ఐఐటీ ప్రవేశ పరీక్ష జేఈఈ అడ్వాన్స్డ్-2022 ఫలితాలు (JEE Advanced-2022 Results) సెప్టెంబర్ 11న వెల్లడి కానున్నాయి. ఈ మేరకు ఫలితాలు అధికారిక వెబ్సైట్ వెబ్సైట్ jeeadv.ac.inలో అందుబాటులో ఉండనున్నాయి. కాగా, జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్‌ను ఆగస్టు 28న ఐఐటీ బాంబే నిర్వహించింది. దాదాపు 1.56 లక్షల మంది అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. వీరంతా ఫలితాల కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం.. ఫలితాలు (Results) రేపు ఉదయం 10 గంటలకు వెల్లడికానున్నాయి.
గత ఐదేళ్ల ఫలితాల విశ్లేషణ..
గత ఐదేళ్ల జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల డేటాను విశ్లేషిస్తే.. కేవలం 30 శాతం మంది అభ్యర్థులు ఐఐటీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు. గత మూడేళ్ల ఫలితాల్లో 2021లో ఉత్తీర్ణత శాతం గణనీయంగా పెరిగింది. దాదాపు 30 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇక 2020లో 28.64 శాతం, 2019- 23.99 శాతం, 2018- 21 శాతం, 2017- 31.99 శాతం మంది అభ్యర్థులు ఐఐటీ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించారు.
ఫలితాల తేదీలు..
జేఈఈ అడ్వాన్స్డ్ 2020, 2021 ఫలితాలు అక్టోబర్‌లో విడుదల కాగా, 2019, 2018, 2017 ఫలితాలు జూన్ నెలలో వెల్లడి అయ్యాయి. 2021లో అక్టోబర్ 15న, 2020లో అక్టోబర్ 5న, 2019లో జూన్ 14న, 2018లో జూన్ 10న, 2017లో జూన్ 11న రిజల్ట్స్ వచ్చాయి. ఈసారి మాత్రం లేట్ అయింది. జేఈఈ అడ్వాన్స్డ్-2022 ఆన్సర్ కీ సెప్టెంబర్ 3న విడుదలైన సంగతి తెలిసిందే. అయితే ఈ ఆన్సర్ కీ పై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన తర్వాత సెప్టెంబర్ 11న ఫలితాలను వెల్లడిస్తామని ఐఐటీ గతంలో తెలిపింది.
జేఈఈ అడ్వాన్స్డ్ జాతీయ స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష. జాయింట్ అడ్మిన్ బోర్డు (JAB) ఆధ్వర్యంలో ఐఐటీ ఖరగ్‌పూర్, ఐఐటీ కాన్పూర్, ఐఐటీ మద్రాస్, ఐఐటీ ఢిల్లీ , ఐఐటీ బాంబే, ఐఐటీ గౌహతి, ఐఐటీ రూర్కీ వంటి ఏడు ఐఐటీలు లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc) బెంగళూరు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను నిర్వహిస్తుంటాయి.
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను క్లియర్ చేసిన వారు ఐఐటీల్లో బీటెక్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్, బ్యాచిలర్-మాస్టర్ డ్యూయల్ డిగ్రీతో సహా అనేక కోర్సుల్లో జాయిన్ కావచ్చు. కొన్ని ఐఐటీల్లో నాలుగేళ్ల బ్యాచిలర్ ప్రోగ్రామ్‌లో చేరిన విద్యార్థులు మైనర్ కోర్సులతో బీటెక్ (ఆనర్స్) లేదా బీటెక్ చేయడానికి అవకాశం ఉంటుంది. డ్యూయల్ డిగ్రీ విద్యార్థులు సైతం మైనర్ కోర్సుల్లో జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది.
స్టెప్-1: ముందు జేఈఈ అడ్వాన్స్డ్-2022 అధికారిక వెబ్సైట్ jeeadv.ac.in ఓపెన్ చేయాలి.
స్టెప్-2: హోమ్ పేజీలో జేఈఈ అడ్వాన్స్డ్-2022 రిజల్ట్స్ లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్-3: జేఈఈ అడ్వాన్స్డ్-2022కు సంబంధించిన వివరాలను ఎంటర్ చేసి, సబ్మిట్ బటన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్-4: ఇప్పుడు అభ్యర్థి ఫలితాలు స్క్రీన్‌పై డిస్ప్లే అవుతాయి. వాటిని డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Jee, Jee main 2022, JOBS