Home /News /jobs /

JEE MAIN 100 PERCENTILE SCORER SARTHAK MAHESHWARI SAYS COULD NOT STUDY FOR LONG HOURS UMG GH

JEE Main: జేఈఈలో ఒకేఒక్కడు.. సార్థక్ మహేశ్వరి..! మెయిన్స్‌లో ఇతని ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉందంటే..?

జేఈఈ మెయిన్స్ టాపర్ సార్థక్ మహేశ్వరి

జేఈఈ మెయిన్స్ టాపర్ సార్థక్ మహేశ్వరి

ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్ -2022 సెషన్ 1లో గుర్‌గ్రామ్‌కు చెందిన సార్థక్ మహేశ్వరి 100 పర్సంటైల్ స్కోర్ సాధించి ఇతరుల కంటే ఉత్తమ ప్రతిభ కనబర్చాడు. IISc కోసం KVYPY నిర్వహించిన అర్హత పరీక్షలో కూడా మంచి స్కోర్ సాధించాడు.

జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షల్లో మంచి స్కోర్ సాధించడానికి చాలా మంది అభ్యర్థులు ఎంతో శ్రమిస్తుంటారు. అనుకున్న లక్ష్యాన్ని సాధించడం కోసం ప్రణాళికతో ప్రిపేర్ అవుతుంటారు. ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్ -2022 సెషన్ 1లో గుర్‌గ్రామ్‌కు చెందిన సార్థక్ మహేశ్వరి 100 పర్సంటైల్ స్కోర్ సాధించి ఇతరుల కంటే ఉత్తమ ప్రతిభ కనబర్చాడు. IISc కోసం KVYPY నిర్వహించిన అర్హత పరీక్షలో కూడా మంచి స్కోర్ సాధించాడు. అలాగే ఆర్‌ఎం‌ఓకు అర్హత సాధించాడు. అంతేకాకుండా ఎన్‌‌టీఎస్‌ఈ స్కాలర్ షిప్ కూడా పొందాడు. ప్రస్తుతం అతను జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నాడు. అతడి ప్రిపరేషన్ స్ట్రాటజీ గురించి తెలుసుకుందాం.

చాలా మంది టాపర్‌ల మాదిరిగా సార్థక్ రోజుకు10-12 గంటలు ప్రిపేర్ అయ్యేవాడు కాదు. ప్రతి గంట లేదా గంటన్నర నిరంతర స్టడీ తర్వాత విరామం తీసుకున్నట్లు అతడు చెప్పాడు. ‘నేను ప్రతి గంట లేదా గంటన్నర తర్వాత విరామం తీసుకున్నాను. దాదాపు 10-15 నిమిషాల పాటు వాకింగ్ చేశాను. ఎప్పుడూ సొల్యూషన్స్ వదల్లేదు. కొన్నిసార్లు ఒక్కదాన్ని సాల్వ్ చేయడానికి 2-3 గంటలు పట్టింది. కానీ అలాగే కొనసాగించడం వల్ల విజయం సాధించగలిగాను. ఇది నాకు కాన్సెప్ట్‌లను క్లియర్ చేయడంలో సహాయపడింది.’ అని సార్థక్ చెప్పుకొచ్చాడు.

 ఇదీ చదవండి: పొరిగింటోళ్లకి రూ.19 లక్షల గిఫ్ట్ ఇచ్చిన మహిళ.. ఎందుకో తెలుసా..? ఈ స్టోరీ కచ్చితంగా చదవాల్సిందే


సార్థక్ 9వ తరగతి నుండి జేఈఈ కోసం సిద్ధమవుతున్నాడు. ఇందుకోసం గురుగ్రామ్‌లోని FIITJEE కోచింగ్ సెంటర్‌లో చేరాడు. 11వ తరగతి నుండి జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు సిద్ధమవుతున్నాడు. జేఈఈ మెయిన్‌లో టాప్ 2.5 లక్షల లోపు ర్యాంకు సాధించిన వారు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు హాజరుకావడానికి అర్హులు. జేఈఈ అడ్వాన్స్‌డ్ అనేది ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే అర్హత పరీక్ష.

సార్థక్ ఇంజినీరింగ్‌ ఎంట్రన్స్‌ కోసం గత నాలుగేళ్లుగా ప్రిపేర్‌ అవుతుండగా, రెండు నెలల అదనపు సమయం తనకు బాగా ఉపయోగపడిందని అతను పేర్కొన్నాడు. “జేఈఈ మొదట ఏప్రిల్‌లో నిర్వహిస్తున్నట్లు షెడ్యూల్ విడుదలైంది. అయితే జూన్‌కు వాయిదా పడడంతో రివిజన్ కోసం నాకు అదనంగా రెండు నెలల సమయం దొరికింది. పరీక్షకు ముందు దాదాపు 35-40 మాక్ టెస్ట్‌లు ప్రాక్టీస్ చేశాను. ఇలా చేయడం వల్ల స్పీడ్ పెరగడానికి సహాయపడింది. పరీక్ష సమయంలో కెమిస్ట్రీని 25 నిమిషాల్లో పూర్తి చేశాను. గణితం, ఫిజిక్స్‌లో సుదీర్ఘమైన లెక్కలు ఉన్నందున ఎక్కువ సమయం తీసుకున్నాను.’’ అని సార్థక్ తెలిపాడు.



కెమిస్ట్రీ కోసం హిమాన్షు పాండే, గణితం, ఫిజిక్స్ కోసం Cengage పుస్తకాలను ప్రిపేర్ అయినట్లు తెలిపాడు. సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ తల్లిదండ్రుల కొడుకైన సార్థక్, ఐఐటీ బాంబేలో కంప్యూటర్ సైన్స్ చదవాలనే కోరిక ఉంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విజయం సాధిస్తే, ఐఐటీలో ప్రవేశం పొందడంలో ఆ కుటుంబం నుంచి సార్థక్ మొదటి వ్యక్తి అవుతాడు. ఐఐటీలో సీటు సంపాదించడం తన కల మాత్రమే కాదని, తన తల్లి కుటుంబానిది కూడా అని సార్థక్ వివరించాడు.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, Jee, Jee mains 2022, JOBS

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు