జేఈఈ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ముఖ్య గమనిక. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జేఈఈ మెయిన్ 2021 సెషన్ 4 అప్టికేషన్/కరెక్షన్ విండోను రీఓపెన్ చేసింది. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.inలో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఈ పరీక్ష కోసం అభ్యర్థులు ఆన్లైన్లో ఈ నెల 9 నుంచి 11 వరకు రిజిస్టర్ కావొచ్చు. NTA 4వ సెషన్ పరీక్షను ఆగస్టు 26, 27, 31 మరియు సెప్టెంబర్ 1, 2 తేదీల్లో నిర్వహించనున్నారు. విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్ తో జేఈఈ మెయిన్ 4 వ సెషన్ ఎగ్జామ్ కు దరఖాస్తు లేదా విత్ డ్రా చేసుకునే అవకాశాన్ని కల్పించినట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తెలిపింది. అయితే ఇప్పటికే ఇప్పటికే ఈ పరీక్షకు అప్లై చేసుకున్న అభ్యర్థులు తిరిగి మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సి అవసరం లేదని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. అభ్యర్థులు ఆగస్టు 9 నుంచి 11 వరకు కేటగిరీ, సబ్జెక్ట్ తదితర వివరాలను సరి చేసుకోవచ్చు.
RRB NTPC: ఆర్ఆర్బీ పరీక్ష రాసిన అభ్యర్థులకు శుభవార్త.. వారికి ఫీజు రీఫండ్
NEET PG: ఆగస్టు 16 నుంచి నీట్ పీజీ రిజిస్ట్రేషన్, ఎడిట్ విండో ప్రారంభం.. పూర్తి వివరాలివే!
JEE Main 2021 session 4: రిజిస్ట్రేషన్ స్టెప్స్..
-అభ్యర్థులు మొదటగా jeemain.nta.nic.in వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
-హోం పేజీలో కనిపించే Registration/Correction for session-4 of JEE Main 2021'. ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
-కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
-కావాల్సిన వివరాలను నమోదు చేయాలి.
-అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
-అనంతరం అప్లికేషన్ ఫామ్ ను సబ్మిట్ చేయాలి.
-అభ్యర్థులు ఈ లింక్ ద్వారా నేరుగా కరెక్షన్ విండో ఓపెన్ చేయాలి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Exams, Jee, JEE Main 2021