JEE MAIN 2022 IMPORTANT TOPICS BOOKS TIPS TO ACE MATHS SECTION GH VB
JEE Main 2022: జేఈఈ మెయిన్ మ్యాథ్స్‌లో ఫుల్ మార్క్స్ మీ టార్గెటా..? సక్సెస్ కోసం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఇవే..
ప్రతీకాత్మక చిత్రం
జాయింట్ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ (JEE) మెయిన్ పరీక్షలో మ్యాథ్స్ సెక్షన్ (Maths section) చాలా ఛాలెంజింగ్ గా ఉంటుందని విద్యార్థులు భావిస్తుంటారు. వాస్తవానికి మ్యాథ్స్ సెక్షన్లో మంచి స్కోర్ సాధించడం చాలా కష్టమే. అయితే విద్యార్థులు (JEE Aspirants) క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోర్ సాధించడం సులువే!
జాయింట్ ఇంజినీరింగ్ ఎంట్రన్స్ (JEE) మెయిన్ పరీక్షలో మ్యాథ్స్ సెక్షన్ (Maths section) చాలా ఛాలెంజింగ్ గా ఉంటుందని విద్యార్థులు భావిస్తుంటారు. వాస్తవానికి మ్యాథ్స్ సెక్షన్లో మంచి స్కోర్ సాధించడం చాలా కష్టమే. అయితే విద్యార్థులు (JEE Aspirants) క్రమం తప్పకుండా ప్రాక్టీస్ చేస్తే మంచి స్కోర్ సాధించడం సులువే! అలాగే కింద పేర్కొన్న సలహాలను పాటిస్తే ఈ సెక్షన్లో 100% మార్కులు సాధించవచ్చు. మరి ఆ సలహాలు (JEE suggestions) ఏంటో చూద్దాం.
తప్పనిసరిగా ప్రాక్టీస్ చేయాల్సిన చాప్టర్లు
మ్యాథ్స్‌లో కాలిక్యులస్ (calculus), త్రికోణమితి (trigonometry), మాత్రికలు( matrices), డిటర్మినెంట్స్ (determinants), పెర్ముటేషన్స్–కాంబినేషన్స్ (permutations and combinations) ప్రాక్టీస్ చేయడం ద్వారా మంచి మార్కులు సాధించవచ్చు. విద్యార్థులు ఈ చాప్టర్లపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. అలాగే వెక్టర్స్తో కోఆర్డినేట్ జామెట్రీ (coordinate geometry), కాంప్లెక్స్ నంబర్లను కూడా చేయగలగాలి.
విద్యార్థులు కోఆర్డినేట్ జామెట్రీ, వెక్టార్స్, 3D, బీజగణితం (ఆల్జీబ్రా)లో కష్టమైన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేలా తమను తాము సన్నద్ధం చేసుకోవాలి. కాలిక్యులస్ లో విద్యార్థులు బేసిక్ ఫంక్షన్స్, గ్రాఫికల్ బిహేవియర్ పై మంచి పట్టు సాధించాలి. ప్రాబబిలిటీ చాప్టర్ కు సంబంధించిన ప్రాబ్లమ్స్ కోసం, విద్యార్థులు తప్పనిసరిగా పెర్ముటేషన్స్–కాంబినేషన్స్ బలమైన అవగాహన కలిగి ఉండాలి. త్రికోణమితి కోసం సూత్రాలను గుర్తుంచుకోవడం, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అలవరచుకోవడం చేయాలి.
ముఖ్యమైన పుస్తకాలు
జేఈఈ మెయిన్ అభ్యర్థులు పరీక్ష కోసం వ్యూహాన్ని రూపొందించేటప్పుడు బెస్ట్ బుక్స్ ఎంచుకోవాలి. జేఈఈ మెయిన్ 2022 కోసం మొదటగా ఎన్సీఈఆర్టీ (NCERT) పుస్తకాలతో ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కోచింగ్ ఇన్స్టిట్యూట్ అందించిన స్టడీ మెటీరియల్‌ని చదవాల్సి ఉంటుంది. అసలు ఎగ్జామ్స్ కి పనికి రాని పుస్తకాలపై ఎప్పుడు కూడా సమయం వృధా చేసుకోకూడదు. మరి జీఈఈ మెయిన్ కు బెస్ట్ బుక్స్ ఏవో చూద్దాం.
- ఎన్సీఈఆర్టీ ఎక్సంప్లర్ (NCERT Exemplar)
- ఐఐటీ మ్యాథమెటిక్స్ బై M.L ఖన్నా (IIT Mathematics by M.L Khanna )
- ప్రాబ్లమ్స్ ఇన్ కాలిక్యులస్ ఆఫ్ వన్ వేరియబుల్ బై ఐఏ మారన్ (Problems in Calculus in One Variable by IA Maron)
- ట్రిగనామెట్రీ, జామెట్రీ బై ఎస్. ఎల్ లోనీ (Trigonometry and Geometry by S.L Loney)
గత పేపర్లు, మాక్ టెస్ట్‌ల ద్వారా ప్రాక్టీస్ చేయడం
విద్యార్థులు జేఈఈ మెయిన్‌కు సంబంధించిన మునుపటి సంవత్సరాల పేపర్లను పరిష్కరించాలి. పరీక్షకు హాజరయ్యే ముందు కనీసం 20-30 మాక్ పేపర్లను సాల్వ్ చేయాలి. కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడంలో తమ వేగం, కచ్చితత్వాన్ని నిర్ధారించుకోవడానికి విద్యార్థులు తప్పనిసరిగా సమయానుకూలమైన పరీక్షలను తీసుకోవాలి. మాక్ టెస్ట్‌లు విద్యార్థుల విశ్వాసాన్ని పెంపొందించడంలో సహాయపడతాయి. వీటిని ప్రాక్టీస్ చేయడం ద్వారా అసలు పరీక్షను ఇలాంటి ఒత్తిళ్లు లేకుండా ఈజీగా చేయొచ్చు.
రివిజన్
పరీక్షకు ముందు చివరి రోజులలో విద్యార్థులు చదివిన వాటిని బాగా రివైజ్ చెయ్యాలి. విద్యార్థులు రివైజ్ చేయడానికి.. వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయడానికి ఈ కీలక సమయాన్ని ఉపయోగించుకోవాలి. అలాగే ఫార్ములాలు మరొక సారి రివైజ్ చేస్తే మంచిది. విద్యార్థులు ఎర్రర్ అనాలసిస్ కూడా చేసుకోవాలి. చివరి రోజుల్లో ప్రిపరేషన్‌ను చక్కగా ప్లాన్ చేసుకోవడం ద్వారా మంచి స్కోర్ సాధించవచ్చు.
మీ బలాలు & బలహీనతలను తెలుసుకోండి
విద్యార్థులు ఏ విభాగంలో ఎక్కువ స్కోర్ సాధించగలరో దానిపై మరింత శ్రద్ధ పెట్టాలి. దీని ప్రకారం ముందుగానే ఒక స్ట్రాటజీ ప్లాన్ చేయాలి. ఎక్కువ స్కోరు సాధించడానికి పరీక్ష పేపర్ ఎలా అట్టెంప్ట్ చేయాలో ముందుగానే నిర్ణయించుకోవాలి. విద్యార్థులు ప్రిపరేషన్ సమయంలో వచ్చే సందేహాలను నివృత్తి చేసుకునేందుకు ఉపాధ్యాయులు లేదా తోటివారి నుంచి సహాయం తీసుకోవడానికి వెనుకాడకూడదు. నీ డౌట్స్ క్లారిఫై చేసుకొని పూర్తి నాలెడ్జితో పరీక్షకు రెడీ అవ్వాలి.
రియల్ ఎగ్జామ్ సినారియో క్రియేట్ చేసుకోండి
ఇంట్లో లేదా కోచింగ్ సెంటర్ లో ఇలా ఎక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా నిజమైన ఎగ్జామ్ రాస్తున్నట్లుగా భావించాలి. ఎందుకంటే ఇది పరీక్ష సంబంధిత ఆందోళనలను మటుమాయం చేస్తుంది. ఎలాంటి డిస్ట్రక్షన్ లేకుండా నిజమైన ఎగ్జామ్ రాస్తున్నట్లుగా 3 గంటల వరకు ప్రాక్టీస్ ఎగ్జామ్ రాయాలి. పరీక్ష సమయంలో అన్ని సెక్షన్స్ అట్టెంప్ట్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. రియల్ ఎగ్జామ్ రోజు ఎదురయ్యే అనుభవాన్ని క్రియేట్ చేసుకోవడం చాలా ముఖ్యం.
మెరుగైన ప్రిపరేషన్‌కు టిప్స్
డెరివేషన్స్ లోతుగా అర్థం చేసుకోండి. అటువంటి ఫార్ములా అవసరం ఏమిటి? కంక్లూజన్స్ చేరుకోవడానికి ఏ స్టెప్స్ లేదా టెక్నిక్స్ వాడాలి? ఈ సూత్రాన్ని ఎక్కడ ఉపయోగించాలి? లాంటి ప్రశ్నలను మీకు మీరే ప్రశ్నించుకోండి. పరీక్ష సమయంలో ఈజీ, మీడియం, డిఫికల్ట్ లెవెల్స్ ఆధారంగా ప్రాబ్లమ్స్ సెలెక్ట్ చేసుకొని.. ఇదే క్రమంలో వాటిని ప్రయత్నించాలి. మొదటిగా విలువైన ప్రశ్నలు సాధన చేయడం ద్వారా మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అలాగే మిగిలిన ట్రిక్కీ ప్రాబ్లమ్స్ కోసం మరింత విశ్లేషణాత్మకంగా ఆలోచించడానికి బ్రెయిన్ పై కొవ్వొత్తి ఉంటుంది.
వేగాన్ని పెంచుకునేందుకు ప్రతిరోజూ కనీసం 80-100 ప్రాబ్లమ్స్ తప్పనిసరిగా పాటించాలి. ఎక్కువ పుస్తకాల కలిగి ఉండటం కంటే ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలను కలిగి ఉన్న ఒకే మంచి సోర్స్/ మెటీరియల్ ఫాలో కావడం చాలా మంచిది. మ్యాథమెటిక్స్ చాప్టర్స్ డిస్ట్రిబ్యూషన్ బార్ గ్రాఫ్‌ని పరిశీలిస్తే, జీఈఈ మెయిన్‌లో 3-డైమెన్షనల్ జామెట్రీ, డెరివేటివ్‌ల అప్లికేషన్, లిమిట్స్, కంటిన్యుటీ, డిఫరెన్షబిలిటీ, మాట్రిసెస్, డిటర్మినెంట్లు వంటి చాఫ్టర్స్ నుంచి ఎక్కువ సంఖ్యలో ప్రశ్నలు ఉన్నాయని కనిపిస్తోంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.