JEE Main 2020: జేఈఈ మెయిన్స్ విద్యార్థులకు అలర్ట్... ఇవి తీసుకెళ్లడం తప్పనిసరి

JEE Main 2020 | జేఈఈ మెయిన్స్ 2020 ఎగ్జామ్‌కు వెళ్తున్న విద్యార్థులకు అలర్ట్. పరీక్షకు విద్యార్థులు ఇవి తప్పనిసరిగా తీసుకెళ్లాలి.

news18-telugu
Updated: August 31, 2020, 5:10 PM IST
JEE Main 2020: జేఈఈ మెయిన్స్ విద్యార్థులకు అలర్ట్... ఇవి తీసుకెళ్లడం తప్పనిసరి
JEE Main 2020: జేఈఈ మెయిన్స్ విద్యార్థులకు అలర్ట్... ఇవి తీసుకెళ్లడం తప్పనిసరి (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
చాలా రోజుల పాటు సస్పెన్స్, ఉత్కంఠ, కోర్టు కేసులు, వాయిదాలు, తుది తీర్పు తర్వాత జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్-JEE మెయిన్స్ 2020 పరీక్ష జరగబోతోంది. వాస్తవానికి జేఈఈ మెయిన్స్ 2020 ఏప్రిల్‌లోనే జరగాల్సి ఉండగా కరోనా వైరస్ సంక్షోభం కారణంగా వాయిదా పడింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA ముందే ప్రకటించిన షెడ్యూలు ప్రకారం 2020 సెప్టెంబర్ 1 నుంచి 6 వరకు ఈ పరీక్ష జరగనుంది. దేశవ్యాప్తంగా 8.67 లక్షల మంది విద్యార్థులు జేఈఈ మెయిన్స్ రాస్తారని అంచనా. ఈసారి పరీక్ష నిర్వహణ ఎప్పట్లా ఉండదు. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి కొనసాగుతుండటంతో అనేక జాగ్రత్తలు తీసుకుంటోంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ. పరీక్ష కేంద్రానికి తీసుకురావాల్సిన, తీసుకురాకూడని వస్తువుల జాబితాను రివైజ్ చేసింది. అందుకే ఎగ్జామ్‌కు వెళ్లే విద్యార్థులు ముందుగా అడ్మిట్ కార్డులో అవేంటో తెలుసుకోండి.

AP Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1036 గ్రామ, వార్డు వాలంటీర్ ఉద్యోగాలు

Work From Home Jobs: ఉద్యోగం లేదా? ఇంటి నుంచే పనిచేస్తూ డబ్బు సంపాదించండి ఇలా

JEE Main 2020: పరీక్షకు అనుమతించేవి ఇవే...


ఎన్‌టీఏ 4 పేజీల అడ్మిట్ కార్డును రిలీజ్ చేసింది. అందులో డిక్లరేషన్ ఫామ్ కూడా ఉంటుంది. విద్యార్థులు ఆ ఫామ్ పూర్తి చేయాలి. అడ్మిట్ కార్డుతో పాటు డిక్లరేషన్ ఫామ్‌ను ఎగ్జామ్ సెంటర్‌కు తీసుకెళ్లాలి. ఆధార్ కార్డ్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి ప్రభుత్వ ఐడీ ప్రూఫ్ తీసుకెళ్లాలి. ట్రాన్స్‌పరెంట్ బాల్ పాయింట్ పెన్ తీసుకెళ్లాలి. గతంలో పరీక్ష కేంద్రంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెన్నులు ఇచ్చేది. కానీ ఈసారి విద్యార్థులే తమ సొంత పెన్నులు తీసుకెళ్లాలి. అటెండెన్స్ షీట్‌పైన అతికించేందుకు అదనంగా ఓ ఫోటోగ్రాఫ్ తీసుకెళ్లాలి. అటెండెన్స్ షీట్ ఇచ్చేముందు ఇన్విజిలేటర్ విద్యార్థులకు శానిటైజర్ ఇశ్తారు. ఆ తర్వాత అటెండెన్స్ షీట్ పైన ఫోటో పేస్ట్ చేయాలి. గతంలో అప్‌లోడ్ చేసిన ఫోటోనే విద్యార్థులు తీసుకెళ్లాలి. ఒకవేళ వేరే ఫోటో తీసుకెళ్తే పోలికలు గుర్తించేలా ఉండాలి. విద్యార్థులు 50 మిల్లీ లీటర్ల పర్సనల్ హ్యాండ్ శానిటైజర్ తీసుకెళ్లాలి. పరీక్ష కేంద్రం లోపలికి ఈ బాటిల్ తీసుకెళ్లొచ్చు. దీంతో పాటు పరీక్షా కేంద్రంలో వేర్వేరు పాయింట్స్‌లో శానిటైజర్ అందుబాటులో ఉంటుంది. ట్రాన్స్‌పరెంట్ వాటర్ బాటిల్ తీసుకెళ్లొచ్చు. బాటిల్ పైన ఎలాంటి స్టిక్కర్స్ ఉండకూడదు.

UPSC Jobs: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి యూపీఎస్‌సీ నోటిఫికేషన్

Govt Scheme: జాబ్ పోయిందా? అయినా సగం జీతం తీసుకోవచ్చు... అప్లై చేయండిలా

JEE Main 2020: పరీక్షకు అనుమతించనివి ఇవే...


పరీక్షా కేంద్రం లోపలికి మొబైల్ ఫోన్లు అనుమతించరు. ఆరోగ్య సేతు యాప్ తప్పనిసరే అయినా ఎగ్జామ్ సెంటర్ బయటే ఫోన్లు వదిలేయాలి. పరీక్షా కేంద్రంలో రఫ్ షీట్లు అందుబాటులో ఉంటాయి. కాబట్టి విద్యార్థులు తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. క్యాలిక్యులేటర్, స్మార్ట్‌వాచ్‌, బ్లూటూత్ డివైజ్‌, ఇతర ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లు అనుమతించరు. వాతావరణానికి తగ్గట్టుగా వస్త్రధారణ ఉండాలి. లైట్ కలర్ దుస్తులు వేసుకోవడం మంచిది. సాండల్స్, స్లిప్పర్స్ వేసుకోవాలి. పరీక్ష కేంద్రంలో తప్పనిసరిగా సోషల్ డిస్టెన్స్ పాటించాలి. అలాట్ చేసిన టైమ్ లోగా రిపోర్ట్ చేయాలి. నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించరు.
Published by: Santhosh Kumar S
First published: August 31, 2020, 5:08 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading