జేఈఈ (Joint Entrance Examination) అడ్వాన్స్డ్-2022 ఫలితాలను ఐఐటీ బాంబే విడుదల చేసింది. విద్యార్థుల యొక్క హాల్ టికెట్స్, పుట్టిన తేదీని ఎంటర్ చేసి.. ఈ వెబ్సైట్ jeeadv.ac.inలో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. IIT JEE అడ్వాన్స్డ్ పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన టాప్ 10 అభ్యర్థుల పేర్లను కూడా ప్రకటించారు. IIT బాంబే జోన్‌కు చెందిన RK శిశిర్ JEE (అడ్వాన్స్డ్) 2022లో కామన్ ర్యాంక్ లిస్ట్ (CRL)లో టాప్ ర్యాంకర్ గా నిలిచాడు. అతను 360 మార్కులకు 314 మార్కులు సాధించాడు. మహిళా అభ్యర్థులలో.. IIT ఢిల్లీ జోన్‌కు చెందిన తనిష్క కబ్రా CRL 16తో టాప్ ర్యాంక్ మహిళగా నిలిచింది. ఆమె 360 మార్కులకు 277 మార్కులు సాధించింది. మొత్తం 1,60,038 మంది అభ్యర్థులు నమోదు చేసుకుకోగా.. 1,55,538 మంది రెండు పేపర్లకు హాజరయ్యారు. వారిలో 40,712 మంది అభ్యర్థులు అర్హత సాధించారు .
మొత్తం 26.17 శాతం ఉత్తీర్ణత సాధించారు. గత సంవత్సరాలతో పోల్చితే ఈ సంవత్సరం ఉత్తీర్ణత శాతం స్వల్పంగా తగ్గింది. 2021లో ఇంజనీరింగ్ ప్రవేశంలో ఉత్తీర్ణత శాతం 30 శాతం కాగా, 2020లో 28.64 శాతం.
ఇలా చెక్ చేసుకోండి..
-JEE అధికారిక వెబ్సైట్ - jeeadv.ac.in 2022ని సందర్శించండి.
-హోమ్‌పేజీలో, JEE అడ్వాన్స్డ్ రిజల్ట్ లింక్‌పై క్లిక్ చేయండి
-రిజిస్ట్రేషన్ నంబర్, పుట్టిన తేదీ అండ్ మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, సబ్ మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
-JEE అడ్వాన్స్డ్ స్కోర్‌కార్డ్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
-ప్రివ్యూ/డౌన్లోడ్ చేయండి. దానిని భవిష్యత్ సూచన కోసం ప్రింట్అవుట్ తీసుకోండి.
కామన్ ర్యాంక్ లిస్ట్‌లో JEE అడ్వాన్స్డ్ 2022 టాపర్స్
1. ఆర్కే శిశిర్
2. పోలు లక్ష్మి సాయి లోహిత్ రెడ్డి
3. థామస్ బిజు చీరంవేలిల్
4. వంగపల్లి సాయి సిద్ధార్థ
5. మయాంక్ మోత్వాని
6. పోలిశెట్టి కార్తికేయ
7. ప్రతీక్ సాహూ
8. ధీరజ్ కురుకుంద
9. మహిత్ గాధివాలా
10. వెచ్చ జ్ఞాన మహేష్
ఇదిలా ఉండగా.. పరీక్ష ఆగస్టు 28న రెండు షిఫ్టులలో నిర్వహించారు. మొదటి షిఫ్ట్ ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల మధ్య షెడ్యూల్ చేయబడింది. రెండో షిఫ్ట్ మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5:30 గంటలకు ముగిసింది. సెప్టెంబర్ 03న ప్రొవిజనల్ ఆన్సర్ కీలను విడుదల చేయగా అభ్యర్థులు అభ్యంతరాలు తెలిపేందుకు సెప్టెంబర్ 04 సాయంత్రం 5 గంటల వరకు సమయం ఇచ్చారు. జేఈఈ అడ్వాన్స్డ్ 2022 కట్-ఆఫ్‌ను క్రాస్ చేసిన విద్యార్థులు ఆర్కిటెక్చర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (AAT) 2022 కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సెప్టెంబర్ 11 ఉదయం 10 గంటల నుండి సెప్టెంబర్ 12 సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. AAT 2022 పరీక్ష సెప్టెంబర్ 14న జరుగుతుంది.
IT రూర్కీ జోన్ నుండి IIT JEE Adv CRL జాబితా టాపర్స్
CRL 19: మృణాల్ గార్గ్
CRL 29: సౌమిత్ర గార్గ్
CRL 38: గౌరీష్ గార్గ్
CRL 42: చిన్మయ్ ఖోకర్
CRL 48: హర్ష్ జఖర్
IIT మద్రాస్ జోన్ నుండి JEE అడ్వాన్స్డ్ 2022 ఫలితాలు టాపర్లు
పోలు లక్ష్మి సాయి లోహిత్ రెడ్డి: CRL 2
థామస్ బిజు చీరంవేలిల్: CRL 3
వంగపల్లి సాయి సిద్ధార్థ: CRL 4
పోలిశెట్టి కార్తికేయ: CRL 6
ధీరజ్ కురుకుంద: CRL 8
జేఈఈ అడ్వాన్స్డ్-2022లో ర్యాంకులు సాధించిన విద్యార్ధులకు రేపటి నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ కౌన్సెలింగ్ ద్వారా ఐఐటీ, ఎన్ఐటీ, ట్రిపుల్ఐటీ, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే సాంకేతిక విద్యాసంస్థల్లో సీట్లు కల్పిస్తారు. మొత్తం దేశంలో ఉన్న 23 ఐఐటీల్లో 16,593 సీట్లకు కౌన్సిలింగ్ జరగనుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Jee advanced, Jee main 2022, JOBS