నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) మంగళవారం జేఈఈ మెయిన్ షెడ్యూల్ను (JEE Main 2022 schedule) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2022 (JEE Main 2022) పరీక్షలను నిర్వహిస్తారు. ఈ ఏడాది రెండు విడుతల్లో మాత్రమే జేఈఈ మెయిన్ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్టీఏ పేర్కొంది. ఏప్రిల్ 16, 2022 నుంచి ఏప్రిల్ 21, 2022 వరకు మొదటి సెషన్, మే 24, 2022 నుంచి మే 29, 2022 వరకు రెండో సెషన్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎన్టీఏ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సాధనా పరాషర్ వెల్లడించారు. విద్యార్థులకు మార్చి 1, 2022 తేదీ నుంచి మార్చ్ 31, 2022 వరకు సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయన సూచించారు.
Online Education: ఇక ఆన్లైన్లోనే గ్రాడ్యుయేషన్ చేయొచ్చు.. యూజీసి తాజా అనుమతులు
రెండు దశల్లో పరీక్ష..
2019, 2020లో ఆన్లైన్ విధానంలో కరోనా (Corona) కారణంగా నేపథ్యంలో విద్యార్థుల సౌలభ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జేఈఈ పరీక్షను నాలుగు విడుతల్లో నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఏడాది రెండు విడుతల్లోనే నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. మొదటి దశ పరీక్షలు ఏప్రిల్ 16, 17, 18, 19, 20, 21 తేదీల్లో, రెండో దశ పరీక్షలు మే 24, 25, 26, 27, 28, 29 తేదీల్లో జరుగుతాయి.
Dyslexia: పాఠశాల పిల్లల్లో "డైస్లెక్సియా" లక్షణాలు.. అంటే ఏమిటి.. పరిష్కారం ఏమిటి?
పదమూడు భాషల్లో..
ఈ పరీక్షలకు 2020, 2021లో ప్లస్ టు లేదా ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు అర్హులు. అలాగే ఈ ఏడాది ఇంటర్ చివరి సంవత్సరం పరీక్షలు రాస్తున్న విద్యార్థులు కూడా అర్హులే. తెలుగుతోపాటు మొత్తం పదమూడు భాషల్లో ఎగ్జామ్ రాసే వీలుంది. అంతే కాకుండా ఐఐటీల్లో బీటెక్ ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష షెడ్యూల్ ఇటీవలే విడుదలైంది.
జూలై 3న జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్షలు నిర్వహించట్లు పేర్కొంది. జూన్ 8 నుంచి 14వ తేదీ వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలని ఉంటుందని, జూలై 18న ఫలితాలను ప్రకటిస్తామని, మరుసటి రోజు నుంచే సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ మొదలవుతుందని వివరించింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, IIT