Home /News /jobs /

JEE MAIN 2022 WILL HAVING LESS THAN 4 ATTEMPTS IMPACT YOUR PERFORMANCE JEEMAIN NTA NIC IN GH VB

JEE Main 2022: జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ నాలుగు దశల్లో ఉండకపోతే.. విద్యార్థుల ప్రిపరేషన్‌పై ప్రభావం ఉంటుందా..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

కరోనా కారణంగా గతేడాది  JEE మెయిన్స్ పరీక్షను నాలుగు విడతల్లో నిర్వహించారు. అయితే తాజాగా విద్యా మంత్రిత్వ శాఖ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జేఈఈ మెయిన్స్‌ పరీక్షను కేవలం రెండుసార్లు మాత్రమే రాయడానికి విద్యార్థులకు అనుమతి ఇవ్వనున్నారు.

ఇంకా చదవండి ...
ఇంజనీరింగ్(Engineering) చేరే విద్యార్థుల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ (JEE) మెయిన్స్ పరీక్షలను ఈసారి తక్కువ సార్లు నిర్వహించే అవకాశం ఉంది. కరోనా కారణంగా గతేడాది JEE మెయిన్స్ పరీక్షను నాలుగు విడతల్లో నిర్వహించారు. అయితే తాజాగా విద్యా మంత్రిత్వ శాఖ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం జేఈఈ మెయిన్స్‌ పరీక్షను కేవలం రెండుసార్లు మాత్రమే రాయడానికి విద్యార్థులకు అనుమతి ఇవ్వనున్నారు. ఈ మేరకు పరీక్షను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన NTA నుంచి రావాల్సి ఉంది. ఒకసారి నోటిఫికేషన్ విడుదలైతే జేఈఈ మెయిన్స్(JEE Mains) కోసం ప్రిపరేషన్ కావడానికి విద్యార్థులకు కొన్ని వారాల సమయం మాత్రమే ఉంటుంది.

ఈ నెలలోనే jeemain.nta.nic.in లేదా nta.ac.inలో త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. తమ ముందు బ్యాచ్‌ల మాదిరిగానే మేము సవాళ్లను ఎదుర్కొన్నామని, దీంతో ఈ ఏడాది కూడా నాలుగుసార్లు అట్మెంట్ చేయడానికి అవకాశం కల్పించాలని పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మరి, విద్యార్థుల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని పరీక్షను ఎక్కువసార్లు నిర్వహిస్తారో లేదో చూడాలి.

ఇది కూడా చదవండి: ఊపిరిపీల్చుకోండి.. ఈ నియమాలు అనుసరిస్తే మీ ఊపిరితిత్తులకు ఏ హానీ కలగదు..!


పరీక్షల అట్మెంట్ సంఖ్య తగ్గిస్తే పాస్ కావడం లేదా మంచి ర్యాంకు సాధించేందుకు అవకాశాలు సన్నగిల్లుతాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షల అట్మెంట్ చేసే సంఖ్య తగ్గినప్పటికీ, ప్రిపరేషన్‌లో స్ర్టాటజీలో మాత్రం తేడా ఉండదని నిపుణులు భావిస్తున్నారు. JEE అడ్వాన్స్‌డ్‌ పరీక్షను రెండుసార్లు నిర్వహించడం వల్ల IIT ఔత్సాహికులకు పరీక్షకు సిద్ధం కావడానికి ఎక్కువ లభిస్తుంది. మరోపక్క కొత్త అకడమిక్ సెషన్‌ను ప్రారంభించడంలో ఏర్పడే జాప్యాన్ని నిరోధించవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

విద్యామందిర్ క్లాసెస్ అకడమిక్ డైరెక్టర్ సౌరభ్ కుమార్ మాట్లాడుతూ... ఎక్కువ సార్లు పరీక్ష అట్మెంట్ చేయాలనే మైండ్‌సెట్ ను విరమించుకుని... గతంలో మాదిరి రెండు సార్లు రాయడానికి అనుమతి ఇవ్వాలని కోరారు. సిలబస్ మాత్రం అదే ఉంటుందని, పరీక్ష నిర్వహించే విధానంలో ఏమాత్రం మార్పు ఉండదన్నారు.

జేఈఈ పరీక్షలను క్రమ పద్దతిలో నిర్వహించాలన్నారు. జేఈఈ పరీక్ష, బోర్డు ఎగ్జామ్స్ ఒకే రోజు ఉండకుండా చూడాలన్నారు. లేకపోతే విద్యార్థులు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉందన్నారు. బోర్డు పరీక్షలు ముగిసిన తరువాతనే జేఈఈ మెయిన్స్ నిర్వహించడం ఉత్తమైన మార్గమని కుమార్ అన్నారు. కాగా, CBSE టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ 26 నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే.

Online Degree Courses: ఆన్‌లైన్‌ డిగ్రీ కోర్సులను యూజీసీ సిద్ధం.. దేశవ్యాప్తంగా 900 కళాశాలల్లో అందుబాటులోకి..!


విద్యార్థులు ప్రధానంగా JEE మెయిన్స్‌తో పాటు బోర్డు పరీక్షలపై దృష్టిసారించాలని FIIT JEE నోయిడా హెడ్ రమేష్ బాట్లీష్ అన్నారు. ప్రతి‌రోజు మాక్ టెస్ట్‌లో పాల్గొంటూ పరీక్షను ఎంతలోపు పూర్తి చేస్తున్నారో గమనించుకోవాలని విద్యార్థులకు సూచించారు. వీక్ ఉన్న టాఫిక్స్‌పై దృష్టిసారించాలన్నారు. ప్రిపరేషన్‌ అనేది విద్యార్థులను బట్టి ఉంటుందని చెప్పారు. ఒక సంవత్సరం నుంచి ప్రిపేర్ అవుతున్న వారికి నాలుగు దశల్లో ఎగ్జామ్ ఉండకపోయినా పెద్దగా ప్రభావం ఉండదన్నారు. ఎందుకంటే ఇప్పటికే వారి బలహీనతలు తెలుసి ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం 12వ తరగతి చదువుతున్న వారు ఇంతకు ముందే స్వతహాగా ప్రిపరేషన్ అవ్వడం లేదా ప్రముఖ కోచింగ్ సంస్థల్లో కరస్పాండెన్స్ కోర్సులో చేరి ఉంటే తాజాగా వీరికి జాతీయ స్థాయిలో ఎంత ర్యాంకు వస్తుందో తెలుసుకోవడానికి అవకాశం ఉందన్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Entrance exams, Exams, Jee, JEE Main 2021

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు