హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Topper: ఎగ్జామ్స్ కోసం రోజుకు పది గంటలు చదవాల్సిన అవసరం లేదు.. జేఈఈ టాపర్ శిశిర్ సక్సెస్ స్టోరీ

JEE Topper: ఎగ్జామ్స్ కోసం రోజుకు పది గంటలు చదవాల్సిన అవసరం లేదు.. జేఈఈ టాపర్ శిశిర్ సక్సెస్ స్టోరీ

జేఈఈ టాపర్ శిశిర్

జేఈఈ టాపర్ శిశిర్

పరీక్షల్లో బెస్ట్ ర్యాంక్ కోసం గంటల తరబడి చదవాల్సిన అవసరం లేదని, స్థిరంగా ఉండి సబ్జెక్ట్స్‌పైన అవగాహన పెంచుకుంటే చాలని చెబుతున్నాడు జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్ శిశిర్.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

JEE Topper Shares His Success Story : పోటీ పరీక్ష(Competetive Exam)లో మంచి ర్యాంకు(Rank) సాధించాలంటే చాలా కష్టమని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రతి రోజు గంటల తరబడి సబ్జెక్ట్స్ ప్రిపేర్ అయితేనే పోటీలో నిలబడి మిగతా అభ్యర్థులను దాటుకుని టాప్ ర్యాంకు(Top Rank) సాధించొచ్చు. అయితే టాప్ ర్యాంక్ కోసం గంటల తరబడి చదవాల్సిన అవసరం లేదని, స్థిరంగా ఉండి సబ్జెక్ట్స్‌పైన అవగాహన పెంచుకుంటే చాలని చెబుతున్నాడు జేఈఈ అడ్వాన్స్‌డ్ ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్ శిశిర్. ఎగ్జామ్‌లో టాప్ ప్లేస్‌లో నిలిచిన ఈ స్టూడెంట్, న్యూస్ 18తో మాట్లాడుతూ తన సక్సెస్ సీక్రెట్‌ను రివీల్ చేశాడు. ఎగ్జామ్‌లో టాపర్‌గా నిలిచేందుకు ఎలా కష్టపడ్డాడో ఆయన మాటల్లో తెలుసుకుందాం.

కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన శిశిర్ ఐఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా ఫస్ట్ ర్యాంక్‌తో సత్తా చాటాడు. ఇంటర్మీడియట్ సీబీఎస్ క్లాస్ 12 బోర్డ్ ఎగ్జామ్స్‌లో 97 శాతం మార్కులు సంపాదించిన శిశిర్.. ఐఐటీ ఎంట్రన్స్ ఎగ్జామ్ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 360 మార్కులకు 314 మార్కులు తెచ్చుకున్నాడు. ఐఐటీ ఎంట్రన్స్‌తో పాటు కేసెట్‌లోనూ మొదటి ర్యాంకు సాధించాడు. కర్ణాటక రాష్ట్ర ఉన్నత విద్యామండలి రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించే కేసెట్ (KCET) ఫార్మా కేటగిరీలో శిశిర్ మొదటి ర్యాంకు సాధించాడు. 180 మార్కులకు 178 మార్కులు సాధించి సెట్‌లో 100 శాతం ఉత్తీర్ణత సాధించాడు.

హాస్పిటల్ లో పేషెంట్ కి ఎమర్జెన్సీ..ట్రాఫిక్ జామ్ లో డాక్టర్..అతడి పనికి దేశం సెల్యూట్

బెంగళూరు‌లోని విద్యారణ్యపుర నారాయణ ఇ-టెక్నో స్కూల్ విద్యార్థి అయిన శిశిర్.. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్‌లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకు సాధించడం పట్ల స్కూల్ యాజమాన్యం సంతోషం వ్యక్తం చేస్తోంది. తమ పాఠశాలకు చెందిన విద్యార్థి భవిష్యత్తులో ఉన్నత స్థానానికి వెళ్తాడని ఆశాభావం వ్యక్తం చేసింది. తాను గంటల తరబడి పరీక్ష కోసం ప్రిపేర్ కాలేదని శిశిర్ పేర్కొన్నాడు. ఈసారి మొత్తం 1,55,538 మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్‌కు అటెండ్ అయ్యారు. అందులో 40,712 మంది అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు.

ప్రిపరేషన్ స్ట్రాటజీ

ఎగ్జామ్‌కు ప్రిపేర్ అయ్యే సమయంలో పది, పన్నెండు గంటలు చదవడం టార్గెట్‌గా పెట్టుకోలేదని చెబుతున్నాడు శిశిర్. ప్రతి గంటకు బ్రేక్ తీసుకున్నానని, ఈ ప్లాన్‌ వల్ల తనకు ఎలాంటి ఇబ్బంది ఎదురు కాలేదని వివరించాడు. అయితే చదివినంత సేపు పూర్తిగా శ్రద్ధ వహించానని, ప్రతి రోజు స్థిరంగా చదివానని చెప్పాడు. గత రెండేళ్లుగా తాను సబ్జెక్ట్స్‌పైన ఫోకస్ పెట్టి చదివివానని, ఈ క్రమంలోనే తనకు సబ్జెక్ట్స్ పైన అవగాహన వచ్చిందన్నాడు.

ఎగ్జామ్ ఏదైనా సరే.. ప్రతి రోజు 12 నుంచి 14 గంటల పాటు చదివితే ఒత్తిడికి గురవుతరాని శిశిర్ చెబుతున్నాడు. ఈ స్టడీ ప్లాన్‌కు తాను వ్యతిరేకమన్నాడు. ఎన్ని గంటలు చదివామనేది ముఖ్యం కాదని, ఎంత క్వాలిటీగా చదివామనేది చాలా ముఖ్యమని వివరించాడు. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఆలిండియా ఫస్ట్ ర్యాంకుతో పాటు స్టేట్ లెవల్ ఫార్మసీ ఎంట్రన్స్ ఎగ్జామ్ కేసెట్(KCET)లో ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందని చెప్పాడు శిశిర్.

First published:

Tags: Jee, Study, Success story

ఉత్తమ కథలు