ఐఐటీ ప్రవేశ పరీక్ష జేఈఈ అడ్వాన్స్ 2021 రాసిన విద్యార్థులకు నేడు రెస్పాన్స్ షీట్లు వచ్చే అవకాశం ఉంది. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఖరగ్‌పూర్ - పరీక్ష నిర్వహణ సంస్థ - అక్టోబర్ 10 న జవాబు కీని విడుదల చేస్తుంది. రెస్పాన్స్ షీట్ డౌన్లోడ్ చేసుకొని కీ విడుదల అయిన తరువాత వాటి ఫలితాను సరి చూసుకొని స్కోర్ అంచనా వేసుకోవచ్చు. గత సంవత్సరంతో పోలిస్తే పేపర్-1లో 57 ప్రశ్నలు అడిగారు. గత సంవత్సరం 54 ప్రశ్నలు అడిగారు. మొత్తం మార్కులు కూడా మారాయి గతేడాది 198 మార్కులు వస్తే ఈ ఏడాది 180 మార్కులు వచ్చాయి. అక్టోబర్ 3, 2021న రెండు షిఫ్ట్‌లు జరిగాయి. ఈ ఏడాది సుమారు 1.6 లక్షలకు పైగా విద్యార్థులు పరీక్ష కోసం నమోదు చేసుకున్నారు.
ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి..
Step 1 : ముందుగా అధికారిక వెబ్సైట్ jeeadv.ac.in లోకి వెళ్లాలి.
Step 2 : లింక్ యాక్టీవ్ కాగానే రెస్పాన్స్ షీట్ కోసం క్లిక్చేయాలి.
Step 3 : మీ రిజిస్ట్రేషన్నంబర్ లేదా హాల్ టికెట్నంబర్ అందించి డౌన్లోడ్ చేసుకోవాలి.
IIT Madras : ఐఐటీ మద్రాస్‌లో 8 నెలల డేటాసైన్స్ డిప్లమా ప్రోగ్రాం.. ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చు
స్కోర్ ఎలా అంచనా వేయాలి..
Step 1 : రెస్పాన్ షీట్ డౌన్లోడ్ చేసుకొన్న తరువాత జవాబు కీతో పోల్చుకోవాలి.
Step 2 : సరైన సమాదానికి మార్కు వేసుకోవాలి.
Step 3 : తప్పు సమాదానికి నెగెటీవ్ మార్క్ వేసుకోవాలి.
Step 4 : సరైన సమాధానాలతో, సరైన సమాధానాలకు తప్పు మార్కులకు నాలుగు మార్కులు మరియు రెండు మైనస్‌లు లభిస్తాయి.
Step 5 : వాటిని మొత్తం కూడి తీసివేస్తే మీ మొత్తం స్కోర్ వస్తుంది.
గత సంవత్సరం, JEE అడ్వాన్స్డ్ ఫలితం అక్టోబర్ 5, 2020న ప్రకటించారు. అయితే, ఈ సంవత్సరం తుది జవాబు కీ అక్టోబర్ 15 న విడుదల చేయనున్నారు. ప్రిలిమినరీ ఆన్సర్ కీ ఆధారంగా అభ్యర్థులు లేవనెత్తిన అభ్యంతరాలు తుది కీని నిర్ణయిస్తారు. అక్టోబర్ 22 న ఫలితాన్ని విడుదల చేయడానికి షెడ్యూల్ చేయబడింది.
ఈ ఏడాది పరీక్షపై విద్యార్థులు భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ప్రవేశ పరీక్షలో గణితం చాలా కఠినంగా ఉందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తరువాత రసాయశాస్త్రం (Chemistry), భౌతికశాస్త్రం సులభంగా ఉన్నాయని విద్యార్థులు పేర్కొన్నారు. భౌతికశాస్త్రం, రసాయశాస్త్రంలో సెలబస్ (Syllabus) నుంచి అన్ని అంశాలు వచ్చాయి. అయితే.. అయితే, కాలిక్యులస్ (calculus) నుంచి చాలా తక్కువ ప్రశ్నలు ఉన్నాయని విద్యార్థులు తెలిపారు. కెమిస్ట్రీలో అంచనా ప్రకారం సమతుల్యంగా ప్రశ్నలు అడిగారు. ముఖ్యంగా 11, 12 తరగతుల నుంచి సమానంగా ప్రశ్నలు వచ్చాయి. ప్రతీ ఏటా భౌతికశాస్త్రంలో, ప్రశ్నలు ఎక్కువగా క్లాస్ 11 అధ్యాయాల నుంచి అడిగేవారు. ఈ సారి కరెంట్ విద్యుత్, ఆప్టిక్స్, రొటేషన్ మరియు ఆధునిక ఫిజిక్స్ నుంఇచ కొన్ని కఠినమైన ప్రశ్నలు అడిగారు. మొత్తంమీద, ఈ రెండు ఇతర సబ్జెక్టులతో పోలిస్తే ఈ విభాగం సులభం అని విద్యార్థులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: EDUCATION, Exams, IIT, JEE Main 2021, Students