JEE Main-2023 : దేశంలోని ప్రముఖ ఎంట్రెన్స్ ఎగ్జామ్‌లలో జేఈఈ మెయిన్(JEE Main) ఒకటి. దీనికి చాలా పోటీ ఉంటుంది. టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఏటా జాతీయ స్థాయిలో అర్హత పరీక్షగా జేఈఈ(జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్) మెయిన్‌ను నిర్వహిస్తారు. తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) జేఈఈ మెయిన్-2023 నోటిఫికేషన్(JEE MAIN 2023 Notification) రిలీజ్ చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ డిసెంబర్ 15 నుంచి ప్రారంభం కాగా, జనవరి 12న ముగియనుంది. అర్హులైన అభ్యర్థులు జేఈఈ అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.in ద్వారా రిజిస్టర్ కావచ్చు.
జనవరి 24 నుంచి సెషన్-1 పరీక్షలు
జేఈఈ మెయిన్-2023 సెషన్-1 పరీక్షలు జనవరి 24 నుంచి 31వ తేదీ వరకు జరగనున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న పరీక్ష ఉండదు. ఇక, జేఈఈ మెయిన్ 2023 సెషన్ -2 పరీక్షలు ఏప్రిల్‌లో జరగనున్నాయి. ఈ పరీక్షల ఫలితాల ఆధారంగా 2023-24 అకడమిక్ ఇయర్ ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు.
జేఈఈ మెయిన్-2023 రిజిస్ట్రేషన్ విధానం
ముందుగా జేఈఈ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inను సందర్శించాల్సి ఉంటుంది. ఆ తరువాత హోమ్‌పేజీలో సెషన్-1 కోసం అందుబాటులో ఉన్న లింక్‌పై క్లిక్ చేయండి. కొత్త అభ్యర్థి రిజిస్టర్ అనే లింక్‌పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ వివరాల కోసం రిజిస్టర్ ప్రక్రియను పూర్తి చేయండి. ఆ తరువాత లాగిన్ అయి అప్లికేషన్ ఫారమ్‌లో అవసరమైన వివరాలు ఎంటర్ చేయండి. ఫోటో, సిగ్నేచర్, అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి. ఆ తరువాత రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించండి. ఆపై అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయండి. తరువాత కన్ఫర్మేషన్ పేజీని సేవ్ చేసుకోండి.
Microsoft: IoTలపై మాల్వేర్ దాడులు.. మొదటి మూడు దేశాల్లో ఇండియా.. మైక్రోసాఫ్ట్ నివేదిక వివరాలు ఇవే..
జనవరి మూడో వారంలో అడ్మిట్ కార్డ్
రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ జనవరి 12. ఎగ్జామ్ రాసే కేంద్రాల వివరాలను జనవరి రెండో వారంలో వెల్లడిస్తారు. మూడో వారంలో అడ్మిట్‌కార్డ్‌లు అందుబాటులోకి రానున్నాయి. జేఈఈ మెయిన్ -2023కు దరఖాస్తు చేసుకోవాలంటే అభ్యర్థులు ఫిజిక్స్, మ్యాథ్స్ తప్పనిసరి సబ్జెక్ట్స్‌గా ఇంటర్ పాసై ఉండాలి. బీఈ, బీటెక్ కోసం అభ్యర్థులు జేఈఈ మెయిన్స్ పేపర్-1 పరీక్షకు హాజరుకావాల్సి ఉంటుంది. BArch, BPlanning కోసం పేపర్-2 పరీక్ష రాయాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం.. అభ్యర్థులకు రెండు సెషన్లలో ఎందులో ఎక్కువ మార్కులు వస్తే దాన్ని బట్టి ర్యాంకు ప్రకటిస్తారు. రెండు సెషన్స్‌కు తప్పనిసరిగా హాజరుకావాల్సిన అవసరం లేదు. ఏదో ఒక సెషన్ రాయవచ్చు. లేదా రెండిటికి హాజరుకావచ్చు. JEE మెయిన్ పరీక్షకు సంబంధించిన అప్‌డేట్స్ కోసం అభ్యర్థులు SANDES అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మాక్ టెస్ట్‌లను ప్రయత్నించడానికి, ప్రిపరేషన్ చిట్కాలు తెలుసుకోవడానికి అభ్యర్థులు నేషనల్ టెస్ట్ అభ్యాస్ యాప్‌ను కూడా ఉపయోగించుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JEE Main 2023, Jee mains