హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main: జేఈఈ మెయిన్‌లో తొలిసారి 30 శాతం దాటిన ఫిమేల్ అప్లికెంట్స్.. ఆ రాష్ట్రం నుంచే ఎక్కువ..

JEE Main: జేఈఈ మెయిన్‌లో తొలిసారి 30 శాతం దాటిన ఫిమేల్ అప్లికెంట్స్.. ఆ రాష్ట్రం నుంచే ఎక్కువ..

JEE Main: జేఈఈ మెయిన్‌లో తొలిసారి 30 శాతం దాటిన ఫిమేల్ అప్లికెంట్స్.. ఆ రాష్ట్రం నుంచే ఎక్కువ..

JEE Main: జేఈఈ మెయిన్‌లో తొలిసారి 30 శాతం దాటిన ఫిమేల్ అప్లికెంట్స్.. ఆ రాష్ట్రం నుంచే ఎక్కువ..

JEE Main: జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ జేఈఈ మెయిన్-2023 సెషన్-1 పరీక్షలు ప్రారంభమయ్యాయి. గతేడాదితో పోల్చితే ఈసారి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి? రాష్ట్రాలు, కేటగిరీ, సిటీ వారీగా ఈ శాతం ఎంత? అనే వివరాలను పరిశీలిద్దాం. 

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ఎంట్రన్స్ టెస్ట్ జేఈఈ మెయిన్-2023 (JEE Main 2023) సెషన్-1 పరీక్షలు ప్రారంభమయ్యాయి. దేశంలోని వివిధ నగరాల్లో ఏర్పాటు చేసిన 290 సెంటర్స్‌తో పాటు విదేశాల్లో 18 నగరాల్లో జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు జరగనున్నాయి. గతేడాదితో పోల్చితే ఈసారి ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి? రాష్ట్రాలు, కేటగిరీ, సిటీ వారీగా ఈ శాతం ఎంత? అనే వివరాలను పరిశీలిద్దాం.

టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ ప్రకారం.. ఈసారి మొత్తంగా 8.6 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ మెయిన్-2023 జనవరి సెషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే గతేడాది 2022 జూలై సెషన్‌తో పోలిస్తే ఈసారి 6,000 తక్కువ అప్లికేషన్స్ రావడం గమనార్హం.

* పెరిగిన ఫిమేల్ అప్లికెంట్స్

జేఈఈ మెయిన్ -2023 జనవరి సెషన్ కోసం వచ్చిన అప్లికేషన్లలో 6 లక్షలకు పైగా పురుష అభ్యర్థులకు సంబంధించినవి ఉన్నాయి. అంటే దాదాపు 70 శాతం పురుషులవే. మిగిలిన 30 శాతం మహిళలకు సంబంధించినవి. గతంతో పోలిస్తే జేఈఈ మెయిన్ కోసం ఈసారి అప్లై చేసుకున్న మహిళల సంఖ్య కొద్దిగా పెరిగింది. గతంలో 2.5 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, ఈసారి ఈ సంఖ్య 2.6 లక్షలకు చేరుకుంది.

*మహారాష్ట్ర మొదటి ప్లేస్

జేఈఈ మెయిన్-2023 జనవరి సెషన్ కోసం అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 103,039 అప్లికేషన్స్ వచ్చాయి. పర్సంటేజ్ పరంగా చూస్తే ఇది 12 శాతంగా ఉంది. తరువాతి స్థానంలో యూపీ ఉంది. ఆ రాష్ట్రం నుంచి 99,741 దరఖాస్తులు వచ్చాయి. పర్సంటేజ్ పరంగా చూస్తే ఇది 11.6శాతంగా ఉంది. లిస్టులో ఏపీ మూడో స్థానంలో నిలిచింది. ఈ రాష్ట్రం నుంచి 91,799 మంది అభ్యర్థులు.. అంటే 10.6 శాతం అప్లికేషన్స్ వచ్చాయి. తెలంగాణ , రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఈసారి జేఈఈ మెయిన్ దరఖాస్తులు 50వేలకు పైగా వచ్చాయి. తెలంగాణ నుంచి 86,840 మంది, రాజస్థాన్ నుంచి 59,641 మంది అభ్యర్థులు జేఈఈ మెయిన్ కోసం అప్లై చేసుకున్నారు.

* కేటగిరీ వారీగా...

కేటగిరీ వారీగా పరిశీలిస్తే... జనరల్ అభ్యర్థుల దరఖాస్తుల శాతం గతేడాదితో పోలిస్తే ఈసారి 41.8 శాతం నుంచి 38.3 శాతానికి పడిపోయింది. OBC కేటగిరీ అభ్యర్థుల అప్లికేషన్స్ పర్సెంటేజ్ 35.7 నుంచి 37.1 శాతానికి పెరిగింది. GEN-EWS కేటగిరీ అభ్యర్థుల దరఖాస్తులు గతంలో 9 శాతం ఉండగా, ఇప్పుడు 11.6 శాతానికి పెరిగింది.

ఇది కూడా చదవండి : గ్రాఫిక్ డిజైన్‌పై ఇంటర్న్‌షిప్‌ అవకాశాలు.. ఈ కంపెనీల్లో బెస్ట్ స్టైఫండ్‌ ఆఫర్..

* నగరాల్లో ఢిల్లీ టాప్

నగరాల్లో 36,530 దరఖాస్తులతో ఢిల్లీ టాప్ ప్లేస్‌లో నిలిచింది. 32,246 అప్లికేషన్స్‌లో హైదరాబాద్ రెండో స్థానంలో ఉంది. రాజస్థాన్‌లోని కోటా నుంచి 24,253 దరఖాస్తులు వచ్చాయని టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ వెల్లడించింది.

* మొత్తం 13 భాషల్లో పరీక్ష

JEE మెయిన్-2023 సెషన్ 1 పరీక్ష ఇంగ్లీష్, హిందీ, గుజరాతీ, కన్నడ, అస్సామీ, బెంగాలీ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూతో సహా మొత్తంగా 13 భాషల్లో నిర్వహిస్తున్నారు. జేఈఈ మెయిన్ రెండు పేపర్లుగా ఉంటుంది. BTech/ BE కోర్సుల్లో ప్రవేశాలను పేపర్-1 ఆధారంగా చేపట్టనున్నారు. పేపర్-2 ద్వారా బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్, బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు

First published:

Tags: Career and Courses, EDUCATION, JEE Main 2023, JOBS

ఉత్తమ కథలు