హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main 2022: జేఈఈ మెయిన్​ పరీక్షపై ఎన్​టీఏ కీలక నిర్ణయం.. ఈ ఏడాది ఎగ్జామ్ ఎన్నిసార్లంటే?

JEE Main 2022: జేఈఈ మెయిన్​ పరీక్షపై ఎన్​టీఏ కీలక నిర్ణయం.. ఈ ఏడాది ఎగ్జామ్ ఎన్నిసార్లంటే?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఐఐటీ(IIT), ఎన్​ఐటీ(NIT) వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశాల కొరకు ఏటా నిర్వహించే జాయింట్​ ఎంట్రన్స్​ ఎగ్జామినేషన్​ (JEE) మెయిన్​కు సంబంధించి కీలక ప్రకటన చేసింది నేషనల్​ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).

ఐఐటీ(IIT), ఎన్​ఐటీ(NIT) వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ప్రవేశాల కొరకు ఏటా నిర్వహించే జాయింట్​ ఎంట్రన్స్​ ఎగ్జామినేషన్​ (JEE) మెయిన్​కు సంబంధించి కీలక ప్రకటన చేసింది నేషనల్​ టెస్టింగ్ ఏజెన్సీ (NTA). 2022 విద్యా సంవత్సరానికి గాను మొత్తం నాలుగు సెషన్లకు బదులు కేవలం రెండు సెషన్లలో మాత్రమే పరీక్ష(Exam) నిర్వహించనున్నట్లు తెలిపింది. ఈ పరీక్షను ఏప్రిల్​, మే నెలల్లో నిర్వహించాలని నిర్ణయించింది. సాధారణంగా జేఈఈ పరీక్షలను ఏటా ఒకసారి మాత్రమే నిర్వహించేవారు. అయితే, 2019లో సెషన్ల సంఖ్యను రెండుకు పెంచగా.. కరోనా కారణంగా 2021లో ఈ సంఖ్యను నాలుగుకి సడలించారు. అంటే, విద్యార్థులు నాలుగు ప్రయత్నాల్లో సాధించిన ఉత్తమ స్కోరునే ఫైనల్​ స్కోర్​గా పరిగణిస్తారు. అయితే, ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో క్లాసులు యథావిథిగా కొనసాగుతున్నాయి.

తద్వారా, గతంలో మాదిరిగా 2 సెషన్ల విధానంలోనే పరీక్ష నిర్వహించాలని ఎన్​టీఏ నిర్ణయించింది. గతేడాది కోవిడ్​–19 కారణంగా 4 ప్రయత్నాలకు అవకాశం కల్పించామని, ప్రస్తుతం కోవిడ్​ తీవ్రత తగ్గినందున రెండు సార్లు మాత్రమే నిర్వహించనున్నట్లు ఎన్​టీఏ అధికారులు తెలిపారు. ఈ ఏడాది షెడ్యూల్​ ప్రకారమే బోర్డు పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు.

JEE Website: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పరీక్షల కోసం అధికారిక వైబ్ సైట్ ప్రారంభం.. ఈసారి పరీక్షల్లో రానున్న మార్పులివే..

ఫిబ్రవరిలోనే నోటిఫికేషన్​ విడుదల..

అయితే విద్యార్థులు మాత్రం గతేడాది మాదిరిగా నాలుగు సెషన్లలో పరీక్ష నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. జేఈఈ మెయిన్ 2022లో నాలుగు ప్రయత్నాలను కోరుతూ విద్యార్థులు ఆన్‌లైన్​ ఉద్యమం ప్రారంభించారు. అంతేకాదు, జేఈఈకి హాజరయ్యేందుకు 75 శాతం మార్కుల ప్రమాణాలను రద్దు చేయాలని మంత్రిత్వ శాఖను కోరుతున్నారు. బోర్డు పరీక్షలకు అర్హత సాధించాలంటే విద్యార్థులు 12వ తరగతిలో కనీసం 75 శాతం మార్కులు పొందాలి.

Stanford University: ఫ్రీ ఆన్​లైన్ మెషిన్ లెర్నింగ్ కోర్సును ప్రారంభించిన యూనివర్సిటీ.. వివరాలిలా..

అయితే, 2020, 2021లో ఈ నిబంధనను సడలించారు. ఇంటర్​లో 75 శాతం కంటే తక్కువ మార్కులు వచ్చిన వారు కూడా జేఈఈ మెయిన్​కు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ సారి కూడా ఈ వెసులుబాటు ఇవ్వాలని విద్యార్థులు కోరుతున్నారు.

కాగా, ఇంజినీరింగ్ అభ్యర్థులు జేఈఈ మెయిన్ 2022 నోటిఫికేషన్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (JEE) మెయిన్ -నోటిఫికేషన్​ ఫిబ్రవరిలోనే విడుదలయ్యే అవకాశం ఉంది. దరఖాస్తు ప్రక్రియ కూడా jeemain.nta.nic.in లేదా nta.ac.inలో త్వరలో ప్రారంభమవుతుంది. అయితే, పరీక్షలను మాత్రం సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షల నిర్వహణ తర్వాతే నిర్వహిస్తారు. సీబీఎస్​ఈ టర్మ్ 2 పరీక్షలు ఏప్రిల్ 26న ప్రారంభం కానున్నాయి.

First published:

Tags: CBSE, Education CBSE, Exams

ఉత్తమ కథలు