హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main 2022: జేఈఈ మెయిన్ 2022లో పలు మార్పులు.. డిజిట‌ల్ లాక‌ర్లు, ఈ స్కోర్ కార్డులు

JEE Main 2022: జేఈఈ మెయిన్ 2022లో పలు మార్పులు.. డిజిట‌ల్ లాక‌ర్లు, ఈ స్కోర్ కార్డులు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

JEE Mains 2022 Changes | నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ మంగళవారం జేఈఈ మెయిన్‌ షెడ్యూల్‌ను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2022 పరీక్షల‌ను నిర్వ‌హిస్తారు. అయితే ప‌రీక్ష‌లో కొన్ని మార్పులు చేసింది. అవేంటో తెలుసుకోండి.

ఇంకా చదవండి ...

నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (National Testing Agency) మంగళవారం జేఈఈ మెయిన్‌ షెడ్యూల్‌ను (JEE Main 2022 schedule) విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీ, ఐఐఐటీ, ఎన్ఐటీల్లో ప్రవేశం కోసం నిర్వహించే జేఈఈ మెయిన్స్ 2022 (JEE Main 2022) పరీక్షల‌ను నిర్వ‌హిస్తారు. ఈ ఏడాది రెండు విడుతల్లో మాత్రమే జేఈఈ మెయిన్‌ పరీక్ష నిర్వహించనున్నట్లు ఎన్‌టీఏ పేర్కొంది. ఏప్రిల్ 16, 2022 నుంచి ఏప్రిల్ 21, 2022 వరకు మొదటి సెషన్‌, మే 24, 2022 నుంచి మే 29, 2022 వరకు రెండో సెషన్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎన్‌టీఏ సీనియర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సాధనా పరాషర్‌ వెల్లడించారు. అయితే ప‌రీక్ష‌లో కొన్ని మార్పులు చేసింది. అవేంటో తెలుసుకోండి.

JEE Main 2022: జేఈఈ మెయిన్స్ 2022 పరీక్షల షెడ్యూల్ విడుదల.. రెండు విడతల్లోనే పరీక్షలు

జేఈఈ మెయిన్స్ 2022లో మార్పులు..

నంబ‌ర్ ఆఫ్ సెష‌న్స్ -  ఈ ఏడాది రెండు సెషన్లలో (ఏప్రిల్/మే) నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ సమయంలో, మొదటి సెషన్‌లో, సెషన్ 1 (ఏప్రిల్) మాత్రమే కనిపిస్తుంది. విండో మళ్లీ తెరిచిన‌ప్పుడు సెషన్ 2 (మే) కనిపిస్తుంది.

మొబైల్ నంబ‌ర్ ధ్రువీక‌ర‌ణ - అభ్యర్థులు నమోదు చేసుకున్నప్పుడు, వారు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వ‌చ్చిన OTPని నమోదు చేయాలి. ఫీజు చెల్లించే ముందు, వారు వారి రిజిస్టర్డ్ ఈ-మెయిల్ చిరునామాకు పొందిన‌ OTPని నమోదు చేయాలి.

త‌ప్పుల స‌వ‌ర‌ణ - ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ దశలోనూ దిద్దుబాటు సౌకర్యం కల్పించ‌రు.

ప‌రీక్ష న‌గ‌రం ఎంపిక - రిజిస్ట్రేషన్ సమయంలో పూరించిన శాశ్వత, ప్రస్తుత చిరునామా ఆధారంగా పరీక్ష నగరాల ఎంపిక చేస్తారు.

Dyslexia: పాఠ‌శాల పిల్ల‌ల్లో "డైస్లెక్సియా" ల‌క్ష‌ణాలు.. అంటే ఏమిటి.. ప‌రిష్కారం ఏమిటి?

వార్షిక ఆదాయం - కుటుంబ వార్షిక ఆదాయం తప్పనిసరిగా పేర్కొనాలి.

స్కోర్ కార్డ్‌- ఈ సారి ఈమెయిల్ ద్వారా సాఫ్ట్ కాపీ స్కోర్ కార్డును అంద‌జేస్తారు.

యాప్ - NTA నుంచి నోటిఫికేషన్‌లను స్వీకరించడానికి అభ్యర్థులు SANDES యాప్‌ను వారి స్మార్ట్‌ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేసుకోవాలి.

ఆన్‌లైన్ అప్లికేష‌న్ ఫాం - అభ్యర్థుల సౌలభ్యం కోసం, దరఖాస్తు ఫారమ్ అప్‌గ్రేడ్ చేశారు. రిజిస్ట్రేష‌న్ ప్రాసెస్‌ను మూడు భాగాలుగా మార్చారు అవే..

Step 1 - రిజిస్ట్రేషన్ ఫారమ్

Step 2 - దరఖాస్తు ఫారమ్

ఇందులో వ్యక్తిగత వివరాలను పూరించడం, పరీక్ష నగరాలకు దరఖాస్తు చేయడం, అర్హత వివరాలు, అదనపు వివరాలు న‌మోదు చేసుకొచ్చు.

Step 3 - రుసుము చెల్లింపు.

ఫోటోగ్రాఫ్ - ద‌ర‌ఖాస్తు స‌మ‌యంలో ఫోటోగ్రాఫ్ తిరిగి ప‌రిశీలించ‌డానికి అవ‌కాశం ఇస్తున్నారు.

డిజిట‌ల్ లాక‌ర్ - UMANG, DigiLocker యొక్క అదనపు ప్లాట్‌ఫారమ్‌తో అభ్యర్థులందరికీ వారి పేజీ, అడ్మిట్ కార్డ్, స్కోర్ కార్డ్‌లు మొదలైన పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవడానికి NTA సౌకర్యం కల్పిస్తోంది.

నెగిటీవ్ మార్కింగ్ - సెక్షన్ A (MCQ) మరియు సెక్షన్ B (సంఖ్యా విలువ) రెండింటికీ ప్రతికూల మార్కింగ్ ఉంటుంది.

ప‌రీక్ష‌ల్లో ఏప్రిల్ 16, 2022 నుంచి ఏప్రిల్ 21, 2022 వరకు మొదటి సెషన్‌, మే 24, 2022 నుంచి మే 29, 2022 వరకు రెండో సెషన్‌ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించినట్లు ఎన్‌టీఏ సీనియర్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సాధనా పరాషర్‌ వెల్లడించారు. విద్యార్థులకు మార్చి 1, 2022 తేదీ నుంచి మార్చ్ 31, 2022 వరకు సాయంత్రం 5 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని ఆయ‌న‌ సూచించారు.

First published:

Tags: Career and Courses, EDUCATION

ఉత్తమ కథలు