Home /News /jobs /

JEE MAIN 2022 CANDIDATES ASK NTA TO POSTPONE EXAM KNOW KEY DEMANDS GH VB

JEE Main 2022: జేఈఈ మెయిన్‌ వాయిదా వేయాలని విద్యార్థుల డిమాండ్‌.. కారణాలు ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఈ ఏడాది జేఈఈ మెయిన్‌ 2022(JEE Main 2022) మొదటి విడత పరీక్షలు ఏప్రిల్‌లో, రెండో విడత పరీక్షలు మే నెలలో నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్షలను వాయిదా వేయాలని కొందరు విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు.

ఈ ఏడాది జేఈఈ మెయిన్‌ 2022(JEE Main 2022) మొదటి విడత పరీక్షలు ఏప్రిల్‌లో, రెండో విడత పరీక్షలు మే నెలలో నిర్వహించనున్నారు. అయితే ఈ పరీక్షలను వాయిదా వేయాలని కొందరు విద్యార్థులు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రత్యక్ష పద్ధతిలో బోర్టు పరీక్షలు (Board Exams) జరుగుతున్నాయని, ఈ పరీక్షలకు జేఈఈ మెయిన్‌కు మధ్య పెద్దగా సమయం కూడా లేదని చెబుతున్నారు. ఈ ఏడాది కూడా జేఈఈ మెయిన్‌ను నాలుగు విడతల్లో కూడా నిర్వహించాలని విద్యార్థులు కోరుతున్నారు. బోర్డు పరీక్షలకు ఇంజనీరింగ్‌ ప్రవేశ పరీక్షకు మధ్య ఎక్కువ సమయం కావాలని, పరీక్షలను నాలుగు విడతల్లో నిర్వహించాలనే వాదనను బలంగా వినిపిస్తున్నారు. సెక్షన్‌ బీలో నెగెటివ్‌ మార్కింగ్‌ ఉంటుందని నిర్వాహకులు చివరినిమిషాల్లో ప్రకటించారు. ఈ అంశంపై కూడా విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులకు దేశవ్యాప్తంగా ఉన్న కళాశాలల్లో ఇంజనీరింగ్‌ (Engineering),ఆర్కిటెక్చర్‌(Architecture) చదివే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలో ముందు నిలిచిన 2.5 లక్షల మందికి ఐఐటీ ఎంట్రన్స్‌ ఎగ్జామ్‌ జేఈఈ అడ్వాన్స్డ్‌ రాసే అవకాశం ఉంటుంది. ఏటా జేఈఈ మెయిన్‌ను దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు రాస్తారు.







పబ్లిక్‌ పరీక్షలు, జేఈఈ మెయిన్‌ మధ్య తక్కువ సమయం
జేఈఈ మెయిన్‌ మొదటి విడత పరీక్షలు ఏప్రిల్‌ 16 నుంచి 21 వరకు, అదే విధంగా రెండో విడత పరీక్షలు మే 24 నుంచి 29 వరకు నిర్వహిస్తారు. సీబీఎస్‌సీ బోర్డు పరీక్షలు ఏప్రిల్‌ 26వ తేదీన ప్రారంభమవుతాయి. ఆయా రాష్ట్రాల్లో కూడా పది, ఇంటర్‌ పరీక్షలు ఈ సమయంలోనే నిర్వహించనున్నట్లు ప్రకటించారు. దీంతో విద్యార్థులు పరీక్షలను వాయిదా వేయాలని సోషల్‌ మీడియా వేదికగా NTA (National Testing Agency)ను కోరారు. జేఈఈ మెయిన్‌ మొదటి విడత పరీక్షలు మే నెలలో ప్రారంభించాలని, పరీక్షల మధ్య తక్కువ సమయం ఉంటే విద్యార్థులకు ఇబ్బందులు తప్పవని చెప్పారు.



జేఈఈ మెయిన్‌ నాలుగు విడతల్లో నిర్వహించాలని డిమాండ్‌
జేఈఈ మెయిన్‌ 2022ను పాత తరహాలోనే నిర్వహిస్తున్నారు. గతేడాది జేఈఈ మెయిన్‌ను నాలుగు విడతలుగా ఏర్పాటు చేశారు. కరోనా కాలంలో సక్రమంగా తరగతులు జరగలేదని, ఇప్పుడు ప్రత్యక్ష పద్ధతిలో బోర్డు పరీక్షలు, ప్రాక్టికల్స్‌ రాయాల్సి ఉందని, ఈ సమయంలో రెండు విడతల్లో జేఈఈని సాధించడం విద్యార్థులకు కష్టమని చెబుతున్నారు. గతేడాది కొవిడ్‌ కారణంగా ఎక్కువగా తరగతులు ఆన్‌లైన్‌లో జరిగాయని, కోచింగ్‌ దెబ్బతిందని, ఈ సమయంలో నాలుగు విడతలుగా జేఈఈ నిర్వహించాలని చెబుతున్నారు.



నెగెటివ్‌ మార్కింగ్‌పై వివరణ
జేఈఈ మెయిన్‌ 2022 పరీక్షలో రెండు విభాగాలు ఉంటాయి. సెక్షన్‌ ఏలో మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నలు, సెక్షన్‌ బీలో న్యూమరికల్‌ తరహా ప్రశ్నలు ఉంటాయి. ప్రతి సరైన సమాధానానికి విద్యార్థులకు నాలుగు మార్కులు లభిస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు కోత విధిస్తారు. ఇంతకు ముందు తప్పుడు సమాధానానికి మార్కుల కోత ఉండేది కాదు. నెగెటివ్‌ మార్కులు ప్రవేశపెట్టడంతో విద్యార్థులు పొందే మార్కులపై ప్రభావం ఉంటుంది.



మొదటి విడత జేఈఈ మెయిన్‌ పరీక్షలకు అప్లికేషన్ల ప్రక్రియ మొదలైంది. jeemain.nta.nic.in వెబ్‌సైట్‌ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఇంగ్లీషు, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, పంజాబీ, తమిళం, తెలుగు, ఉర్దూ భాషల్లో పరీక్షలు జరుగుతాయి.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Jee main 2022, Students

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు