హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main: జేఈఈ మెయిన్ 2022 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?

JEE Main: జేఈఈ మెయిన్ 2022 రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..?

దేశంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్​ఐటీల్లో ఇంజనీరింగ్​ ప్రవేశాలకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్ 2022 రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు ఇక్కడ తెలిపిన వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దేశంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్​ఐటీల్లో ఇంజనీరింగ్​ ప్రవేశాలకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్ 2022 రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు ఇక్కడ తెలిపిన వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దేశంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్​ఐటీల్లో ఇంజనీరింగ్​ ప్రవేశాలకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్ 2022 రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు ఇక్కడ తెలిపిన వెబ్ సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

  దేశంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్​ఐటీల్లో ఇంజనీరింగ్​ ప్రవేశాలకు నిర్వహించనున్న జేఈఈ మెయిన్ 2022 రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయి. అభ్యర్థులు www.jeemain.nta.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈసారి జేఈఈ మెయిన్​లో రెండు ప్రయత్నాలు మాత్రమే ఉంటాయని పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ధ్రువీకరించింది. అంటే, వచ్చే విద్యా సంవత్సరంలో ఇంజినీరింగ్​ అడ్మిషన్ల కోసం జేఈఈ మెయిన్ 2022 రెండు సెషన్లలో మాత్రమే నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్ సెషన్ 1 ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగనుండగా, సెషన్ 2 మే 24 నుంచి 29 వరకు ఉంటుంది. జేఈఈ మెయిన్(Jee Main)​ దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. మార్చి 31 సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అభ్యర్థులు మార్చి 31 రాత్రి 11:30 గంటల వరకు ఫీజు చెల్లించవచ్చు. సెషన్ 2 కోసం దరఖాస్తు విండో త్వరలోనే ఓపెన్​ అవుతుంది. దరఖాస్తు ఫారమ్‌ను సబ్​మిట్​ చేసిన తర్వాత ఎటువంటి సవరణలను అనుమతించరు. కాబట్టి అభ్యర్థులు చాలా జాగ్రత్తగా దరఖాస్తు ఫారమ్‌ను పూరించాల్సి ఉంటుంది.

  Degree Jobs: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం.. పూర్తి వివరాలిలా..


  జేఈఈ మెయిన్ దరఖాస్తుకు అవసరమైన డాక్యుమెంట్లు

  JPG/JPEG ఫార్మాట్​లో 10 kb నుండి 200 kb సైజులో స్కాన్డ్​ పాస్‌పోర్ట్ ఫోటో

  JPG/JPEG ఫార్మాట్​లో 4 kb నుండి 30 kb మధ్య అభ్యర్థి సిగ్నేచర్​ స్కాన్డ్​ కాపీ

  50kb నుండి 300kb మధ్య పీడీఎఫ్​ ఫార్మాట్​లో అభ్యర్థి క్యాస్ట్​ సర్టిఫికెట్​

  50 kb నుండి 300 kb మధ్య పీడీఎఫ్​ ఫార్మాట్​లో PwD సర్టిఫికేట్ స్కాన్ కాపీ

  ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

  NTA అధికారిక వెబ్‌సైట్‌ www.jeemain.nta.nic.in కి వెళ్లండి.

  హోమ్‌పేజీలో జేఈఈ మెయిన్ అప్లికేషన్ ఫారమ్‌పై క్లిక్ చేయండి. కొత్త పేజీ ఓపెన్​ అవుతుంది.

  అవసరమైన అన్ని వివరాలు పూరించి, డాక్యుమెంట్లను సబ్​మిట్​ చేయండి.

  రిజిస్ట్రేషన్​ పూర్తయిన తర్వాత, ఆన్‌లైన్ విధానంలో ఫీజు చెల్లించండి.

  భవిష్యత్తు సూచన కోసం ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేయండి.

  జేఈఈ మెయిన్ దరఖాస్తు రుసుము

  జనరల్ అభ్యర్థులు రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ. 325 చెల్లించాలి. విదేశీ విద్యార్థులైతే రూ. 3000 చెల్లించాలి. విదేశాల నుంచి వచ్చే మహిళలు, థర్డ్ జెండర్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.1500 ఫీజు చెల్లిస్తే సరిపోతుంది.

  ఈ సారి రెండు ప్రయత్నాలు మాత్రమే..

  కాగా, జేఈఈ మెయిన్ 2021 లాగా జేఈఈ మెయిన్ 2022 కూడా నాలుగు ప్రయత్నాలను కలిగి ఉంటుందని విద్యార్థులంతా భావించారు. గతేడాది, కరోనా కారణంగా JEE మెయిన్​లో అదనంగా రెండు అటెంప్ట్​లు​ ఇచ్చారు. అయితే, దీని వల్ల అడ్మిషన్లు ఆలస్యంగా ప్రారంభమయ్యాయి. అంతేకాదు, ప్రవేశ పరీక్షలో పలుచోట్ల అక్రమాలు చోటుచేసుకున్నాయి. ఈ సంవత్సరం, టీనేజర్లకు సైతం టీకాలు వేయడం, కరోనా కేసుల సంఖ్య భారీగా తగ్గడంతో, రెండు అదనపు ప్రయత్నాలను తొలగించాలని ఎన్​టీఏ నిర్ణయించింది.

  Railway Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 756 జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్


  అయితే, గతేడాది మాదిరిగానే నాలుగు ప్రయత్నాలు ఇవ్వాలని విద్యార్థులు డిమాండ్​ చేస్తున్నారు. ఇదిలా ఉంటే, జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 తేదీలను ప్రకటించింది ఎన్​టీఏ. జూన్ 3న జేఈఈ అడ్వాన్సుడ్​ పరీక్ష జరగనుంది. దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ జూన్ 8న ప్రారంభమవుతుంది. ఈ ఏడాది జేఈఈ పరీక్షల నిర్వహణ బాధ్యతను ఐఐటీ బాంబే నిర్వహిస్తుంది.

  First published:

  Tags: Applications, Career and Courses, Jee, Jee mains, Registrations

  ఉత్తమ కథలు