హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Advanced 2021: నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

JEE Advanced 2021: నేటి నుంచి జేఈఈ అడ్వాన్స్​డ్​ రిజిస్ట్రేషన్లు ప్రారంభం.. ఇలా దరఖాస్తు చేసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్​ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ (ఐఐటీ) సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్- 2021 రిజిస్ట్రేషన్ విండో నేడు ప్రారంభం కానుంది. ఈ సారి జేఈఈ అడ్వాన్స్​డ్​ను ఐఐటీ- ఖరగ్‌పూర్ నిర్వహిస్తోంది. జేఈఈ అడ్వాన్స్​డ్​ అధికారిక వెబ్​సైట్ www.jeeadv.nic.in లో ఇవాళ మధ్యాహ్నం నుంచి రిజిస్ట్రేషన్ కమ్ అప్లికేషన్ ఫారం లింక్ యాక్టివేట్ అవుతుంది.

ఇంకా చదవండి ...

దేశంలోని ప్రతిష్టాత్మక ఇండియన్​ ఇన్​స్టిట్యూట్ ఆఫ్​ టెక్నాలజీ (ఐఐటీ) సంస్థల్లో ప్రవేశాలకు నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్‌డ్- 2021 రిజిస్ట్రేషన్ విండో నేడు ప్రారంభం కానుంది. ఈ సారి జేఈఈ అడ్వాన్స్​డ్​ను ఐఐటీ- ఖరగ్‌పూర్ నిర్వహిస్తోంది. జేఈఈ అడ్వాన్స్​డ్​ అధికారిక వెబ్​సైట్ www.jeeadv.nic.in లో ఇవాళ మధ్యాహ్నం నుంచి రిజిస్ట్రేషన్ కమ్ అప్లికేషన్ ఫారం లింక్ యాక్టివేట్ అవుతుంది. ఈ రిజిస్ట్రేషన్​ విండోను తొలుత సెప్టెంబర్ 11న యాక్టివేట్​ చేయాలని ఎన్​టీఏ భావించింది. అయితే జేఈఈ మెయిన్ ఫలితాలు ఆలస్యమవ్వడంతో దీన్ని కూడా వాయిదా వేసింది. ఈ రోజు జేఈఈ మెయిన్స్​ ఫలితాలు విడుదలవుతుండటంతో, అందులో క్వాలిఫై అయిన అభ్యర్థులు అడ్వాన్స్​కు రిజిస్ట్రేషన్​ చేసుకోవాల్సి ఉంటుంది.

Job Vacancies: అమెజాన్ నుంచి డీఆర్‌డీఓ వరకు.. ఈ వారంలో దరఖాస్తు చేసుకోవాల్సిన ఉద్యోగాలు ఇవే


జేఈఈ మెయిన్ రిజల్ట్ విడుదల..

జేఈఈ మెయిన్‌ రాసిన వారిలో 2.5 లక్షల మంది విద్యార్థులను మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్​కి అనుమతిస్తారు. క్వాలిఫై అయిన అభ్యర్థులంతా సెప్టెంబర్ 19లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 20లోపు వారు ఫీజు చెల్లించాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను అక్టోబర్ 3న నిర్వహించనున్నారు. 1996 అక్టోబర్ 1 తర్వాత జన్మించిన అభ్యర్థులకు మాత్రమే జేఈఈ అడ్వాన్స్​డ్​ పరీక్ష రాసేందుకు అనుమతి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల విషయంలో 1991 అక్టోబర్ 1 తర్వాత జన్మించిన వారు సైతం దరఖాస్తు చేసుకోవచ్చు.

Government Schools: ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు శుభవార్త .. వాటిలో శిక్షణ ఇవ్వనున్న ప్రభుత్వం..


ఎలా రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి?

Step 1: మొదట జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అధికారిక వెబ్​సైట్ www.jeeadv.nic.in ను సందర్శించాలి.

Step 2: హోమ్‌పేజీలో ఇచ్చిన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 అప్లికేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

Step 3: తరువాత కనిపించే న్యూ రిజిస్ట్రేషన్​ను ఎంచుకోండి. అవసరమైన అన్ని వివరాలను పూరించి రిజిస్ట్రేషన్​ పూర్తి చేసి, మీ లాగిన్ డీటెయిల్స్ సేవ్ చేసుకోండి. అనంతరం రీ లాగిన్​ అవ్వండి.

Step 4: ఇప్పుడు ఐడీ ప్రూఫ్, మార్క్ షీట్లు, ఇతర డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేసి, ఫీజు చెల్లించండి. ఆ తరువాత సబ్​మిట్​ చేసిన అప్లికేషన్​ ఫామ్, ఫీజు రిసిప్ట్​లను డౌన్​లోడ్​ చేసుకోండి.

జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్​ ప్యాటర్న్​

జేఈఈ అడ్వాన్స్‌డ్–2021లో మొత్తం రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్​కి మూడు గంటల వ్యవధి ఉంటుంది. అభ్యర్థులంతా ఈ రెండు పేపర్లకు తప్పనిసరిగా హాజరవ్వాల్సి ఉంటుంది. ప్రతి పేపర్​లో ఫిజిక్స్​, కెమిస్ట్రీ, మ్యాథ్స్​ సబ్జెక్ట్​ల నుంచి ప్రశ్నలు వస్తాయి. ఈ కంప్యూటర్ బేస్డ్​ టెస్ట్​ (CBT)లో ప్రశ్నలు ఇంగ్లీష్, హిందీ రెండు భాషల్లోనూ ఉంటాయి.

Published by:Veera Babu
First published:

Tags: JEE Main 2021, JOBS

ఉత్తమ కథలు