి.సెక్షన్ A తప్పనిసరిగా ఆన్సర్ చేయాలి. అన్ని ప్రశ్నలను ప్రయత్నించాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి : కర్మయోగీ భారత్ రోజ్ గార్‌ మేళా.. 71వేల మందికి నియామక పత్రాలు..

ప్రతి సరైన సమాధానానికి నాలుగు మార్కులు కేటాయిస్తారు. అయితే, ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తీసివేయనున్నారు. సెక్షన్ Bలో అభ్యర్థులు ఇచ్చిన 10 ప్రశ్నలలో ఏవైనా ఐదు ప్రశ్నలను ప్రయత్నించాలి. సెక్షన్-Bలో నెగిటివ్ మార్కింగ్ ఉండదు. నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత, దీనికి సంబంధించిన అన్ని వివరాలను అభ్యర్థులు చెక్ చేసుకోవచ్చు.

First published:

Tags: Career and Courses, EDUCATION, IIT, Jee mains, JOBS

ఉత్తమ కథలు