Home /News /jobs /

JEE MAIN 2020 NEET 2020 EXAM DATES SUPREME COURT DISMISSES PLEA TO POSTPONE EXAMS SS

JEE Main NEET 2020 exams: పరీక్షల వాయిదా పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు

JEE Main NEET 2020 exams: పరీక్షల వాయిదా పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు
(ప్రతీకాత్మక చిత్రం)

JEE Main NEET 2020 exams: పరీక్షల వాయిదా పిటిషన్లను కొట్టేసిన సుప్రీం కోర్టు (ప్రతీకాత్మక చిత్రం)

JEE Main NEET 2020 exam dates | నీట్ 2020, జేఈఈ మెయిన్ 2020 పరీక్షలపై నెలకొన్న సస్పెన్స్ తొలగిపోయింది. ఈ పరీక్షల్ని వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టేసింది.

    జేఈఈ 2020, నీట్ 2020 పరీక్షల్ని వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టేసింది. ఈ పరీక్షల్ని వాయిదా వేస్తే విద్యార్థుల కెరీర్ ప్రమాదంలో పడుతుందని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. సెప్టెంబర్‌లో నిర్వహించబోయే జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్-JEE 2020, నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్-NEET 2020 పరీక్షల్ని కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని వాయిదా వేయాలంటూ 11 మంది విద్యార్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీకి వ్యతిరేకంగా సుప్రీం కోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై పలుమార్లు విచారణ జరిగింది. అయితే ఈ పరీక్షల్ని వాయిదా వేస్తే విద్యార్థుల కెరీర్ ప్రమాదంలో పడే అవకాశం ఉందని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది. పరీక్షల్ని నిర్వహించకపోతే విద్యార్థులు అకడమిక్ ఇయర్ కోల్పోతారని జస్టిస్ అరుణ్ మిశ్రా వ్యాఖ్యానించారు. అయితే కోవిడ్ 19 పరిస్థితుల్లో జీవితం కొనసాగుతూ ఉండాలని, పరీక్షల్ని ఎలా ఆపగలుగుతామన్నారు.

    Railway Jobs: రైల్వేలో 4499 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్... ఖాళీల వివరాలివే

    UPSC Jobs: రైల్వేతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో 559 జాబ్స్... రేపే చివరి తేదీ

    నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA తరఫున సుప్రీం కోర్టుకు హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహ్తా ఈ పరీక్షల్ని నిర్వహించడానికి కావాల్సిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని వివరించారు. ఈ పరీక్షల్ని వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు కొట్టేయడంతో షెడ్యూల్ ప్రకారమే ఎగ్జామ్స్ జరగనున్నాయి. మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నీట్ నిర్వహిస్తే, ఇంజనీరింగ్ ఇన్‌స్టిట్యూట్స్‌లో అడ్మిషన్ల కోసం జేఈఈ మెయిన్స్ నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే. ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు జేఈఈ మెయిన్ 2020, సెప్టెంబర్ 13న నీట్ 2020 పరీక్ష జరగనుంది.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: CAREER, Corona, Corona virus, Coronavirus, Covid-19, Exams, Jee, JEE Main 2020, National Testing Agency, NEET, NEET 2020, Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు