జేఈఈ మెయిన్ సెషన్-1 కు దరఖాస్తు చేసుకున్నారా? అయితే.. మీకు అలర్ట్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ సెషన్-1 అప్లికేషన్ కరెక్షన్ విండోను ఓపెన్ చేసింది. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రేపు అంటే.. జనవరి 14వ తేదీ రాత్రి 11.50 గంటల వరకు తమ అప్లికేషన్లను ఎడిట్ చేసుకోవచ్చు. తద్వారా అప్లికేషన్ సమయంలో ఏమైనా తప్పులు దొర్లితే సరి చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న వారంతా తమ అప్లికేషన్ ఫామ్ ను ఓపెన్ చేసి తాము నమోదు చేసిన వివరాలను ఓ సారి చెక్ చేసుకోవడం బెటర్. తద్వారా తప్పులు ఏమైనా ఉంటే సరిదిద్దుకోవచ్చు.
దరఖాస్తులను సరిచేసుకోవడానికి స్టెప్స్:
Step 1: అభ్యర్థులు మొదటగా.. jeemain.nta.nic.in ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం హోం పేజీలో JEE(Main) 2023 Session 1 Application లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3: తర్వాత అప్లికేషన్ నంబర్, పాస్వర్డ్, సెక్యూరిటీ పిన్ ను నమోదు చేసి Sign In ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 4: మీ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. వివరాలను సరి చూసుకోవాలి.
ఏమైనా తప్పులను గమనిస్తే సరి చూసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, JEE Main 2023, JOBS