హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main 2022: జేఈఈ మెయిన్‌ పరీక్షలు వాయిదా..? విద్యార్థుల డిమాండ్ ఇదే..

JEE Main 2022: జేఈఈ మెయిన్‌ పరీక్షలు వాయిదా..? విద్యార్థుల డిమాండ్ ఇదే..

జేఈఈ పరీక్షల వివరాలు వెల్లడించిన వెంటనే పలువురు విద్యార్థులు సోషల్‌ మీడియాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జేఈఈ మొదటి విడత పరీక్షలను మే నెలలో నిర్వహించాలని కోరుతున్నారు.

జేఈఈ పరీక్షల వివరాలు వెల్లడించిన వెంటనే పలువురు విద్యార్థులు సోషల్‌ మీడియాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జేఈఈ మొదటి విడత పరీక్షలను మే నెలలో నిర్వహించాలని కోరుతున్నారు.

జేఈఈ పరీక్షల వివరాలు వెల్లడించిన వెంటనే పలువురు విద్యార్థులు సోషల్‌ మీడియాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జేఈఈ మొదటి విడత పరీక్షలను మే నెలలో నిర్వహించాలని కోరుతున్నారు.

  ఈ ఏడాది జేఈఈ మెయిన్‌ (JEE Main) పరీక్షలు నిర్వహించే తేదీలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA- National Testing Agency) ప్రకటించింది. అప్లికేషన్‌ ఫార్మ్స్‌, పూర్తి వివరాలు jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. జేఈఈ మెయిన్‌ మొదటి విడత పరీక్షలు ఏప్రిల్‌ 16వ తేదీ నుంచి 21వ తేదీ వరకు, రెండో విడత పరీక్షలు మే 24వ తేదీ నుంచి 29వ తేదీ వరకు జరగనున్నాయి. ఆయా బోర్డులు నిర్వహించనున్న పబ్లిక్‌ పరీక్షలకు, ఇంజనీరింగ్‌(Engineering) ప్రవేశ పరీక్షకు మధ్య తక్కువ సమయం, లేదా అసలు సమయం లభించకపోయే పరిస్థితి నెలకొంది. జేఈఈ(JEE) పరీక్షల వివరాలు వెల్లడించిన వెంటనే పలువురు విద్యార్థులు సోషల్‌ మీడియాల్లో ఆందోళన వ్యక్తం చేశారు. పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. జేఈఈ మొదటి విడత పరీక్షలను మే నెలలో నిర్వహించాలని కోరుతున్నారు.

  Railway Recruitment 2022: నిరుద్యోగులకు అలర్ట్.. రైల్వేలో 756 జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్


  గతంలో నిర్వహించినట్లు జేఈఈ మెయిన్‌ను నాలుగు విడతల్లో నిర్వహించాలని కొందరు విద్యార్థులు కోరుతున్నారు. గతేడాది జేఈఈ మెయిన్‌ నాలుగు విడతల్లో జరిగింది. కరోనా కారణంగా అప్పట్లో అధికారులు ఇలాంటి ఏర్పాట్లు చేశారు. అయితే ఈ ఏడాది రెండు విడతల్లోనే జేఈఈ మెయిన్‌ పరీక్షలను ముగించాలని ఎన్‌టీఏ నిర్ణయించడాన్ని కొందరు విద్యార్థులు వ్యతిరేకిస్తున్నారు. ప్రత్యక్ష పద్ధతుల్లో బోర్డులు నిర్వహిస్తున్న పబ్లిక్‌ పరీక్షలను(Board Exams), ప్రాక్టికల్స్‌(Practicals)ను ఎదుర్కొని రెండు విడతల జేఈఈ మెయిన్‌ను రాయడం సాధ్యం కాదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  ఈ విషయంపై ట్విట్టర్‌లో ఓ విద్యార్థి స్పందిస్తూ.. ‘జేఈఈ మెయిన్‌ను మూడు లేదా నాలుగు విడతలుగా నిర్వహించాలి. అది సాధ్యం కాకపోతే మొదటి విడత జేఈఈ మెయిన్‌ను మే నెలలో, రెండో విడత జేఈఈ మెయిన్‌ను జులై నెలలో జరపాలి. కచ్చితంగా పరీక్షలను వాయిదా వేయాలి.’ అని ట్వీట్‌ చేశారు.

  మరో విద్యార్థి.. ‘మాకు జేఈఈ మెయిన్‌ను నాలుగు విడతలుగా నిర్వహించాల్సిన అవసరం లేదు. కానీ జేఈఈ మెయిన్‌ రెండు విడతలను అయినా సక్రమంగా జరపండి. రెండు విడతలకు మధ్య కనీసం 30 నుంచి 35 రోజుల సమయం ఉండేలా చూడండి.’ అని కోరారు.

  జేఈఈ మెయిన్‌ అప్లికేషన్‌ ప్రాసెస్ బుధవారం ప్రారంభమైంది. మార్చి 31వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అప్లికేషన్లు స్వీకరిస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 31వ తేదీన రాత్రి 11.30 వరకు జరిమానా కట్టి అప్లై చేసుకొనే అవకాశం ఉంది. అనంతరం రెండో విడత జేఈఈ మెయిన్‌కు అప్లికేషన్‌ విండో అందుబాటులోకి వస్తుంది.

  దీనిపై నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ ఓ ప్రకటన విడుదల చేసింది. అందులో..‘మొదటి విడత జేఈఈ మెయిన్‌లో అవసరమైన మార్కులు సాధించలేని అభ్యర్థులు, జేఈఈ మెయిన్‌ రెండో విడత పరీక్షలను రాయవచ్చు. తమ స్కోరును పెంచుకొనే అవకాశం ఉంది. ఓ అభ్యర్థి రెండు విడతల పరీక్షలను రాయాలనే నిబంధన లేదు. ఒకవేల రెండు విడతల్లో నిర్వహించిన జేఈఈ మెయిన్‌ను అభ్యర్థి రాస్తే.. ఏ పరీక్షలో అయితే అభ్యర్థికి ఎక్కువ మార్కలు వస్తాయో, వాటినే ఎన్‌టీఏ పరిగణలోకి తీసుకొంటుంది.’ అని వివరించింది.

  First published:

  Tags: Career and Courses, Jee mains, Jee mains 2022, Students

  ఉత్తమ కథలు