నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) జేఈఈ మెయిన్ షెడ్యూల్‌ను (JEE Main 2022 schedule) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2022 (JEE Main 2022) పరీక్షలను నిర్వహిస్తారు. ఈ ఏడాది రెండు విడుతల్లో మాత్రమే జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. ఏప్రిల్ 16, 2022 నుంచి ఏప్రిల్ 21, 2022 వరకు మొదటి సెషన్, మే 24, 2022 నుంచి మే 29, 2022 వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు దరఖాస్తు విధానం, ఎక్జామ్ ప్యాటర్న్‌లో సందేహాల నివృత్తికి చదవండి.
1. పరీక్షకు అర్హతలు, వయోపరిమితి ఎంత?
ఈ పరీక్షలకు 2020, 2021లో ప్లస్ టు లేదా ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు అర్హులు. అలాగే ఈ ఏడాది ఇంటర్ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా అర్హులే. తెలుగుతోపాటు మొత్తం పదమూడు భాషల్లో ఎగ్జామ్ రాసే వీలుంది. ఈ పరీక్ష రాయడానికి ప్రత్యేకమైన వయోపరిమితి లేదు.
2. పరీక్ష విధానం ఎలా ఉంటుంది?
ప్రశ్నపత్రాన్ని రెండు విభాగాలుగా విభజించారు. పేపర్-1లో 90 ప్రశ్నలు ఉంటాయి. అభ్యర్థి 75 ప్రశ్నలకు మాత్రమే రాయాలి. 15 ఐచ్ఛిక ప్రశ్నలకు నెగిటివ్ మార్కులు ఉండవు. పేపర్ వారీగా పరిశీలిస్తే..
బీఈ/బీటెక్(పేపర్-1 నాలుగు సెషన్సలో ఉంటుంది): ప్రతి సబ్జెక్టు రెండు సెక్షన్లుగా ఉంటుంది. సెక్షన్-ఏలో అన్ని ప్రశ్నలు మల్టిపుల్ చాయిస్లో ఉంటాయి, సెక్షన్-బిలో ఇచ్చిన 10 ప్రశ్నల్లో ఏవైనా ఐదు ప్రశ్నలకు జవాబులు రాయాలి, ఈ విభాగంలో నెగిటివ్ మార్కులు ఉండవు.
బీఆర్క్(పేపర్ 2ఏ)- పార్ట్-1లో రెండు విభాగాలు ఉంటాయి. సెక్షన్-ఏ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, సెక్షన్-బీలో ఇచ్చిన 10 ప్రశ్నల్లో ఐదింటికి సమాధానాలు రాయాలి. వీటికి నెగిటివ్ మార్కులు ఉండవు.
బీ-ప్లానింగ్(పేపర్ 2బీ) ఇందులోని పార్ట్-1లో రెండు విభాగాలు ఉంటారుు. సెక్షన్-ఏ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు, సెక్షన్-బీలో 10 ప్రశ్నలు ఉంటారుు. వాటిలో ఐదు ప్రశ్నలకు జవాబులు రాయాలి, వీటికీ నెగిటివ్ మార్కులు ఉండవు.
సెక్షన్ బీలో ఇచ్చిన 10 ప్రశ్నల్లో అభ్యర్థి ఏవైనా ఐదు ప్రశ్నలను ఎంచుకుని జవాబులు రాయవచ్చు.
JEE Main 2022: జేఈఈ మెయిన్ 2022లో పలు మార్పులు.. డిజిటల్ లాకర్లు, ఈ స్కోర్ కార్డులు
3.ఎన్ని భాషల్లో రాయొచ్చు?
తెలుగుతోపాటు మొత్తం పదమూడు భాషల్లో ఎగ్జామ్ రాసే వీలుంది.
4. స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే ఏమిటీ?
స్టేట్ కోడ్ ఆఫ్ ఎలిజిబిలిటీ అంటే రాష్ట్రం యొక్క కోడ్. అభ్యర్థి 12వ తరగతి ఉత్తీర్ణత (లేదా తత్సమానం) అర్హత కలిగి ఉంటేనే
JEE (మెయిన్) - 2022లో హాజరు కావడానికి అర్హత పొందుతాడు.
5. విదేశీ విద్యార్థులు అడ్రస్ పిన్ కోడ్ ఏం పెట్టాలి.?
జేఈఈ మెయిన్‌కు దరఖాస్తు చేసుకొనే విదేశీ విద్యార్థులు పిన్‌కోడ్ ప్లేస్‌లో 000000 నమోదు చేయాలి
6. ఫీజు ఎలా చెల్లించాలి..
దరఖాస్తు పూర్తయిన అభ్యర్థులు ఫీజు ఆన్లైన్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చు.
దరఖాస్తు విధానం..
NTA అధికారిక వెబ్సైట్ www.jeemain.nta.nic.in కి వెళ్లండి.
హోమ్‌పేజీలో జేఈఈ మెయిన్ అప్లికేషన్ ఫారమ్‌పై క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అవసరమైన అన్ని వివరాలు పూరించి, డాక్యుమెంట్లను సబ్మిట్ చేయండి.
రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, ఆన్లైన్ విధానంలో ఫీజు చెల్లించండి.
భవిష్యత్తు సూచన కోసం ఫారమ్‌ను డౌన్లోడ్ చేయండి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, EDUCATION, Jee mains, Jee mains 2022