హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main 2023: త్వరలో జేఈఈ మెయిన్ సెషన్-1 అడ్మిట్ కార్డ్స్ రిలీజ్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

JEE Main 2023: త్వరలో జేఈఈ మెయిన్ సెషన్-1 అడ్మిట్ కార్డ్స్ రిలీజ్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

JEE Main 2023: త్వరలో జేఈఈ మెయిన్ సెషన్-1 అడ్మిట్ కార్డ్స్ రిలీజ్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

JEE Main 2023: త్వరలో జేఈఈ మెయిన్ సెషన్-1 అడ్మిట్ కార్డ్స్ రిలీజ్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. జేఈఈ మెయిన్ -2023 సెషన్ 1 కోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్, ఎడిట్ ఆప్షన్ వంటి ప్రక్రియను పూర్తి చేసింది. త్వరలోనే అడ్మిట్ కార్డ్‌లను జారీ చేయనుంది.

  • Trending Desk
  • Last Updated :
  • Telangana, India

జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష జేఈఈ (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) మెయిన్ సెషన్-1 కోసం సర్వం సిద్ధమైంది. ఈ పరీక్ష ఏటా రెండు ‌స్లారు జరుగుతుంది. ఇప్పటికే పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. జేఈఈ మెయిన్ -2023 సెషన్ 1 కోసం ఇప్పటికే రిజిస్ట్రేషన్, ఎడిట్ ఆప్షన్ వంటి ప్రక్రియను పూర్తి చేసింది. త్వరలోనే అడ్మిట్ కార్డ్‌లను జారీ చేయనుంది. జేఈఈ మెయిన్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల కోసం jeemain.nta.nic.in అనే అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులోకి రానున్నాయి.

అడ్మిట్ కార్డ్ చెక్ చేసుకునే విధానం

- జేఈఈ మెయిన్ సెషన్-1 కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ముందుగా అధికారిక వెబ్‌సైట్ jeemain-nta.nic.in ఓపెన్ చేయాలి.

-హోమ్ పేజీలో అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయాలి.

-ఆ తరువాత అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.

-దీంతో జేఈఈ మెయిన్-2023 అడ్మిట్ కార్డ్ డిస్‌ప్లే‌పై కనిపిస్తుంది. భవిష్యత్ అవసరాల కోసం ప్రింట్ అవుట్ తీసుకోండి.

ముందుగా ఎగ్జామ్ సిటీ వివరాలు

JEE మెయిన్ అడ్మిట్ కార్డ్ విడుదలకు ముందు NTA ఎగ్జామ్ సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్‌ను విడుదల చేస్తుంది. అడ్మిట్ కార్డ్ జారీ తరువాత రిపోర్టింగ్ టైమ్, వెరిఫికేషన్ డాక్యుమెంట్స్, పాస్‌పోర్ట్-సైజ్ ఫోటో వంటి వివరాలను సరిగ్గా చెక్ చేసుకోవాలని ఎన్‌టీఏ కోరింది. ఏదైనా పొరపాటు జరిగితే వెంటనే తెలియజేయాలని సూచించింది.

రెండో సెషన్ ఏప్రిల్ 6 నుంచి..

జేఈఈ మెయిన్ 2023 రెండు సెషన్‌లో జరగనుంది. మొదటి సెషన్ జనవరి 24 నుంచి 31వరకు జరగనుంది. రెండో సెషన్ ఏప్రిల్ 6న ప్రారంభమై ఏప్రిల్ 12న ముగుస్తుంది. ప్రశ్నాపత్రం మల్టిపుల్-ఛాయిస్ క్వశ్చన్ రూపంలో (MCQ) A, B అనే రెండు విభాగాలుగా ఉంటుంది.

Budget 2023: బడ్జెట్ లో నిరుద్యోగులకు వరాలు.. 10లక్షల ఉద్యోగాల ప్రకటన..

అడ్మిషన్స్ అర్హత ప్రమాణాల్లో సవరణ

జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE)-2023 మెయిన్ ర్యాంక్ ఆధారంగా ఇన్‌స్టిట్యూట్స్ అడ్మిషన్స్ అర్హత ప్రమాణాలను ఎన్‌టీఏ సవరించింది. ఏదైనా బోర్డ్‌లో 12వ తరగతి పరీక్షలో టాప్ 20 పర్సంటైల్‌లో ఉన్న విద్యార్థులు JEE మెయిన్ 2023లో తమ పర్ఫార్మెన్స్ ఆధారంగా సెంట్రల్ ఫండెడ్ టెక్నికల్ ఇన్‌స్టిట్యూట్స్(CFTIs) అయిన ఐఐటీల్లో, ఎన్‌ఐటీల్లో కూడా ఇప్పుడు అడ్మిషన్స్ పొందేందుకు అర్హులు. జేఈఈ మెయిన్ -2023 మొదటి పేపర్ ద్వారా ఎన్‌ఐటీ, ఐఐటీ, సీఎఫ్‌టీఐ‌ల్లో BE, BTech వంటి అండర్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలను కల్పించనున్నారు. ఇక BArch, BPlanning కోర్సుల్లో ప్రవేశాలకు JEE మెయిన్ పేపర్ టూ ద్వారా కల్పించనున్నారు.

Police Recruitment: ఏపీ పోలీస్ ఉద్యోగాలు.. రేపటితో ముగియనున్న దరఖాస్తుల ప్రక్రియ..

జూన్ 4న జేఈఈ అడ్వాన్స్‌డ్

జేఈఈ మెయిన్‌లో టాప్ 2.5 లక్షల ర్యాంకు సాధించిన అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు అర్హత సాధిస్తారు. ఈ పరీక్ష ద్వారా ఐఐటీల్లోని ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. JEE అడ్వాన్స్‌డ్ కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఏప్రిల్ 30న ప్రారంభంకానుండగా, పరీక్ష జూన్ 4న జరగనుంది.

First published:

Tags: Career and Courses, Jee, JEE Main 2023, JOBS

ఉత్తమ కథలు