JEE Main 2020: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... తెలుగులో జేఈఈ మెయిన్స్
JEE Main 2020 | వచ్చే ఏడాది మొదలయ్యే అకడమిక్ సీజన్ కంటే ముందే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రెండు సార్లు జేఈఈ మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. మొదటి జేఈఈ మెయిన్ 2020 జనవరిలో, రెండో జేఈఈ మెయిన్ ఏప్రిల్‌లో ఉంటుంది.
news18-telugu
Updated: December 6, 2019, 1:46 PM IST

JEE Main 2020: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్... తెలుగులో జేఈఈ మెయిన్స్ (ప్రతీకాత్మక చిత్రం)
- News18 Telugu
- Last Updated: December 6, 2019, 1:46 PM IST
ఇంటర్ విద్యార్థులకు శుభవార్త. జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-JEE మెయిన్స్ ఎగ్జామ్ తెలుగులో రాసే అవకాశం లభిస్తోంది. అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని జేఈఈ మెయిన్స్ ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు, మరాఠీ భాషల్లో జేఈఈ మెయిన్స్ నిర్వహించనుంది కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ. తెలుగు రాష్ట్రాల నుంచి 1.6 లక్షలు, మహారాష్ట్ర నుంచి 1.1 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ మెయిన్ 2019 పరీక్ష రాశారు. జేఈఈ మెయిన్స్‌కు ఎక్కువ మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న రాష్ట్రాలకు ప్రాధాన్యం ఇచ్చేందుకు... కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ-MHRD వేర్వేరు భాషల్లో పరీక్ష నిర్వహించనుంది. గత ఐదేళ్లలో వచ్చిన అత్యధిక దరఖాస్తుల్ని పరిగణలోకి తీసుకొని పరీక్ష నిర్వహించాల్సిన భాషల్ని నిర్ణయిస్తోంది MHRD. ఇందుకు తగ్గట్టుగా స్థానిక భాషల్లో సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయనుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA.
జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-JEE మెయిన్స్ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కావడంతో పరీక్ష నిర్వహణలో కొన్ని సాంకేతిక పరిమితులు ఉన్నాయి. వాటిని పరిశీలించాల్సి ఉంది. జేఈఈ మెయిన్స్‌ను పలు భాషల్లో నిర్వహించేందుకు మేం సిద్ధమే. ఇందుకు కొంత సమయం పడుతుంది.
వచ్చే ఏడాది మొదలయ్యే అకడమిక్ సీజన్ కంటే ముందే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ రెండు సార్లు జేఈఈ మెయిన్ ఎగ్జామ్ నిర్వహిస్తుంది. మొదటి జేఈఈ మెయిన్ 2020 జనవరిలో, రెండో జేఈఈ మెయిన్ ఏప్రిల్‌లో ఉంటుంది. ఒక అభ్యర్థి ఈ రెండు పరీక్షలకూ హాజరు కావచ్చు. ఏ పరీక్షలో మార్కులు ఎక్కువగా వస్తే ఆ మార్కులనే అడ్మిషన్ సమయంలో పరిగణలోకి తీసుకుంటారు. ప్రస్తుతం జనవరిలో నిర్వహించే పరీక్షకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. 2020 జనవరి 6 నుంచి 11 వరకు జేఈఈ మెయిన్ 2020 ఎగ్జామ్ జరగనుంది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-NIT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ టెక్నాలజీ-IIT విద్యాసంస్థలతో పాటు కేంద్ర ప్రభుత్వ నిధులతో నడిచే టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్లో అడ్మిషన్ కోసం జేఈఈ మెయిన్ పరీక్ష రాస్తుంటారు విద్యార్థులు.
Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
TSSPDCL Syllabus: 3025 ఉద్యోగాలకు ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఇదే
Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1113 మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జాబ్స్... అప్లికేషన్ లింక్ ఇదే
HCL Recruitment 2019: హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు... వివరాలివే

— ఆర్.సుబ్రహ్మణ్యం, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ కార్యదర్శి
పవన్ కళ్యాణ్ రూ.కోటి విరాళం... ఎవరికంటే...
టీడీపీకి షాక్.. మాజీ ఎమ్మెల్యే గుడ్‌బై.. చంద్రబాబుకు లేఖ...
దిశ హంతకుల ఎన్కౌంటర్... ఆ హోటల్లో ఫ్రీ... ఫ్రీ.. ఫ్రీ..
ఏపీలో దారుణం... మూడు నెలల గర్భిణికి ఉరివేసి...
ఏపీలో మద్యం కొత్త రేట్లు ఇవే... నేటి నుంచే అమల్లోకి...
అమరావతిలో మహిళా ఉద్యోగుల బెంబేలు... భద్రత, రవాణా సదుపాయం కోసం విజ్ఞప్తి..
అదరగొట్టే లుక్స్‌తో 'బజాజ్ ఎలక్ట్రిక్ చెతక్'... ఎలా ఉందో చూడండి
Loading...
TSSPDCL Syllabus: 3025 ఉద్యోగాలకు ఎగ్జామ్ ప్యాటర్న్, సిలబస్ ఇదే
Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1113 మిడ్‌లెవెల్ హెల్త్ ప్రొవైడర్ జాబ్స్... అప్లికేషన్ లింక్ ఇదే
HCL Recruitment 2019: హిందుస్తాన్ కాపర్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు... వివరాలివే
Loading...