హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Scam: పరీక్షా కేంద్రాలు స‌హ‌క‌రించాయి.. జేఈఈ స్కామ్‌లో వెలుగు చూస్తున్న నిజాలు

JEE Scam: పరీక్షా కేంద్రాలు స‌హ‌క‌రించాయి.. జేఈఈ స్కామ్‌లో వెలుగు చూస్తున్న నిజాలు

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

జేఈఈ మెయిన్(JEE Main) ప‌రీక్ష స్కామ్ ద‌ర్యాప్తులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (Central Bureau of Investigation) వేగ‌వంతం చేసింది. ప‌రీక్షా కేంద్రంలో ఒక్క కంప్యూట‌ర్ మాత్ర‌మే కాద‌ని మొత్తం ప‌రీక్షా కేంద్ర‌మే ఈ స్కామ్‌కు స‌హ‌క‌రించిన‌ట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. ఇప్ప‌టికే ఈ కేసులో ఏడుగురు నిందితులను సీబీఐ అధికారులు అరెస్టు(Arrest) చేశారు.

ఇంకా చదవండి ...

  జేఈఈ మెయిన్ ప‌రీక్ష స్కామ్ ద‌ర్యాప్తులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (Central Bureau of Investigation) వేగ‌వంతం చేసింది. ఈ స్కామ్ కుట్ర‌దార‌లును ప‌ట్టుకొనేందుకు అన్ని వైపుల నుంచి ద‌ర్యాప్తు(Investigation) వేగ‌వంతం చేస్తున్నారు. ప‌రీక్షా కేంద్రంలో ఒక్క కంప్యూట‌ర్ మాత్ర‌మే కాద‌ని మొత్తం ప‌రీక్షా కేంద్ర‌మే ఈ స్కామ్‌కు స‌హ‌క‌రించిన‌ట్టు సీబీఐ అధికారులు గుర్తించారు. ఇప్ప‌టికే ఈ కేసులో ఏడుగురు నిందితులను సీబీఐ అధికారులు అరెస్టు(Arrest) చేశారు.

  అస‌లేం జ‌రిగింది..

  ప‌రీక్ష‌ల నిర్వ‌హ‌ణ కోస‌మే హ‌ర్యాణాలో సోనేపట్ కేంద్రం ఏర్పాటు చేశారు. అక్క‌డి కంప్యూట‌ర్లను వేరే చోట ఉండి నియంత్రించేలా సాంకేతిక‌త‌ను ఏర్పాటు చేశారు. నిందితుల‌ను ఇప్ప‌టికే ప్ర‌శ్నించిన‌ట్టు సీబీఐ తెలిపింది. ఈ స్కామ్‌(Scam)లో ద‌ర్యాప్తులో ప‌లు ఆశ్ఛ‌ర్యక‌ర‌ విష‌యాలు వెలుగులోకి వ‌చ్చాయి. ముందుగా విద్యార్థుల‌తో స్కామ్ సూత్రధారులు మాట్లాడుతారు. విద్యార్థులు ప‌రీక్ష రాసేందుకు సోనేప‌ట్ కేంద్రానికి ఎంపిక చేసుకోవాల‌ని సూచిస్తారు. మ‌హారాష్ట్ర విద్యార్థులు సైతం హ‌ర్యాణాలోని సోనేప‌ట్ కేంద్రానికి ఎంపిక చేసుక‌న్న‌ట్టు గుర్తించారు. జేఈఈ పరీక్ష ద‌ర్యాప్తులో భాగంగా ప‌రీక్షా కేంద్రం నిర్వ‌హ‌ణ సిబ్బందిని ప్ర‌శ్నిస్తున్న‌ట్లు సీబీఐ పేర్కొంది.

  ఈ స్కామ్‌లో ప్ర‌తీ అభ్య‌ర్థి నుంచి రూ.12 ల‌క్ష‌ల నుంచి రూ.15ల‌క్ష‌లు అడిగిన‌ట్టు సీబీఐ అధికారులు గుర్తించారు.

  JEE Advance: విదేశాల్లో జేఈఈ ప‌రీక్షా కేంద్రాలు లేవు.. ఇండియా కొచ్చి రాయాల్సిందే  డ‌బ్బులు ఇచ్చిన అభ్య‌ర్థి ప‌రీక్ష రాసే కంప్యూట‌ర్‌ను రిమోట్ ఆధారంగా నియంత్రించి మంచి మార్కులు వ‌చ్చేలా బేరం మాట్లాడుకుంటారు. ఇలా ఇంజ‌నీరింగ్(Engineering) ప్ర‌వేశ ప‌రీక్ష జేఈఈలో అవ‌క‌త‌వ‌క‌లకు పాల్ప‌డుతున్న వారిని వ‌దిలిపెట్ట‌బోమ‌ని సీబీఐ స్ప‌ష్టం చేసింది.

  ఈ స్కామ్‌లో ప‌రీక్షా కేంద్రాలు కుట్ర‌దారుల‌తో రాజీ ప‌డే అవ‌కాశం ఉంద‌ని. లేదా ప‌రీక్షా కేంద్రంలోని ఎల‌క్ట్రిక్(Electric) గాడ్జెట్‌లు హ్యాక్ అయ్యే అవ‌కాశం కూడా ఉంద‌ని సీబీఐ అభిప్రాయ ప‌డింది. ఈ ప్ర‌శ్న ప‌త్రాన్ని ప‌రిష్క‌రించ‌డానికి జంషెడ్‌పూర్‌కి చెందిన వ్య‌క్తిని ఎంచుకొన్నార‌ని గుర్తించారు. అంతే కాకుండా ఈ కేసుకు సంబంధించి బెంగుళూర్‌కు చెందిన ఇండోర్ అఫినిటీ ఎడ్యుకేషన్(Education) సెంటర్లకు సంబంధం ఉంద‌ని సీబీఐ దాడులు నిర్వ‌హించారు.

  ఇంతే కాకుండా ఈ కేసులోని హావాల చెల్లింపుల‌పై సీబీఐ దృష్టి సారించారు. అంతే కాకుండా అఫినిటీ ఎడ్యుకేషన్‌(Education)కు చెందిన ఓ డైరెక్ట‌ర్ క‌నిపిండం లేదు. అత‌న్ని ప‌ట్టుకొనేందుకు పోలీసులు గాలింపు చేస్తున్నారు. ఈ కేసులో సిద్ధార్థ్ కృష్ణ, విశ్వంభర్ మణి త్రిపాఠి, గోవింద్ వర్ష్నీ వ్య‌క్తులను విచారిస్తున్నారు.

  దీనిపై సెప్టెంబ‌ర్ 1న కేసు న‌మోదు చేసిన‌ట్టు సీబీఐ(CBI) తెలిపింది. ఇప్ప‌టికే దేశ‌వ్యాప్తంగా 20 చోట్ల దాడులు నిర్వ‌హించారు. ఒక ప్రైవేట్ కంపెనీ మరియు దాని డైరెక్టర్లు, ముగ్గురు ఉద్యోగులు మరియు ప్రైవేట్ వ్యక్తులతో సహా ఇతరులపై కేసు నమోదు చేసిన‌ట్టు సీబీఐ తెలిపింది.

  ఈ ద‌ర్యాప్తులో 25 ల్యాప్‌టాప్‌లు(Laptops), ఏడు కంప్యూట‌ర్‌లు, 30 పోస్టు డేటేట్ చెక్కుల‌ను స్వాధీనం చేసుకొన్న‌ట్టు సీబీఐ అధికారులు తెలిపారు. ఈ కేసుపై సీబీఐ అధికారులు ద‌ర్యాప్తు వేగ‌వంతం చేస్తున్నారు.

  Published by:Sharath Chandra
  First published:

  Tags: JEE Main 2021

  ఉత్తమ కథలు