JEE MAIN 2022 CUT OFF COULD RISE TO 90 PERCENTILE MATH MIGHT BE DECIDING FACTOR UMG GH
JEE Main: జేఈఈ మెయిన్ 2022 కటాఫ్ పెరిగే ఛాన్స్.. ఆ సబ్జెక్టే డిసైడింగ్ ఫ్యాక్టర్..!
జేఈఈ మెయిన్స్‌లో ఈసారి మ్యాథ్స్ కీలకం
జేఈఈ మెయిన్ (JEE Main) పరీక్ష కటాఫ్ (Cut-off) గత ఏడాదితో పోలిస్తే ఈసారి పెరిగే అవకాశముంది. జేఈఈ మెయిన్ 2022 కటాఫ్ 90 పర్సంటైల్‌కు (90 Percentile) పెరగొచ్చని నిపుణులు భావిస్తున్నారు.
జేఈఈ మెయిన్ (JEE Main) పరీక్ష కటాఫ్ (Cut-off) గత ఏడాదితో పోలిస్తే ఈసారి పెరిగే అవకాశముంది. జేఈఈ మెయిన్ 2022 కటాఫ్ 90 పర్సంటైల్‌కు (90 Percentile) పెరగొచ్చని నిపుణులు భావిస్తున్నారు. జేఈఈ మెయిన్ 2022 సెషన్-1 కొద్దిరోజుల క్రితమే ముగిసింది. ఈ సెషన్లో ఫిజిక్స్ కాస్త ఈజీగానే వచ్చింది కానీ మాథ్స్ క్వశ్చన్స్ చాలా డిఫికల్ట్‌గా ఉన్నాయి. అందుకే జేఈఈ మెయిన్ పరీక్షలలో మాథ్స్ సెక్షన్యే విద్యార్థుల భవిష్యత్తును నిర్ణయించవచ్చు. విద్యార్థులు స్కోర్ 300 మార్కులకు గానూ 265 కంటే ఎక్కువ మార్కులు తెచ్చుకుంటే వారు టాప్ 100లో ర్యాంక్ పొందవచ్చని... స్కోర్ 195 కంటే ఎక్కువ ఉంటే టాప్ 5,000లోపు ర్యాంక్‌ను ఆశించవచ్చని నిపుణులు చెబుతున్నారు. విద్యార్థులు 90 శాతం కంటే ఎక్కువ స్కోర్ చేయగలిగితే జేఈఈ అడ్వాన్స్డ్ 2022కి అర్హత సాధించడం దాదాపు ఖాయం అవుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
జేఈఈ మెయిన్ జూన్ సెషన్ పరీక్షలు గత సంవత్సరంతో పోలిస్తే మోడరేట్ లెవెల్ డిఫికల్టీతో వచ్చిందని.. గణితం కాస్త హార్డ్‌గా ఉన్నా ఫిజిక్స్, కెమిస్ట్రీ గతేడాదిలానే ఉన్నాయని నిపుణులు పేర్కొన్నారు. 2021లో జనరల్ లేదా అన్రిజర్వ్డ్ కేటగిరీకి జేఈఈ మెయిన్ కటాఫ్ 87.8992241గా ఉంది. ఇది 2020లో 90.3765335తో పోలిస్తే తక్కువ. ఏడాది మ్యాథ్స్ వల్ల కటాఫ్ మళ్లీ 90 పర్సంటైల్/శాతానికి పైకి వెళ్లే అవకాశం ఉంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇప్పటికే ప్రిలిమినరీ ఆన్సర్ కీని విడుదల చేసింది. దీనికి వ్యతిరేకంగా అభ్యంతరాలు తెలిపే విండో త్వరలో క్లోజ్ అవుతుంది. ఫైనల్ ఆన్సర్ కీ ఆధారంగా రిజల్ట్స్ ఉంటాయి. గతేడాదిలా కాకుండా ఈ ఏడాది జేఈఈ మెయిన్‌కు రెండు సెషన్లు నిర్వహించనున్నారు. జేఈఈ మెయిన్ సెషన్ 2 జూలై 21 నుంచి 30 వరకు జరుగుతుంది.
* స్కోరింగ్, ర్యాంకింగ్ ఫార్ములా
జేఈఈ మెయిన్ 2022 సెషన్ 1, సెషన్ 2లలో పాల్గొన్న మొత్తం అభ్యర్థులు, వారి మార్కుల ఆధారంగా ఎన్టీఏ మెరిట్ జాబితా లేదా ర్యాంకింగ్ ప్రకటిస్తుంది. రెండు సెషన్లలో హాజరైన అభ్యర్థుల విషయానికి వస్తే.. వీరు ఏ సెషన్లో ఎక్కువగా స్కోర్ చేశారో వాటిని ఎన్టీఏ పరిగణిస్తుంది. ఎన్టీఏ మరోసారి ర్యాంక్ లెక్కింపు ఫార్ములాని సవరించింది. కొత్త పద్ధతి ప్రకారం, టై సమస్యను సాల్వ్ చేసేందుకు ఎన్టీఏ ఈ కింది అంశాలను పరిశీలిస్తుంది. టై అయితే మొదటగా మాథ్స్‌లో ఎన్టీఏ స్కోర్ ఎవరికి ఎక్కువ వచ్చాయనేది చూస్తారు. మాథ్స్‌లో కూడా ఒకటే మార్క్స్ వస్తే ఫిజిక్స్‌లో ఎన్టీఏ స్కోర్ చూస్తారు. అందులో కూడా ఒకటే మార్క్స్ వస్తే కెమిస్ట్రీలో ఎన్టీఏ స్కోర్ పరిశీలిస్తారు.
పరీక్షలోని అన్ని సబ్జెక్టులలో తక్కువగా తప్పు సమాధానాలు ఇచ్చినవి.. ఎక్కువగా సరైన సమాధానాలు ఇచ్చినవి చూస్తారు. ఈ విషయంలో కూడా అభ్యర్థులు సమానంగా ఉంటే మాథ్స్‌లో తప్పుగా ఇచ్చిన సమాధానాలు, ఎక్కువగా ఇచ్చిన సరైన సమాధానం ఆధారంగా అర్హత గల అభ్యర్థిని నిర్ణయిస్తారు. అలానే కెమిస్ట్రీ, ఫిజిక్స్ కూడా చూస్తారు. చివరికి వయస్సులో పెద్దవారు ఎవరనేది చూస్తారు. ఒకటే ఏజ్ ఉంటే అప్లికేషన్ నంబర్లు ఆరోహణ క్రమంలో పరిశీలిస్తారు.
Published by:Mahesh
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.