హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

IIT, NIT Admissions: ఐఐటీలో ఇంజనీరింగ్​ చేయడమే మీ లక్ష్యమా..? అయితే, జేఈఈ మెయిన్​​ కోసం ఇలా ప్రిపేవరవ్వండి..

IIT, NIT Admissions: ఐఐటీలో ఇంజనీరింగ్​ చేయడమే మీ లక్ష్యమా..? అయితే, జేఈఈ మెయిన్​​ కోసం ఇలా ప్రిపేవరవ్వండి..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఐఐటీల్లో ఇంజనీరింగ్ విద్యనభ్యసించాలనుకునే వారు జేఈఈ మెయిన్​ను క్రాక్​ చేసేందుకు మంచి ప్లానింగ్‌తో ప్రిపేర్​ అవుతుంటారు. జేఈఈ మెయిన్​లో టాప్ 2.5 లక్షల మంది అభ్యర్థులను జేఈఈ అడ్వాన్సుడ్​కు షార్ట్​లిస్ట్​ చేస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్​లో వచ్చిన మార్కుల ఆధారంగా ఐఐటీ (IIT), ఎన్​ఐటీ (NIT), ఇతర వర్సిటీల్లో ప్రవేశాలుంటాయి.

ఇంకా చదవండి ...

దేశంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీ(IIT), ఎన్​ఐటీ(NIT) సంస్థల్లో ఇంజినీరింగ్​ ప్రవేశాలకు ఏటా నిర్వహించే జేఈఈ మెయిన్ 2022 (JEE Main 2022) నోటిఫికేషన్(Notification) త్వరలోనే విడుదల కానుంది. ఈ పరీక్షను రెండు లేదా అంతకంటే ఎక్కువ సెషన్లలో జరిగే అవకాశం ఉంది. ఐఐటీల్లో ఇంజనీరింగ్(Engineering) విద్యనభ్యసించాలనుకునే వారు జేఈఈ మెయిన్​ను క్రాక్​ చేసేందుకు మంచి ప్లానింగ్‌తో ప్రిపేర్(Prepair)​ అవుతుంటారు. జేఈఈ మెయిన్​లో టాప్ 2.5 లక్షల మంది అభ్యర్థులను జేఈఈ అడ్వాన్సుడ్​కు షార్ట్​లిస్ట్​ చేస్తారు. జేఈఈ అడ్వాన్స్‌డ్​లో వచ్చిన మార్కుల ఆధారంగా ఐఐటీ (IIT), ఎన్​ఐటీ (NIT), ఇతర వర్సిటీల్లో ప్రవేశాలుంటాయి.

జేఈఈ 2022కి ఎలా సిద్ధమవ్వాలి..?

ముందుగా జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్‌ల సిలబస్‌ను బాగా అవగాహన చేసుకోండి. జేఈఈ ప్రిపరేషన్​కు అవసరమయ్యే స్టడీ మెటీరియల్‌ని కలెక్ట్ చేసుకోండి. మీ ప్రిపరేషన్​ ప్లాన్​ను సిద్దం చేసుకోండి. పరీక్ష పూర్తయ్యే వరకు ఇతర అన్ని వ్యాపకాలకు దూరంగా ఉండి ప్రిపరేషన్​పైనే దృష్టిసారించండి. ప్రతిరోజూ ఒకే సమయంలో చదువుకోవడం అలవాటు చేసుకోండి. ఏదైనా టాపిక్​ చదువుతున్నప్పుడు నోట్స్ రాసుకోండి. ఇది రివిజన్ సమయంలో ఉపయోగపడుతుంది. చదువు మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోండి. రిఫ్రెష్​ కోసం యోగా చేయండి.

Scholarships: ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం యూజీసీ నాలుగు కొత్త స్కాలర్​షిప్స్​.. అర్హత, దరఖాస్తు ప్రక్రియ పూర్తి వివరాలివే..


స్టడీ ప్లాన్ ఇలా..

జేఈఈ మెయిన్​లో మొత్తం మూడు సబ్జెక్ట్​ల నుంచి ప్రశ్నలొస్తాయి. మ్యాథ్స్​, ఫిజిక్స్​, కెమెస్ట్రీ నుంచి ప్రశ్నలడుగుతారు. కాబట్టి, ఈ మూడు సబ్జెక్టులను ప్రతి రోజూ కవర్ చేసేలా మీ ప్రిపరేషన్​ షెడ్యూల్‌ను సిద్ధం చేసుకోండి. ఏ సబ్జెక్ట్‌ను నిర్లక్ష్యం చేయవద్దు లేదా ఒక సబ్జెక్టుకు ఎక్కువ సమయం కేటాయించవద్దు. మొదట థియరీ భాగాన్ని చదివి, ఆపై ప్లాబ్లమ్స్​ను ప్రాక్టీస్ చేయండి. తక్కువ సమయంలో ప్లాబ్లమ్స్​ను సాల్వ్​ చేయడంపైనే మీ జేఈఈ స్కోర్​ ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఆన్సర్​ను త్వరగా రాబట్టేలా షార్ట్​కట్ టెక్నిక్స్​ను అనుసరించండి. రోజుకు కనీసం 20 ప్రాబ్లమ్స్​ను సాల్వ్​ చేసేలా ప్రణాళిక సిద్దం చేసుకోండి. ఆ తర్వాత వాటి సంఖ్య క్రమంగా పెంచుకోండి.

సబ్జెక్ట్ వారీగా స్టడీ చిట్కాలు..

ఫిజిక్స్​

ఇతర సబ్జెక్టులతో పోలిస్తే ఫిజిక్స్​ కాస్త కఠినంగా ఉంటుంది. అయితే ప్లానింగ్‌తో చదివితే దీనిలో మంచి మార్కులు తెచ్చుకోవడం సులభమే. ముఖ్యంగా మెకానిక్స్, ఫ్లూయిడ్స్, హీట్, థర్మోడైనమిక్స్, వేవ్స్ అండ్ సౌండ్, కెపాసిటర్స్ & ఎలెక్ట్రోస్టాటిక్స్, మాగ్నెటిక్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఆప్టిక్స్, మోడరన్ ఫిజిక్స్ వంటి టాపిక్స్​పై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి, ఫిజిక్స్​లో ఎక్కువ ప్రాబ్లమ్స్​పై దృష్టి పెట్టాలి.

IIT Mentorship: స్కూల్ గర్ల్స్ కోసం STEM మెంటర్‌షిప్ ప్రోగ్రామ్‌.. తాజాగా ప్రారంభించిన ప్రముఖ విద్యాసంస్థ..


కెమిస్ట్రీ

ప్లానింగ్ ప్రకారం చదివితే సులభంగా మంచి స్కోరు సాధించే అవకాశం ఉన్న సబ్జెక్ట్ కెమెస్ట్రీ. క్వాలిటేటివ్ అనాలిసిస్, కోఆర్డినేషన్ కెమిస్ట్రీ & కెమికల్ బాండింగ్ ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఎలక్ట్రో కెమిస్ట్రీ, థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం ఇన్ ఫిజికల్ కెమిస్ట్రీ, ఆల్డిహైడ్ & కీటోన్, ఆల్కైల్ & ఆర్గానిక్ కెమిస్ట్, ఇన్ ఆర్గానిక్ కెమిస్ట్రీ వంటి టాపిక్స్​పై ఎక్కువ సాధన చేయాలి. వీటిలో నుంచి ఎక్కువ ప్రశ్నలడుగుతారు.

మ్యాథ్స్​

జేఈఈలో మంచి ర్యాంకు సాధించాలంటే మ్యాథ్స్​ స్కోరు చాలా కీలకం. అందుకే, ప్రతి రోజూ తప్పనిసరిగా మ్యాథ్స్​ కోసం ఎక్కువ సమయం కేటాయించాలి. మ్యాథ్స్​లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ & ఎక్స్‌ప్రెషన్స్, కాంప్లెక్స్ నంబర్స్, ప్రాబబిలిటీ, వెక్టర్స్ & 3D ఆల్​జీబ్రా, మ్యాట్రిక్స్​, సర్కిల్, హైపర్ బోలా; ఫంక్షన్స్​, లిమిట్స్​, డెరివేటివ్స్​, ఇంటిగ్రల్స్​పై ఎక్కువ దృష్టి పెట్టాలి. మ్యాథ్స్​ ప్రాబ్లమ్స్​ ఎంత ఎక్కువ సాధన చేస్తే అంత వేగంగా ఆన్సర్​ రాబట్టవచ్చు.

First published:

Tags: Career and Courses, EDUCATION

ఉత్తమ కథలు