Home /News /jobs /

JEE MAIN 2022 REGISTRATION DEADLINE EXTENDED 25 EXAM CENTERS SET UP ABROAD HERE DETAILS NS GH

JEE Main Deadline Extended: జేఈఈ మెయిన్‌ 2022 అభ్యర్థులకు అలర్ట్.. రిజిస్ట్రేషన్‌ గడువు పొడిగింపు.. పూర్తి వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌- జేఈఈ మెయిన్‌ 2022కు (JEE Main 2022) రిజిస్టర్‌ చేసుకునేందుకు గల గడువును నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) పొడిగించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌- జేఈఈ మెయిన్‌ 2022(JEE Main 2022)కు రిజిస్టర్‌ చేసుకొనేందుకు గల గడువును నేషనల్‌ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) పొడిగించింది. ఇప్పటి వరకు జేఈఈ మెయిన్‌ మొదటి విడత పరీక్షలకు అప్లై చేసుకొని ఇంజినీరింగ్‌లో చేరాలనుకొంటున్న అభ్యర్థులు ఏప్రిల్‌ 5వ తేదీ వరకు రిజిస్టర్‌ చేసుకొనే అవకాశం ఉంది. ఇంతకుముందు ప్రకటించిన వివరాల మేరకు జేఈఈ మెయిన్‌ 2022 మొదటి విడత పరీక్షలకు మార్చి 31వ తేదీని గడువుగా పేర్కొన్నారు. గడువును పెంచిన కారణంగా jeemain.nta.nic.in వెబ్‌సైట్‌లో రిజిస్ట్రేషన్‌ లింక్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తిరిగి యాక్టివేట్ చేసింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విడుదల చేసిన ఓ అధికారిక ప్రకటనలో..‘ఆన్‌లైన్‌ ద్వారా జేఈఈ మెయిన్‌ 2022, సెషన్‌ 1 పరీక్షలకు అప్లై చేయడంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు విద్యార్థుల నుంచి విజ్ఞప్తులు అందాయి.

ఇతర సమస్యలను కూడా అభ్యర్థులు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ దృష్టికి తీసుకొచ్చారు. ఈ కారణాలతో జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌(మెయిన్‌) 2022, సెషన్‌ 1 పరీక్షలకు అప్లై చేసుకొనేందుకు గడువును పొడిగించాం. ఏప్రిల్‌ 5వ తేదీ వరకు విద్యార్థులు జేఈఈ మెయిన్‌కు అప్లై చేసుకోవచ్చు.’ అని పేర్కొంది. జేఈఈ మెయిన్‌ నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత జేఈఈ మెయిన్‌ 2022, సెషన్‌ పరీక్షల తేదీలు కూడా మారాయి. ప్రస్తుతం జేఈఈ మెయిన్‌ 2022 మెదటి విడత పరీక్షలు ఏప్రిల్‌ 21, 24, 25, 29, మే 1, 4 వ తేదీల్లో జరగనున్నాయి.
Artificial Intelligence : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లో ఎంటెక్‌ కోర్సును లాంచ్ చేసిన ఐఐటీ.. జేఈఈ, గేట్‌ అర్హత లేకుండానే..

రెండో విడత పరీక్షలు మే 24 నుంచి 29వ తేదీ వరకు నిర్వహిస్తారు. జేఈఈ మెయిన్‌ నోటిషికేషన్‌ విడుదలైన తర్వాత విద్యార్థుల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. ఇతర బోర్డు పరీక్షలు ఉన్న సమయాల్లో, జేఈఈ మెయిన్‌ తేదీలు ఉండటంతో సోషల్‌ మీడియా వేదికగా నిరసన వ్యక్తం చేశారు. జేఈఈ మెయిన్‌ తేదీలను మార్చాలని కోరారు. బోర్డు పరీక్షలకు, ఎంట్రన్స్‌ ఎగ్జామ్స్‌కు సరిపడా దూరం లేకపోతే విద్యార్థులు నష్టపోతారని తెలిపారు. విద్యార్థులు ఒత్తడికి గురికాకుండా జేఈఈ మెయిన్‌ పరీక్షల తేదీలను మార్చాలని డిమాండ్‌ చేశారు.

జేఈఈ మెయిన్‌కు అప్లై చేసుకొనే గడువును పెంచిన తర్వాత.. పరీక్ష జరగనున్న నగరాల జాబితాలో మరో 12 విదేశాలకు చెందిన నగరాలను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ చేర్చింది. దీంతో జేఈఈ మెయిన్‌ 2022 పరీక్షలు నిర్వహిస్తున్న ప్రాంతాల సంఖ్య 25కు చేరింది. ఇతర దేశాల్లో ఉన్న భారతీయుల నుంచి, వివిధ సంఘాల నుంచి విజ్ఞప్తులు అందడంతో ఈ నిర్ణయం తీసుకొన్నట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ పేర్కొంది.
ఈ ఏడాది విద్యార్థులకు రెండు విడతల్లోనే జేఈఈ మెయిన్‌ 2022 పరీక్షలు జరుపుతున్నారు.

గతేడాది జేఈఈ మెయిన్ నాలుగు విడతల్లో జరిగింది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ తీసుకొన్న నిర్ణయంపై కొందరు విద్యార్థులు సుప్రీం కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ విచారించిన న్యాయమూర్తులు.. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ విధానపరమైన నిర్ణయాల్లో కోర్టు జోక్యం చేసుకోలేదని చెప్పారు. అయితే తమ సమస్యలను తెలియజేస్తూ విద్యార్థులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు పత్రాలు అందజేయవచ్చని కోర్టు సూచించింది. జేఈఈ మెయిన్‌ 2022కు సంబంధించి ఏదైనా సమాచారం కోసం విద్యార్థులు, తల్లిదండ్రులు 011-40759000, 011-69227700 నంబర్లలో, లేదా jeemain@nta.ac.in మెయిల్‌ ఐడీలో సంప్రదించవచ్చు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Career and Courses, Exams, Jee main 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు