• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • JEE MAIN 2021 MARCH REGISTRATION ENDS TOMORROW NO CORRECTION WINDOW AVAILABLE HERE FULL DETAILS NS

JEE Main 2021: జేఈఈ మెయిన్ మార్చి సెషన్ రిజిస్ట్రేషన్ కు రేపే లాస్ట్ డేట్.. పూర్తి వివరాలివే..

JEE Main 2021: జేఈఈ మెయిన్ మార్చి సెషన్ రిజిస్ట్రేషన్ కు రేపే లాస్ట్ డేట్.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(JEE) మార్చి సెషన్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 2 ప్రారంభమైంది. అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 6న ముగియనుంది.

  • Share this:
    జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్(JEE) మార్చి సెషన్ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 2 ప్రారంభమైంది. అయితే ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ మార్చి 6న ముగియనుంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు jeemain.nta.nic.in వెబ్ సైట్లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. అయితే సమయం తక్కువ ఉండడంతో తప్పులు సవరించుకోవడానికి కరెక్షన్ విండోను అభ్యర్థులను అందుబాటులో ఉంచడం లేదు. మార్చి 6 సాయంత్రం 6 గంటల అనంతరం విద్యార్థులు అప్లికేషన్ ఫామ్ లలో దొర్లిన తప్పులను సవరించుకోవడానికి అవకాశం ఉండదు. ఇదిలా ఉంటే జేఈఈ మెయిన్ 2021 మార్చి సెషన్ పరీక్షను మార్చి 15 నుంచి 18 వరకు నిర్వహించనున్నారు. అయితే NTA ఈ సమయంలో మిగతా సెషన్స్ కు సైతం అప్లై చేసుకోవడానికి లేదా విత్ డ్రా చేసుకోవడానికి అవకాశం కల్పిస్తున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది.

    ఎలా అప్లై చేయాలంటే..
    -అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ jeemain.nta,nic.in వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
    -అనంతరం రిజిస్ట్రేషన్ లింక్ పై క్లిక్ చేయాలి.
    -పేరు, విద్యార్హతల వివరాలు నమోదు చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది.
    -అనంతరం ఫొటోగ్రాఫ్, సంతకం స్కాన్ కాపీలను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.
    -అనంతరం JEE Main 2021 అప్లికేషన్ ఫీజును చెల్లించాల్సి ఉంటుంది.
    -అనంతరం కర్ఫర్మేషన్ పేజీని ప్రింట్ తీసుకుని భద్రపరుచుకోవాలి.
    Published by:Nikhil Kumar S
    First published:

    అగ్ర కథనాలు