JEE MAIN 2022 ONCE AGAIN THE APPLICATION PROCESS FOR JEE MAIN 2022 SESSION 1 EXAM HAS STARTED FULL DETAILS ARE AS FOLLOWS GH VB
JEE Main-2022: జేఈఈ మెయిన్ 2022 సెషన్ 1 పరీక్ష దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం.. పూర్తి వివరాలు ఇలా..!
ప్రతీకాత్మక చిత్రం
జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షలను నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కీలక నిర్ణయం తీసుకుంది. ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాల కల్పించడానికి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ -2022 కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం కల్పించింది.
జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షలను(Entrance Test) నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కీలక నిర్ణయం తీసుకుంది. ఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశాల కల్పించడానికి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ -2022 కోసం దరఖాస్తు చేసుకోవడానికి మరో అవకాశం కల్పించింది. కాగా, ఇప్పటికే దరఖాస్తు గడువు ముగిసిన విషయం తెలిసిందే. సీబీఎస్ఈ టర్మ్ 2 పరీక్షలు... జేఈఈ మెయిన్ సెషన్1తో క్లాష్ కావడంతో చాలా మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేదు. తాజాగా జేఈఈ మెయిన్స్ మరోసారి వాయిదా పడడంతో విద్యార్థులు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకుని ఎన్టీఏ మరోసారి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఏప్రిల్ 25 రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. JEE మెయిన్ 2022 సెషన్ 1 పరీక్షలు జూన్ 20 నుంచి ప్రారంభమై... 29 వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే పరీక్షను మూడుసార్లు వాయిదా వేసిన తరువాత ఈ తేదీలను ఖరారు చేశారు.
* JEE మెయిన్ 2022 దరఖాస్తు విధానం
స్టెప్1: అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్సైట్ jeemain.nta.nic.inను సందర్శించాలి
స్టెప్2: హోమ్ పేజీకి వెళ్లి జేఈఈ మెయిన్ 2022 రిజిస్ర్టేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి
స్టెప్3: రీ డైరెక్టెడ్ పేజీలో రిజిస్ర్టేషన్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి.
స్టెప్4: పోస్ట్-రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి
స్టెప్5: అనంతరం అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి దరఖాస్తు రుసుమును చెల్లించాలి. ఆపై దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి
స్టెప్ 6: అభ్యర్థులు కన్ఫర్మేషన్ పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి.
స్టెప్ 7: భవిష్యత్ అవసరాల కోసం వాటిని ప్రింట్ అవుట్ తీసుకోండి
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ అడ్వాన్స్ 2022 కోసం అడ్మిట్ కార్డ్ విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. ఎగ్జామినేషన్ సిటీ అడ్వాన్స్ ఇన్టిమేషన్ తేదీలు, అడ్మిట్ కార్డ్‌ల డౌన్లోడ్, రిజల్ట్ డిక్లరేషన్ గడువులోగా JEE (మెయిన్) పోర్టల్‌లో ఉంటాయని ఇటీవల ఎన్టీఏ విడుదల చేసిన నోటిఫికేషన్లో పేర్కొంది.
* అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ చేసే విధానం
అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ తేదీలను ప్రకటించిన తరువాత ఇలా చేయండి
స్టెప్ 1: JEE మెయిన్ 2022 అధికారిక పోర్టల్‌లో లాగిన్ అవ్వండి
స్టెప్ 2: హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న JEE మెయిన్ 2022 అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి
స్టెప్3: సంబంధిత కాలమ్స్‌లో మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి
స్టెప్ 4: వెంటనే దాన్ని సమర్పించండి
స్టెప్ 5: మీ JEE మెయిన్ 2022 అడ్మిట్ కార్డ్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
స్టెప్ 6: అడ్మిట్ కార్డ్ కాపీని సేవ్ చేసి, పరీక్ష రోజున దానిని తీసుకెళ్లడానికి ప్రింటవుట్ తీసుకోండి
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) జేఈఈ మెయిన్స్ ను ఈ ఏడాది రెండు సెషన్లలో నిర్వహిస్తోంది. గతేడాది నాలుగు దశల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.