నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) త్వరలో జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (Joint Entrance Examination) మెయిన్- 2022 పరీక్ష కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించనుంది. డిసెంబర్ మధ్యలో రిజిస్ట్రేషన్లు ప్రారంభం కావచ్చని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా వివిధ ఇంజనీరింగ్ (Engineering) కళాశాలల్లో ప్రవేశాల కోసం ఈ అర్హత పరీక్షను నిర్వహిస్తారు. ఈసారి 2022 ఫిబ్రవరి నుంచి వివిధ షిఫ్టులలో పరీక్ష నిర్వహించాలని అధికారులు భావిస్తున్నారు. JEE మెయిన్‌లోని టాప్ 2.5 లక్షల మంది విద్యార్థులు IITల్లో ప్రవేశాల కోసం నిర్వహించే JEE అడ్వాన్స్డ్- 2022 పరీక్షకు హాజరు కావచ్చు.
JEE మెయిన్- 2022 పరీక్షను ఎన్ని విడతలుగా నిర్వహిస్తారు?
ఈ ఏడాది దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విజృంభించింది. దీంతో JEE మెయిన్ 2021 పరీక్షను ఫిబ్రవరి, మార్చి, జులై, ఆగస్టులో.. మొత్తం నాలుగు సెషన్లలో నిర్వహించాల్సి వచ్చింది. తాజా అప్డేట్ (Update) ప్రకారం, JEE మెయిన్- 2022 పరీక్షను కూడా ఈ ఏడాది మాదిరిగానే నాలుగు సెషన్లలో నిర్వహించే అవకాశం ఉంది. ఈ విషయంపై న్యూస్18తో మాట్లాడారు.
AICTE Scholarship 2021: పీజీ విద్యార్థులకు నెలకు రూ.12,400 స్కాలర్షిప్.. అప్లికేషన్ ప్రాసెస్
NTA డైరెక్టర్ జనరల్ వినీత్ జోషి. 12వ తరగతి విద్యార్థులకు బోర్డు పరీక్షలు ఎప్పుడు ముగుస్తాయనే అంశంపై ఈ సెషన్లు ఆధారపడి ఉంటాయని వినీత్ తెలిపారు. ఈ సంవత్సరం CBSE, CISCEలను అనుసరించే చాలా బోర్డులు రెండు బోర్డు పరీక్షలను నిర్వహిస్తున్నాయి.
JEE మెయిన్ పరీక్షను ఎప్పుడు నిర్వహిస్తారు? రిజిస్ట్రేషన్లు ఎప్పుడు ప్రారంభమవుతాయి?
JEE మెయిన్- 2022 పరీక్షను ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే నెలలో నిర్వహించవచ్చు. పరీక్ష తేదీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలో ప్రకటించనుంది. అధికారిక వెబ్సైట్ అయిన jeemain.nta.nic.in లో త్వరలో షెడ్యూల్ విడుదల అవుతుందని భావిస్తున్నారు.
JEE మెయిన్- 2022 రిజిస్ట్రేషన్ డిసెంబర్ మధ్య నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే నోటిఫికేషన్ విడుదలైన తరువాతే చివరి తేదీ, షెడ్యూల్ గురించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.
JEE మెయిన్- 2022 పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది?
JEE మెయిన్- 2022 సిలబస్ (Syllabus), ఎగ్జామ్‌కు సంబంధించిన పేపర్ ప్యాటర్న్ ఈ సంవత్సరం మారకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. CBSE సహా కొన్ని బోర్డులు ఈ సంవత్సరం 12వ తరగతి సిలబస్‌ను 30 శాతం తగ్గించాయి. అయితే జేఈఈ మెయిన్- 2022 సిలబస్ మాత్రం 2021 సిలబస్ మాదిరిగానే ఉండవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: CBSE, Exams, IIT, JEE Main 2021, National Testing Agency