JEE Result 2019: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి

JEE Result 2019 | ఫలితాలు కేటగిరీని అనుసరించి నెట్‌లో ఉంచనున్నారు అధికారులు. ర్యాంకులను విద్యార్థులు బర్త్ డేట్, రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితాలు వెల్లడైన వెంటనే ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్రప్రభుత్వ ఆర్థిక సహాకారం పొందే సంస్థల్లో ప్రవేశాలకు జూన్ 16 నుంచి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ 19 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం ఉండగా.. జూన్ 16 నుంచే చాయిస్ ఫిల్లింగ్ ప్రారంభిస్తామని తెలిపారు.

news18-telugu
Updated: June 14, 2019, 11:14 AM IST
JEE Result 2019: జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు విడుదల.. ఇలా చెక్ చేసుకోండి
జేఈఈ ఎగ్జామ్ అడ్వాన్స్‌డ్ రిజల్ట్స్ రిలీజ్
  • Share this:
దేశంలోని 23 ఐఐటీలు సహా ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు, ర్యాంకులు విడుదలయ్యాయి. ఐఐటీ రూర్కీ రిజల్ట్స్‌ని విడుదల చేసింది. పరీక్షకు దేశవ్యాప్తంగా 1.75 లక్షల మంది అప్లై చేసుకోగా.. 95 శాతానికి పైగా మంది హాజరయ్యారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం 31,873 మంది జేేఈఈ అడ్వాన్స్‌డ్‌కి అర్హత సాధించారు.  ఏపీకి చెందిన 13,267 మంది, తెలంగాణకు చెందిన 16,866 మంది అర్హత సాధించారు.

ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐట, జీఎఫ్‌టీలలో ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహించేందుకు జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఫలితాలు కేటగిరీని అనుసరించి నెట్‌లో ఉంచనున్నారు అధికారులు. ర్యాంకులను విద్యార్థులు బర్త్ డేట్, రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా తెలుసుకోవచ్చు. ఫలితాలు వెల్లడైన వెంటనే ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్ ఐటీ, కేంద్రప్రభుత్వ ఆర్థిక సహాకారం పొందే సంస్థల్లో ప్రవేశాలకు జూన్ 16 నుంచి ఉమ్మడి ప్రవేశాల కౌన్సెలింగ్ జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారం జూన్ 19 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభం ఉండగా.. జూన్ 16 నుంచే చాయిస్ ఫిల్లింగ్ ప్రారంభిస్తామని తెలిపారు.

27వ తేదీన మొదటి సీట్ల కేటాయింపును ప్రకటిస్తామని ప్రకటిస్తాని ఎన్‌ఐటీ, ఐఐటీలకు జోసా తెలియజేసింది. వచ్చే నెలలో కౌన్సెలింగ్‌ను నిర్వహించి ప్రవేశాలు పూర్తి చేసేలా అధికార్యలు చర్యలు చేపట్టారు.

JEE Result 2019 ఇలా చెక్ చేసుకోండి..


1. అధికారిక వెబ్‌సైట్ jeeadv.ac.in లేదా https://cportal.jeeadv.ac.in ఓపెన్ చేయాలి.
2. Download JEE Result 2019 కోసం సెర్చ్ చేయాలి.
3. ఫలితాలకు సంబంధించిన లింక్‌పై క్లిక్ చేసి కావాల్సిన వివరాలు ఎంటర్ చేయాలి.
First published: June 14, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>