JEE Main 2021: జేఈఈ పరీక్షకు అప్లై చేసిన వారికి అలర్ట్.. కీలక ప్రకటన చేసిన అధికారులు

ప్రతీకాత్మక చిత్రం

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరిలో నిర్వహించనున్న JEE పరీక్షకు అప్లై చేసుకున్న వారు దరఖాస్తుల్లో ఏదైనా తప్పులు దొర్లితే సరి చేసుకునే అవకాశాన్ని రేపటి నుంచి కల్పిస్తున్నట్లు వెల్లడించింది.

  • Share this:
    నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తాజాగా కీలక ప్రకటన చేసింది. ఫిబ్రవరిలో నిర్వహించనున్న JEE పరీక్షకు అప్లై చేసుకున్న వారు దరఖాస్తుల్లో ఏదైనా తప్పులు దొర్లితే సరి చేసుకునే అవకాశాన్ని రేపటి నుంచి కల్పిస్తున్నట్లు వెల్లడించింది. ఈ అవకాశం జనవరి 30 వరకు ఉంటుందని తెలిపింది. గడువు ముగిసిన అనంతరం ఎలాంటి మార్పులు అనుమతించబడవని NTA స్పష్టం చేసింది. అధికారిక షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి సెషన్ కు సంబంధించిన అడ్మిట్ కార్డులను వచ్చే నెల రెండో వారంలోగా విడుదల చేయనున్నారు. అభ్యర్థులు పేరు, చిరునామా, విద్యార్హతల వివరాల్లో ఏమైనా తప్పులు దొర్లితే సరి చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.

    అప్లికేషన్ ఫామ్ ను ఎలా ఎడిట్ చేయాలంటే..
    -అభ్యర్థులు మొదటగా JEE Main 2021 అధికారిక వెబ్ సైట్ jeemain.nta.nic.inలో లాగిన్ అవ్వాలి.
    -అనంతరం “JEE Main Correction in Application Form 2021 link” పై క్లిక్ చేయాలి.
    -అక్కడ ఉండే instructionsను పూర్తిగా చదివిన అనంతరం ‘Proceed’ పై క్లిక్ చేయాలి.
    -అనంతరం మనకు కావాల్సిన వివరాలను ఎడిట్ చేసుకోవచ్చు.
    -ఎడిట్ చేయడం పూర్తయిన తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయాలి.
    Published by:Nikhil Kumar S
    First published: