JEE Main Preparation Tips: జేఈఈ మెయిన్ ఎగ్జామ్‌ కోసం రెడీ అవుతున్నారా ?.. ప్రిపరేషన్ టిప్స్ తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ఆగస్టు ఆఖరి వారం, సెప్టెంబరు మొదటి వారంలో JEE మెయిన్ 2021, సెషన్ 4 పరీక్ష జరగనుంది.

  • Share this:
కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చిన JEE మెయిన్ తరువాతి దశ పరీక్షలు త్వరలోనే జరగనున్నాయి. ప్రతి సంవత్సరం లక్షల మంది విద్యార్థులు మంచి ఇంజనీరింగ్ కళాశాలలో ప్రవేశం పొందేందుకు జేఈఈ మెయిన్స్ రాస్తున్నారు. ఈ ప్రవేశ పరీక్ష కఠినంగా ఉంటుంది. అందువల్ల సిలబస్ మొత్తం పూర్తి చేసి, ప్లానింగ్ ప్రకారం రివిజన్ చేయాలని విద్యారంగ నిపుణులు సూచిస్తున్నారు. ముందు సిలబస్‌ను సబ్జెక్టులు, కాన్సెప్టుల వారీగా విభజించుకోవాలి. వీటిలో ఎలాంటి టాపిక్స్‌లో వెనుకబడి ఉన్నారో గుర్తించి, వాటిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. దీంతోపాటు 11, 12 తరగతులకు సంబంధించిన మొత్తం సిలబస్‌ను రివిజన్ చేసుకోవాలి. ఆగస్టు ఆఖరి వారం, సెప్టెంబరు మొదటి వారంలో JEE మెయిన్ 2021, సెషన్ 4 పరీక్ష జరగనుంది. దీనికి ప్రిపేర్ అవుతున్న వారికి.. సబ్జెక్ట్ వారీగా ప్రిపరేషన్ టిప్స్‌ అందిస్తున్నాం.

* ఫిజిక్స్
పరీక్షకు ఇంకా మూడు వారాల సమయం మాత్రమే ఉంది. అందువల్ల ప్రతి టాపిక్‌ను రివిజన్ చేసుకోవాలి. ప్రాబ్లం సాల్వింగ్‌లో వెనుకబడి ఉన్న టాపిక్‌లపై దృష్టి పెట్టాలి. మొదటి వారం ఎలక్ట్రోస్టాటిక్స్, గ్రావిటేషన్, మాగ్నెటిక్స్, EMI చాప్టర్‌లను రివిజన్ చేసుకోవడం మంచింది. రెండో వారంలో ఆప్టిక్స్, మోడర్న్ ఫిజిక్స్, వేవ్స్, యూనిట్ డైమెన్షన్స్ అండ్ ఎర్రర్స్ టాపిక్స్‌ చదవాలి. మూడో వారంలో ఫ్లుయిడ్స్, వర్క్ ఎనర్జీ, రొటేషన్ అండ్ సెమీ కండక్టర్ ఛాప్టర్స్‌ పూర్తి చేయాలి.

సెమీ కండక్టర్ ఛాప్టర్‌లో ట్రాన్సిస్టర్స్‌పై కాకుండా డయోడ్ సర్క్యూట్, గేట్స్ వంటి టాపిక్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. JEE మెయిన్, అడ్వాన్స్ రెండింటికి సంబంధించిన పాఠ్యాంశాలను ముందుగా రివైజ్ చేయండి. చాలా ప్రశ్నలు ఈ భాగాల నుంచి మాత్రమే అడుగుతారని గుర్తుంచుకోవాలి. ఎలక్ట్రోడైనమిక్స్, మెకానిక్స్ వంటి ఛాప్టర్లను చాలాసార్లు రివిజన్ చేయాలి. ఎందుకంటే వీటి నుంచే ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలు చాలా క్లిష్టంగా ఉంటాయి.

జామెట్రికల్ ఆప్టిక్స్‌లో మైక్రోస్కోప్, టెలిస్కోప్ వంటి ఆప్టికల్ ఇన్‌స్ట్రుమెంట్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఈ ప్రశ్నలను ఈజీగా సాల్వ్ చేసి స్కోర్ పెంచుకోవచ్చు. ఆసిలేషన్స్ విభాగం కోసం NCERT బుక్స్ చదవాలి. మోడర్న్ ఫిజిక్స్ ప్రశ్నలకు తక్కువ సమయంలోనే సాల్వ్ చేయవచ్చు. అందువల్ల వీటికి ఎక్కువ సమయం కేటాయించాలి. ఈ చివరి మూడు వారాల్లో JEE మెయిన్ ప్రశ్నలను టైమ్-బౌండ్ పద్ధతిలో ప్రాక్టీస్ చేయడం మంచి పద్ధతి.

* కెమిస్ట్రీ
పరీక్ష సమయంలో చాలా మంది విద్యార్థులు భయాందోళనకు గురవుతారు. పరీక్షలో మార్కులు తగ్గడానికి ఇది ప్రధాన కారణం. పరీక్ష సమయంలో విద్యార్థులు అనవసరంగా టెన్షన్ పడకూడదు. ఇందుకు ముందు నుంచే ప్రాబ్లం సాల్వింగ్ స్పీడ్‌, పరీక్షపై నమ్మకాన్ని పెంచుకునే ప్రయత్నాలు చేయాలి. అన్ని ఛాప్టర్లు రివిజన్ చేయడం, తోటి వారితో చర్చించడం వల్ల సులభంగా సబ్జెక్టు అర్థం చేసుకోవచ్చు. బేసిక్ మ్యాథమెటికల్ టూల్స్, టెక్నిక్స్ తెలిస్తే.. ఫిజికల్ కెమిస్ట్రీ నుంచి వచ్చే ప్రశ్నలను సులభంగా పరిష్కరించవచ్చు.

ఇన్‌ఆర్గానిక్ కెమిస్ట్రీలో విద్యార్థులు GOC ఐసోమెరిజం, నేమ్ రియాక్షన్స్, ఫంక్షన్స్ ఆఫ్ రీఏజెంట్స్ టాపిక్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టాలి. దీంతోపాటు ముందు నుంచి నిర్లక్ష్యం చేసిన టాపిక్స్‌ను కూడా కవర్ చేయాలి. కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, సర్ఫేస్ కెమిస్ట్రీ, బయో మాలిక్యుల్స్ వంటి అంశాలపై పట్టు సాధిస్తే, మంచి స్కోర్ పొందవచ్చు. పాత IIT పేపర్లతో మాక్ టెస్టులు నిర్వహించుకోవడం వల్ల స్పీడ్ పెరుగుతుంది. అందువల్ల మాక్ టెస్ట్ స్కోర్‌ను విశ్లేషించాలి. ఎక్కడ ఎలాంటి తప్పులు చేస్తున్నారో తెలుసుకోవాలి. అవసరమైతే సబ్జెక్ట్ నిపుణులను సంప్రదించాలి.

* మ్యాథ్స్
ముందు విద్యార్థులు అన్ని మ్యాథమెటిక్స్ టాపిక్స్‌ నోట్ చేసుకొని.. వాటికి ప్రత్యేకంగా టైమ్‌టేబుల్ సిద్ధం చేసుకోవాలి. మొత్తం టాపిక్స్‌ను ఈజీ, మోడరేట్, డిఫికల్ట్, ఇంపార్టెంట్ టాపిక్స్‌.. వంటి నాలుగు కేటగిరీలుగా గుర్తించండి. జేఈఈ మెయిన్‌లో దాదాపు అన్ని టాపిక్స్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. అందువల్ల కాంప్లెక్స్ నెంబర్స్, పెరాబోలా వంటి క్లిష్టమైన ఛాప్టర్లను ముందు రివిజన్ చేసుకోండి. ఇందుకు మీరు ముందుగా సిద్ధం చేసుకున్న NCERT MIS, క్లాస్ నోట్స్, CPPలు, రిఫరెన్స్ బుక్స్‌ను ఫాలో అవ్వాలి. ఈజీ, మీడియం టాపిక్స్ కోసం క్లాస్ నోట్స్, టెస్ట్ పేపర్లు, CPPలు, ముఖ్యమైన మోడల్స్‌ రిఫర్ చేసుకోవచ్చు. మిమ్మల్ని మీరు టెస్ట్ చేసుకోవడానికి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్‌లో ప్రశ్నలను పరిశీలించండి. అన్ని టాపిక్స్ పూర్తి చేసిన తర్వాత మాక్ టెస్ట్‌లను ప్రయత్నించండి.

మ్యాథమెటికల్ రీజనింగ్, స్టాటిస్టిక్స్, హైట్ అండ్ డిస్టెన్స్, సెట్స్ అండ్ రిలేషన్స్ వంటి అదనపు టాపిక్స్‌ ప్రిపేర్ అవ్వాలి. వీటి నుంచి 2-3 ప్రశ్నలు వస్తాయి. JEE అడ్వాన్స్‌డ్ కోసం క్యాలిక్యులస్, ఆల్జీబ్రాపై ఎక్కువ దృష్టి పెట్టాలి. ఎందుకంటే ఈ భాగం నుంచి 70-75 శాతం ప్రశ్నలు వస్తాయి.

క్యాలిక్యులస్, ఆల్జీబ్రా రివిజన్ కోసం క్లాస్ నోట్స్, CPPలు, పాత ప్రశ్నపత్రంలోని ప్రశ్నలు, FIITJEE రివిజన్ బుక్‌లెట్, మాక్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేయాలి. JEE అడ్వాన్స్‌డ్‌లో కోఆర్డినేట్, త్రికోణమితి సెక్షన్‌కు 25-30 శాతం వెయిటేజీ ఉంటుంది. వీటిపైన కూడా విద్యార్థులు దృష్టి పెట్టాలి. వెక్టర్ / 3D, మ్యాట్రిసెస్ నుంచి 4-6 ప్రశ్నలు రావచ్చు. సులభంగా సాల్వ్ చేసే ఈ టాపిక్స్‌ను వదిలేయకూడదు.
First published: