హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main 2022: జేఈఈ మెయిన్స్ కొత్త వెబ్‌సైట్‌ లాంచ్‌ చేసిన NTA.. త్వరలోనే నోటిఫికేషన్‌..?

JEE Main 2022: జేఈఈ మెయిన్స్ కొత్త వెబ్‌సైట్‌ లాంచ్‌ చేసిన NTA.. త్వరలోనే నోటిఫికేషన్‌..?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

JEE మెయిన్‌ 2022కు సంబంధించిన వెబ్‌సైట్‌ jeemain.nta.nic.inను NTA తాజాగా లాంచ్ చేసింది. విద్యార్థుల సౌకర్యం కోసం ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో మార్పులు చేసింది.

దేశంలోని ప్రముఖ విద్యాసంస్థల్లో ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (JEE) నిర్వహిస్తుంటారు. ఏటా జనవరి నుంచి మే నెల మధ్య ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (National Testing Agency) నిర్వహిస్తుంది. కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలో ఈ పరీక్ష ఉంటుంది. అయితే ఈ ఏడాది ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ వెలువడలేదు. ఈ నేపథ్యంలో JEE మెయిన్‌ 2022కు సంబంధించిన వెబ్‌సైట్‌ jeemain.nta.nic.in ను NTA తాజాగా లాంచ్ చేసింది. విద్యార్థుల సౌకర్యం కోసం ఎన్‌టీఏ వెబ్‌సైట్‌లో మార్పులు చేసింది. కొత్తగా వెబ్‌సైట్‌ను మార్చడం చిన్న విషయమే అయినప్పటికీ త్వరలో JEE మెయిన్‌ 2022 నోటిఫికేషన్‌ ఇవ్వడానికి ఎన్టీఏ సిద్ధమవుతోందనే సంకేతాలు ఇచ్చినట్లు అందరూ భావిస్తున్నారు.

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ కొత్తగా తీసుకొచ్చిన JEE మెయిన్‌ వెబ్‌సైట్‌ ఆకట్టుకొనేలా ఉంది. అన్ని విభాగాలకు సంబంధించి ప్రత్యేక మెనూలు ఉన్నాయి. JEE మెయిన్‌ 2021 సమాచారాన్ని తెలిపే బులిటెన్‌ కూడా వెబ్‌సైట్‌లో కనిపిస్తోంది. రిఫరెన్స్‌ కోసం విద్యార్థులు ఉపయోగించుకోవచ్చు. గతంలో జరిగిన JEE మెయిన్‌ పరీక్షల ప్రశ్నాపత్రాలను, ఆన్సర్‌ కీలను కూడా విద్యార్థుల కోసం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.

New Home Loan Scheme: కొత్త హోం లోన్ తో ఎన్నో ప్రయోజనాలు.. రూ.35 లక్షల నుంచి రూ.3.5 కోట్ల వరకు..


రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలయ్యే తేదీపై కొంత సమాచారం అందుబాటులో ఉన్నా, JEE మెయిన్‌ పరీక్ష నిర్వహించే తేదీపై ఎలాంటి స్పష్టత లేదు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మార్చి 1వ తేదీ లేదా మార్చి మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ ఏడాది రెండు పర్యాయాలు JEE మెయిన్‌ పరీక్షను నిర్వహించే అవకాశం ఉంది. పరీక్షలను నిర్వహించనున్న తేదీలను త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది.

ఈ క్రమంలో పలువురు విద్యార్థులు JEE మెయిన్‌ నిర్వహణపై సమాచారం విడుదల చేయాలని కోరుతున్నారు. కొందరు ఏకంగా ట్విట్టర్‌ వేదికగా విద్యాశాఖమంత్రి, నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీని పరీక్షల తేదీలు వెల్లడించాలని కోరారు. 2021లో JEE మెయిన్‌ పరీక్షను నాలుగుసార్లు నిర్వహించారు. ఈ ఏడాది కేవలం రెండు పర్యాయాలు పరీక్ష నిర్వహించనున్నారనే సమాచారంతో కొందరు విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

NPS Charges: ఎన్​పీఎస్ చందాదారులకు బ్యాడ్​న్యూస్.. పెరిగిన సర్వీస్ ఛార్జీలు.. కొత్త ఛార్జీల వివరాలివే..!


JEE మెయిన్‌ వెబ్‌సైట్‌ను ఎన్టీయే కొత్తగా రూపొందించడం మంచి సూచనగా భావిస్తున్నారు. గతంలో ఇదే తరహాలో వెబ్‌సైట్‌లో మార్పులు చోటుచేసుకొన్న సమయంలో అప్పటి పరీక్షల వివరాలను లేదా ఫలితాలను ప్రకటించారు. ఇప్పుడు కూడా అదే విధంగా జరిగే అవకాశం ఉందని ఎదురుచూస్తున్నారు. మార్చి 1వ తేదీన రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ మొదలవుతుందని ఇప్పటికి అందుబాటులో ఉన్న సమాచారంలో వాస్తవం ఉండొచ్చనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే నోటిఫికేషన్‌ విడుదలపై ఎలాంటి సమాచారం అందుబాటులో లేదు. త్వరలోనే పరీక్షల నిర్వహణ తేదీని వెల్లడిస్తామని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ అధికారులు తెలిపారు.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, EDUCATION, Jee, Students

ఉత్తమ కథలు