హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Main 2022: జేఈఈ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. నేటి రాత్రితో ముగియనున్న రిజిస్ట్రేష‌న్.. అప్లికేష‌న్ వివ‌రాలు

JEE Main 2022: జేఈఈ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. నేటి రాత్రితో ముగియనున్న రిజిస్ట్రేష‌న్.. అప్లికేష‌న్ వివ‌రాలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

JEE Main 2022 | జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షలను(Entrance Test) నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కీలక నిర్ణయం తీసుకుంది. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కల్పించడానికి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ -2022 కోసం దరఖాస్తు గ‌డువు నేటితో ముగియ‌నుంది.

ఇంకా చదవండి ...

  జాతీయ స్థాయిలో ప్రవేశ పరీక్షలను(Entrance Test) నిర్వహించే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) కీలక నిర్ణయం తీసుకుంది. ఐఐటీ, ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కల్పించడానికి జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE) మెయిన్ -2022 కోసం దరఖాస్తు గ‌డువు నేటితో ముగియ‌నుంది. సీబీఎస్ఈ టర్మ్ 2 పరీక్షలు.. జేఈఈ మెయిన్ సెషన్‌1తో క్లాష్ కావడంతో చాలా మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోలేదు. ఈ నేప‌థ్యంలో జేఈఈ మెయిన్స్ మరోసారి వాయిదా పడడంతో విద్యార్థులు మరోసారి దరఖాస్తు చేసుకోవాలని భావిస్తున్నారు. వీరిని దృష్టిలో ఉంచుకుని ఎన్‌టీఏ ద‌ర‌ఖాస్తు గ‌డువు పొడ‌గించింది ఈ గ‌డువు నేటితో ముగియ‌నుంది. వివ‌రాల కోసం అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.in ను సంద‌ర్శించాలి.

  TSPSC Group 1: గ్రూప్స్ అభ్య‌ర్థుల‌కు అల‌ర్ట్‌.. పేప‌ర్ క‌రెక్ష‌న్‌లో మార్పులు తీసుకొస్తున్న టీఎస్‌పీఎస్‌సీ

  ముఖ్యమైన తేదీలు..

  ఏప్రిల్ 25 రాత్రి 9 గంటల వరకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. JEE మెయిన్ 2022 సెషన్ 1 పరీక్షలు జూన్ 20 నుంచి ప్రారంభమై.. 29 వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే పరీక్షను మూడుసార్లు వాయిదా వేసిన తరువాత ఈ తేదీలను ఖరారు చేశారు.

  దరఖాస్తు విధానం

  Step 1: అభ్యర్థులు సంస్థ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.nic.inను సందర్శించాలి

  Step 2: హోమ్ పేజీకి వెళ్లి జేఈఈ మెయిన్ 2022 రిజిస్ర్టేషన్ లింక్‌పై క్లిక్ చేయాలి

  Step 3: రీ డైరెక్టెడ్ పేజీలో రిజిస్ర్టేషన్ వివరాలను నమోదు చేసి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి.

  Infosys: ఇన్ఫోసిస్ కొత్త రూల్‌.. రిజైన్ చేస్తే.. ఆరు నెల‌ల‌పాటు ఆ కంపెనీల్లో చేరొద్దని రూల్‌!

  Step 4: పోస్ట్-రిజిస్ట్రేషన్ కోసం అభ్యర్థులు దరఖాస్తు ఫారమ్‌ను పూరించాలి

  Step 5: అనంతరం అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి దరఖాస్తు రుసుమును చెల్లించాలి. ఆపై దరఖాస్తు ఫారమ్‌ను సమర్పించండి

  Step 6: అభ్యర్థులు కన్ఫర్మేషన్ పేజీని డౌన్‌లోడ్ చేసుకోవాలి.

  Step 7: భవిష్యత్ అవసరాల కోసం వాటిని ప్రింట్ అవుట్ తీసుకోండి

  Job Mela in AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో జాబ్‌మేళా.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు.. వాక్ ఇన్ తేదీలు

  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ అడ్వాన్స్ 2022 కోసం అడ్మిట్ కార్డ్ విడుదల తేదీని ఇంకా ప్రకటించలేదు. ఎగ్జామినేషన్ సిటీ అడ్వాన్స్ ఇన్టిమేషన్ తేదీలు, అడ్మిట్ కార్డ్‌ల డౌన్‌లోడ్, రిజల్ట్ డిక్లరేషన్ గడువులోగా JEE (మెయిన్) పోర్టల్‌లో ఉంటాయని ఇటీవల ఎన్‌టీఏ విడుదల చేసిన నోటిఫికేషన్‌లో పేర్కొంది.

  అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసే విధానం

  Step 1: JEE మెయిన్ 2022 అధికారిక పోర్టల్‌లో లాగిన్ అవ్వండి

  Step 2: హోమ్‌ పేజీలో అందుబాటులో ఉన్న JEE మెయిన్ 2022 అడ్మిట్ కార్డ్ లింక్‌పై క్లిక్ చేయండి

  Step 3: సంబంధిత కాలమ్స్‌లో మీ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయండి

  Step 4: వెంటనే దాన్ని సమర్పించండి

  Step 5: మీ JEE మెయిన్ 2022 అడ్మిట్ కార్డ్ మీ స్క్రీన్‌పై కనిపిస్తుంది.

  Step 6: అడ్మిట్ కార్డ్ కాపీని సేవ్ చేసి, పరీక్ష రోజున దానిని తీసుకెళ్లడానికి ప్రింటవుట్ తీసుకోండి

  నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) జేఈఈ మెయిన్స్ ను ఈ ఏడాది రెండు సెషన్లలో నిర్వహిస్తోంది. గతేడాది నాలుగు దశల్లో నిర్వహించిన సంగతి తెలిసిందే.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: Entrance exams, Exams, IIT, Jee main 2022

  ఉత్తమ కథలు