హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main 2022: జేఈఈ మెయిన్ సెషన్-2 అప్లికేషన్ ఫారమ్స్ విడుదల.. ఆ తేదీలలో పరీక్షలు..

JEE Main 2022: జేఈఈ మెయిన్ సెషన్-2 అప్లికేషన్ ఫారమ్స్ విడుదల.. ఆ తేదీలలో పరీక్షలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జేఈఈ (మెయిన్) -2022 సెషన్ 1 కోసం దరఖాస్తు చేసి, పరీక్ష ఫీజు చెల్లించిన అభ్యర్థులు JEE మెయిన్ 2022 సెషన్- 2కి హాజరు కావాలంటే తమ మునుపటి (సెషన్ -1) అప్లికేషన్ నంబర్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. సెషన్ 2 కోసం పేపర్, పరీక్ష మీడియం,  పరీక్ష నగరాలను మాత్రమే ఎంచుకోవాలి.

ఇంకా చదవండి ...

దేశవ్యాప్తంగా వివిధ కాలేజీల్లో ఇంజనీరింగ్ సీట్ల కోసం జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్(JEE) నిర్వహిస్తారు. గతేడాది నాలుగు సెషన్‌ల్లో నిర్వహించగా, ఈసారి మాత్రం రెండు సార్లు మాత్రమే నిర్వహించనున్నారు. ఇప్పటికే సెషన్ 1 దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. తాజాగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సెషన్ 2 కోసం దరఖాస్తు ప్రక్రియను ఫ్రారంభించింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు jeemain.nta.nic.in లేదా nta.ac.in ద్వారా జూన్ 30 రాత్రి 9 గంటలలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్ పరీక్ష జూలై 21 నుంచి 30 వరకు జరుగుతుంది. జేఈఈ (మెయిన్) -2022 సెషన్ 1 కోసం దరఖాస్తు చేసి, పరీక్ష ఫీజు చెల్లించిన అభ్యర్థులు JEE మెయిన్ 2022 సెషన్- 2కి హాజరు కావాలంటే తమ మునుపటి (సెషన్ -1) అప్లికేషన్ నంబర్‌, పాస్‌వర్డ్‌తో లాగిన్ అవ్వాలి. సెషన్ 2 కోసం పేపర్, పరీక్ష మీడియం, పరీక్ష నగరాలను మాత్రమే ఎంచుకోవాలి. పరీక్ష ఫీజును కూడా చెల్లించాలి.

Modi@8: ప్రమాణ స్వీకారోత్సవం నుంచి డెన్మార్క్ పర్యటన వరకు.. దౌత్య సంబంధాలను మెరుగుపరిచిన మోదీ


సెషన్-1‌ కోసం రిజిస్టర్ చేయించుకోకుండా, సెషన్ 2 కోసం దరఖాస్తు చేసుకోవాలనుకునే కొత్త అభ్యర్థుల రిజిస్ట్రేషన్ వివరాలు ఇలా ఉన్నాయి.

స్టెప్-1: అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in‌ను సందర్శించాలి

స్టెప్-2: హోమ్ పేజీలో జేఈఈ మెయిన్ అప్లికేషన్ ఫారమ్‌పై క్లిక్ చేయండి. కొత్త పేజీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

స్టెప్-3: అవసరమైన ఆధారాలతో పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకోండి.

స్టెప్-4: అప్లికేషన్ ఫారమ్‌ను పూరించండి. ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించి అప్లికేషన్‌ను సబ్‌మిట్ చేయండి.

* JEE MAIN 2022 - అవసరమైన డాక్యుమెంట్లు

JPG/JPEG ఫార్మాట్‌లో కలర్ లేదా బ్ల్యాక్ అండ్ వైట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో స్కాన్ చేసినది అప్‌లోడ్ చేయాలి. ఇది 4 కేబీ నుంచి 30 కేబీ మధ్య ఉండాలి. సిగ్నేచర్ స్కాన్ కాపీ JPG/JPEG ఫార్మాట్‌లో 4 kb నుండి 30 kb మధ్య ఉండాలి. కేటగిరీ సర్టిఫికేట్ స్కాన్ కాపీ పీడీఎఫ్ రూపంలో 50kb నుండి 300kb మధ్య ఉండాలి. PwD సర్టిఫికేట్ స్కాన్ చేసిన కాపీ, 50 కేబీ నుంచి 300 కేబీ మధ్య ఉండాలి.

* అప్లికేషన్ ఫీజు వివరాలు

జనరల్ అభ్యర్థులు దరఖాస్తు రుసుము‌గా రూ. 600 చెల్లించాల్సి ఉంటుంది. అదే మహిళా అభ్యర్థులు, SC, ST, PwD, థర్డ్ జెండర్ అభ్యర్థులు రూ. 325 చెల్లించాలి. విదేశీ విద్యార్థులైతే రూ. 3000 చెల్లించాలి. విదేశాలకు చెందిన మహిళ అభ్యర్థులు, థర్డ్ జెండర్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ.1500 ఫీజు చెల్లించాలి.ః

Turkey name change:పేరు మార్చుకున్న టర్కీ..ఇకపై ఏమని పిలవాలంటే..

* జేఈఈ- 2022 కోసం సన్నద్ధం ఇలా

JEE మెయిన్ కోసం పూర్తి సిలబస్ సిద్ధం చేసుకోండి. పరీక్షలు జరిగే వరకు స్టడీ కొనసాగించండి. JEE ప్రిపరేషన్ కోసం ప్రామాణిక సోర్స్ నుంచి స్టడీ మెటీరియల్స్ రెడీ చేసుకోండి. అందుబాటులో ఉన్న సమయానికి అనుగుణంగా వాస్తవిక టైమ్ టేబుల్ సిద్ధం చేసుకోండి. ప్రిపరేషన్ టైమ్‌లో నోట్స్ ప్రిపేర్ చేయండి. ఇది రివిజన్ చేసేటప్పుడు మీ సమయాన్ని తగ్గిస్తుంది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Jee, Jee main 2022, Students

ఉత్తమ కథలు