హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main 2022 Free Coaching: జేఈఈ మెయిన్​ ప్రిపేరయ్యే విద్యార్థులకు గుడ్​న్యూస్.. ఫ్రీ కోచింగ్ అందిస్తున్న ప్రభుత్వాలు.. వివరాలివే

JEE Main 2022 Free Coaching: జేఈఈ మెయిన్​ ప్రిపేరయ్యే విద్యార్థులకు గుడ్​న్యూస్.. ఫ్రీ కోచింగ్ అందిస్తున్న ప్రభుత్వాలు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జేఈఈ (JEE 2022) కోచింగ్​కు ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే పలు రాష్ట్రాల ప్రభుత్వాలు మెరిట్​ విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ (JEE Main 2022 Free Coaching) ఇస్తున్నాయి. వాటిలో ప్రవేశాలు ఎలా పొందాలో చూద్దాం.

ప్రతిష్టాత్మక ఐఐటీ (IIT), ఎన్​ఐటీ (NIT) సంస్థల్లో ఇంజనీరింగ్​ ప్రవేశాలకు(Engineering Admissions) ఏటా నిర్వహించే జేఈఈ మెయిన్ 2022 (JEE Main 2022) నోటిఫికేషన్​ త్వరలోనే విడుదల కానుంది. ఇప్పటికే ఈ పరీక్ష కోసం లక్షలాది మంది విద్యార్థులు ప్రిపేర్​ అవుతున్నారు. చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలి ఉన్నందున మెరుగైన ర్యాంక్​ రావాలంటే ప్రణాళిక బద్దంగా చదవాల్సిందే. ఈ జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షను (Entrance Exam) ఛేదించాలంటే నిపుణులైన ఫ్యాకల్టీతో శిక్షణ తీసుకోవడం లాభిస్తుంది. అయితే జేఈఈ కోచింగ్​కు (JEE Coaching) ఎక్కువ మొత్తంలో ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు మెరిట్​ విద్యార్థులను ఎంపిక చేసి శిక్షణ ఇస్తున్నాయి. వాటిలో ప్రవేశాలు ఎలా పొందాలో చూద్దాం.

ఢిల్లీ ప్రభుత్వం ఉచిత కోచింగ్ (DELHI GOVT COACHING)

జేఈఈ మెయిన్‌కు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ఢిల్లీ ప్రభుత్వం ‘జై భీమ్ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ యోజన’ పేరుతో ఉచిత కోచింగ్​ను నిర్వహిస్తోంది. ఈ ఉచిత కోచింగ్ కోసం ఢిల్లీ ప్రభుత్వం 46 ప్రైవేట్ కోచింగ్ సెంటర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. దాదాపు 15,000 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్​ కేటగిరీకి చెందిన అభ్యర్థులు ఈ కోచింగ్​​ కోసం దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అయితే అభ్యర్థుల వార్షిక ఆదాయం రూ.8 లక్షలలోపు ఉండాలి. ఉచిత శిక్షణతో పాటు విద్యార్థుల ప్రయాణ ఖర్చుల కోసం ప్రతినెలా రూ. 2,500 స్టైఫండ్‌ అందజేస్తుంది.

CSAB JEE Registration: CSAB- జేఈఈ స్పెషల్ రౌండ్ కౌన్సెలింగ్ ముహూర్తం ఖరారు.. ఎలా నమోదు చేసుకోవాలంటే..

ఉత్తరప్రదేశ్ అభ్యుదయ యోజన (UTTAR PRADESH’S ABHYUDAY YOJNA FOR RURAL STUDENTS):

జేఈఈ మెయిన్​కు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం యూపీ ప్రభుత్వం ఉచిత శిక్షణనిస్తోంది. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు, నిరుపేద విద్యార్థులు ఈ ప్రోగ్రామ్​కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు ఉచిత కోచింగ్‌ కోసం Abhyuday.up.gov.inలో నమోదు చేసుకోవాలి.

NEET 2021: నీట్‌ ఎగ్జామ్ అటెంప్టింగ్ ట్రిక్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీ.. బెంగళూరు టాపర్ ఇస్తున్న సూచనలివే!

రాజస్థాన్ ముఖ్యమంత్రి అనుప్రతి కోచింగ్‌ యోజన (RAJASTHAN GOVT OFFERS ANUPRATI COACHING)

రాజస్థాన్ ప్రభుత్వం ముఖ్యమంత్రి అనుప్రతి కోచింగ్ యోజన స్కీమ్​ కింద జేఈఈ మెయిన్ అభ్యర్థులకు ఉచిత కోచింగ్ అందజేస్తుంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ. 8 లక్షల లోపు ఉన్న ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ వర్గాలు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత కోచింగ్​ కోసం రాజస్థాన్​ ప్రభుత్వం మొత్తం 17 కోచింగ్ సెంటర్లతో ఒప్పందం కుదుర్చుకుంది. తద్వారా ఏటా దాదాపు 10,000 మంది అభ్యర్థులకు వివి పోటీ పరీక్షలపై శిక్షణనిస్తోంది.

Internship: ఎక‌న‌మిక్స్‌, ఫైనాన్స్‌ రంగం స్టూడెట్స్‌కి గుడ్ చాయిస్‌.. ఆర్‌బీఐలో ఇంట‌ర్న్‌షిప్ ప్రొగ్రాం

హర్యానా (HARYANA)

ఇతర రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగానే, హర్యానా కూడా ప్రభుత్వ పాఠశాలల్లోని 10 మరియు 12వ తరగతి విద్యార్థులకు జేఈఈ మెయిన్స్, నీట్​ ప్రవేశాల కోసం ఉచిత శిక్షణను అందిస్తోంది. 'సూపర్ 100' పేరుతో ఈ ప్రోగ్రామ్​ను నిర్వహిస్తోంది. మరోవైపు, జేఈఈ మెయిన్​లో క్వాలిఫై అయిన వారికి అడ్వాన్స్‌డ్​లో కూడా ఉచిత శిక్షణనిస్తోంది. కాగా, 10వ తరగతిలో కనీసం 80 శాతం మార్కులు సాధించిన విద్యార్థులు మాత్రమే ఈ ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి హాస్టల్​ వసతి కల్పిస్తుంది.

Google Scholarship: విద్యార్థినులకు రూ.74,000 స్కాలర్‌షిప్ ప్రకటించిన గూగుల్... అప్లై చేయండి ఇలా

ఒడిశా(ODISHA)

సుందర్‌గఢ్ జిల్లాలోని మైనింగ్ ప్రభావిత ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన విద్యార్థుల కోసం ఒడిశా ప్రభుత్వం ఈ ఉచిత శిక్షణను ప్రారంభించింది. దీని కోసం రూర్కెలా, సుందర్‌గఢ్, రాజ్‌గంగ్‌పూర్‌ ఏరియాల్లో మూడు కోచింగ్ సెంటర్‌లను ఏర్పాటు చేశారు. ఇంజనీరింగ్, మెడికల్, లా మొదలైన జాతీయ స్థాయి ప్రవేశ పరీక్షలపై ఉచిత శిక్షణ ఉంటుంది. గిరిజన ప్రాంతాలు, నిరుపేద కుటుంబాలకు చెందిన మెరిట్ విద్యార్థులకు ప్రాధాన్యతనిస్తారు.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Jee, JEE Main 2021

ఉత్తమ కథలు