ప్రతిష్టాత్మక NIT, IITలతోపాటు దేశంలోని అగ్రశ్రేణి ఇంజనీరింగ్(Engineering) కళాశాలల్లో ప్రవేశమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష (JEE)ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) నిర్వహిస్తుంది. ఏటా దాదాపు 10 లక్షల మంది విద్యార్థులు(Students) ఈ పరీక్షకు హాజరు అవుతారు. అయితే అందరికీ తాము కొరుకున్న కాలేజీల్లో అడ్మిషన్(Admission) దొరకదు. ఒకవేళ దొరికినా నచ్చిన కోర్సులో చేరే అవకాశం కూడా ఉండకపోవచ్చు. అందుకు ప్రధాన కారణం పోటీ ఎక్కువగా ఉండడం.. సీట్ల సంఖ్య పరిమితంగా ఉండడమే. ఇలాంటి వారి కోసం దేశ వ్యాప్తంగా అనేక ఇంజనీరింగ్ కాలేజీలు(Engineering Colleges) నచ్చిన కోర్సుల్లో జాయిన్ (Join) అయ్యే అవకాశం కల్పిస్తున్నాయి. ఇందు కోసం ప్రత్యేక అర్హత పరీక్ష రాయాల్సి ఉంటుంది. జేఈఈ మినహా ఇంజనీరింగ్ కోసం ప్రవేశ పరీక్షలకు సంబంధించిన జాబితాను పరిశీలించండి.
* బిట్‌శాట్ -2022
బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ (BITS)కు సంబంధించిన పిలాని, గోవా, హైదరాబాద్ క్యాంపస్‌లు అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశం కోసం ప్రత్యేక ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్నాయి. కంప్యూటర్ మోడ్‌లో జరిగే ఈ బిట్‌శాట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, మ్యాథమెటిక్స్, బయాలజీ సబ్జెక్టుల నుండి ప్రశ్నలను అడగనున్నారు. జూన్ 10వ తేదీలో దరఖాస్తు చేసుకోవడానికి బిట్స్ అవకాశం కల్పించింది.
* వీఐటీఈఈ (VITEE)
వెల్లూరు ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ... ఇంజనీరింగ్ కోర్సులలో ప్రవేశానికి ఆన్‌లైన్ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తుంది. VITEE -2022 కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మే 30గా నిర్ణయించారు. పరీక్ష జూన్ 30 నుంచి జూలై 6 మధ్య నిర్వహించే అవకాశం ఉంది. వేలూరు, చెన్నై, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ సంస్థకు క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిలోనే ప్రవేశాలు కల్పించనున్నారు.
* టీఎస్ ఎంసెట్
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ.. టీఎస్ ఎంసెట్‌ను నిర్వహిస్తుంది. ఇప్పటికే తెలంగాణ స్టేట్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (TS EAMCET) కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియను ప్రారంభించింది. తెలంగాణలోని ఉన్నత విద్యా సంస్థల్లో వివిధ వృత్తిపరమైన కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే వారు తప్పనిసరిగా TS EAMCETకి హాజరుకావాలి. మే 28లోపు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించారు.
* ఏపీ ఎంసెట్
ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ సంస్థ ఏపీ ఎంసెట్-2022 కోసం దరఖాస్తు ఫారమ్‌ను విడుదల చేసింది. మే 10వ తేదీలోపు సంస్థ అధికారిక వెబ్ సైట్ cets.apsche.ap.gov.in/EAPCET ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
* మెట్(MET)
మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MAHE) సంస్థ మణిపాల్ ఎంట్రెన్స్ టెస్ట్ (MET)- 2022 కోసం దరఖాస్తు ఫారమ్‌ను ఇప్పటికే మూసివేసింది. అయితే ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోని వారి కోసం మరో అవకాశం కల్పించింది. అధికారిక వెబ్ సైట్ admissions.manipal.edu ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
కన్సార్టియం ఆఫ్ మెడికల్, ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజెస్ ఆఫ్ కర్ణాటక(COMEDK)
అన్ ఎయిడెడ్ ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల అసోసియేషన్ (KUPECA)లో భాగమైన సంస్థలు అందించే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశానికి అభ్యర్థులు అండర్ గ్రాడ్యుయేట్ ఎంట్రన్స్ టెస్ట్ (UGET)ను తప్పనిసరిగా రాయాలి. దీన్ని కర్ణాటకలోని మెడికల్, ఇంజనీరింగ్ అండ్ డెంటల్ కాలేజీల కన్సార్టియం(COMEDK) నిర్వహిస్తుంది. పరీక్షలో భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, గణితం నుంచి మొత్తం 180 ప్రశ్నలు అడగనున్నారు. ఈ పరీక్ష కోసం విద్యార్థులు మే 2లోపు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Emcet, Jee main 2022, Students