Home /News /jobs /

JEE MAIN 2021 FOURTH SESSION ADMIT CARD RELEASED FOLLOW THESE STEPS TO DOWNLOAD NS

JEE Main 2021 Admit Card: జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు విడుదల.. ఈ లింక్ తో డౌన్ లోడ్ చేసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జేఈఈ మెయిన్ 4 వ సెషన్ కు సంబంధించిన అడ్మిట్ కార్డులను అధికారులు విడుదల చేశారు. అభ్యర్థులు ఈ స్టెప్స్ ఫాలో అయి హాల్ టికెట్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

    జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్(JEE) మెయిన్ 2021 నాలుగవ సెషన్ కు సంబంధించిన అడ్మిట్ కార్డులను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తాజాగా విడుదల చేసింది. ఈ అడ్మిట్ కార్డులు ఆగస్టు 21వ తేదీ నుంచి jeemain.nta.nic.in, nta.ac.in వెబ్ సైట్లలో అందుబాటులో ఉంటాయని NTA తెలిపింది. ఈ పరీక్ష కోసం రిజిస్టర్ చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్ ను నమోదు చేసి హాల్ టికెట్ ను నమోదు చేసి హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇదిలా ఉంటే బీఈ, బీటెక్, బీఆర్క్ తదితర కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే JEE Main 2021 నాలుగవ సెషన్ ఎగ్జామ్ ఆగస్టు 26, 27, 31, సెప్టెంబర్ 1, 2 తేదీల్లో జరగనుంది. ఈ చివరి సెషన్ ఎగ్జామ్ కు 7 లక్షలకు పైగా అభ్యర్థులు హాజరుకానున్నారు.
    NEET 2021 MDS: నీట్ ఎండీఎస్ అభ్యర్థులకు అలర్ట్.. కౌన్సెలింగ్ గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

    హాల్ టికెట్ ను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలంటే..
    1.అభ్యర్థులు మొదటగా జేఈఈ మెయిన్ అధికారిక వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
    2. అనంతరం Download JEE(Main) - 2021 (Session-4) Admit Card Paper (B.E./B.Tech./B.Arch/B.Plan) పేరుతో లింక్ కనిపిస్తుంది.
    3. అనంతరం అప్లికేషన్ నంబర్, డేట్ ఆఫ్ బర్త్, సెక్యూరిటీ పిన్ ఉపయోగించి లాగిన్ అవ్వాలి.
    4.అనంతరం హాల్ టికెట్ ను డౌన్ లోడ్ చేసుకుని సేవ్ చేసుకోవాలి.

    జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డుపై ఎగ్జామ్ డేట్, టైమ్, ఎగ్జామ్ సెంటర్ ఉంటుంది. హాల్ టికెట్ డౌన్ లోడ్ చేసుకున్న అనంతరం విద్యార్థులు తమ పేరు, ఇతర వివరాలు సరిగా ఉన్నయా? లేదా? అని చెక్ చేసుకోవాలి. కరోనా నేపథ్యంలో పాటించాల్సిన నిబంధనలు కూడా అడ్మిట్ కార్డుపై ఉంటాయి. అడ్మిట్ కార్డుపై ఏమైనా తప్పులు ఉంటే 011-40759000 ఫోన్ నంబర్ ను లేదా jeemain@nta.ac.in ఈ మెయిల్ ను సంప్రదించవచ్చు. అడ్మిట్ కార్డు లేకపోతే ఎగ్జామ్ హాల్ లోకి అనుమతించరు. అభ్యర్థులు అడ్మిట్ కార్డుతో పాటు ఆధార్ కార్డు, బాల్ పాయింట్ పెన్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటో, హ్యాండ్ శానిటైజర్, వాటర్ బాటిల్ ను ఎగ్జామ్ హాల్ లోకి తీసుకోవచ్చు. మొబైల్ ఫోన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ లోనికి అనుమతించరు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Engineering course, Exams, JEE Main 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు