బీఈ, బీటెక్, బీఆర్క్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఇటీవల నిర్వహించిన జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) మెయిన్ ర్యాంకులు విడుదల మళ్లీ వాయిదా పడింది. దీంతో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(National Testing agency) ఫలితాల విడుదలలో విఫమైందనే విమర్శలు వస్తున్నాయి. పది లక్షల మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న ఫలితాలపై ఎన్‌టీఐ(NTA) తీరు సరిగా లేదని విద్యావేత్తలు అంటున్నారు. కనీసం ఇంకా ఎప్పుడు ఫలితాలు విడుదల అవుతాయో స్పష్టంగా చెప్పకపోవడంతో సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఇది "నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ" కాదని.. "నాట్ టుడే ఏజెన్సీ" అంటూ వ్యంగంగా విమర్శలు చేస్తున్నారు. గత మూడేళ్లుగా ఫలితాల విడుదలలో ఎన్‌టీఐ తీరు విమర్శలకు తావిస్తోంది. సరైన సమయాల్లో వెళ్లడించకపోవడం.. అర్ధరాత్రి విడుదల చేయడంపై ఇప్పికే చాలా సార్లు విద్యార్థులు అసహనం వ్యక్తం చేశారు.
ఆగిన అడ్వాన్స్ దరఖాస్తు ప్రక్రియ..
జేఈఈ మెయిన్ ఫలితాల విడుదల ఆలస్యంతో మళ్లీ జేఈఈ అడ్వాన్స్(Advance) దరఖాస్తు ప్రక్రియ వాయిదా పడింది. ఇప్పటికే ఐఐటీ ఖరగ్ పూర్ ఎన్‌టీఏను నమ్ముకొని జేఈఈ అడ్వాన్స్ దరఖాస్తులను ఆహ్వానిస్తూ షెడ్యూల్ విడుదల చేసింది. జేఈఈ మెయిన్ ఫలితాలు 10 వతేదీలోపు వెల్లడించాల్సి ఉంది.
NCRTC Recruitment 2021: ఎన్‌సీఆర్‌టీసీలో 226 ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి
ఇవి వెళ్లడిస్తే సెప్టెంబర్ 13న జేఈఈ అడ్వాన్స్ ప్రవేశాలకు దరఖాస్తు(Application) ప్రారంభించాలి. కానీ ఇంకా ఎన్‌టీఏ ఫలితాలు వెల్లడించకపోవడంతో ఐఐటీ ఖరగ్‌పూర్ విధిలేని పరిస్థుల్లో పరీక్ష దరఖాస్తు ప్రక్రియను వాయిదా వేసింది. తాజా సమాచారం కోసం అధికారికి వెబ్‌సైట్‌ను ఎప్పిటికప్పుడు చూస్తూ ఉండడంని ఐఐటీ ఖరగ్‌పూర్(IIT kharagpur) తెలిపింది.
కారణం ఇదే!
జేఈఈ ఫలితాల ఆలస్యంపై ఎన్‌టీఐ డెరెక్టర్(NTA Director) వినిత్‌జోషి కొన్ని మీడియా చానళ్లతో మాట్లాడారు. ఫలితాలు ఓ వారం రోజుల్లో వెలువడతాయిని అన్నారు. సీబీఐ దర్యాప్తు ఫలితాల వెళ్లడికి ఆలస్యం కాదని.. సిబ్బందిలో కొందరు అనారోగ్యం పాలయ్యారని అందుకే ఆలస్యమవుతుందని వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EDUCATION, Exams postponed, Jee, JEE Main 2021