హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Advanced 2023 Exam: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది! పరీక్ష షెడ్యూల్ ఇలా!

JEE Advanced 2023 Exam: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది! పరీక్ష షెడ్యూల్ ఇలా!

JEE Advanced 2023 Exam: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది! పరీక్ష షెడ్యూల్ ఇలా!

JEE Advanced 2023 Exam: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది! పరీక్ష షెడ్యూల్ ఇలా!

JEE Advanced 2023 Registration | జేఈఈ అభ్యర్థులకు అలర్ట్. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 ఎగ్జామ్ డేట్ వచ్చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియకు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

JEE 2023 Schedule | ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గువాహటి తాజాగా జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 ఎగ్జామ్ డేట్‌ను ప్రకటించింది. జాయింట్ ఎన్‌ట్రెన్స్ ఎగ్జామినేషన్ ఫర్ అడ్వాన్స్‌డ్ డేట్స్‌ (JEE 2023 Date) ఇప్పుడు జేఈఈఏడీవీ.ఏసీ.ఇన్‌లో అందుబాటులో ఉన్నాయి. అధికారిక వెబ్‌సైట్‌లోని నోటిఫికేషన్ ప్రకారం చూస్తే.. రిజిస్ట్రేషన్ (JEE 2023 Registration) ఏప్రిల్ 30 నుంచి ప్రారంభం అవుతుంది. 2023 మే 4 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అవకాశం అందుబాటులో ఉంటుంది. రిజిస్ట్రేషన్ చేసుకున్న వారు ఫీజు చెల్లించేందుకు చివరి తేదీ 2023 మే 5.

నోటిఫికేషన్ ప్రకారం.. జేఈఈ అడ్వాన్స్‌డ్ ఎగ్జామ్ 2023 జూన్ 4న జరుగుతుంది. అభ్యర్థులు రెండు పేపర్లు దృష్టిలో ఉంచుకొని ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు జేఈఈ అడ్వాన్స్‌డ్ డేట్స్ 2023ని ఎలా చెక్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

వామ్మో.. రూ.6 వేలు పెరిగిన బంగారం, వెండి రూ.10 వేలు పైకి.. ఈ ఏడాది మెరుపులే!

ముందుగా మీరు జేఈఈఏడీవీ.ఏసీ.ఇన్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లాలి. అక్కడ హోమ్ పేజ్‌లో లేటెస్ట్ అనౌన్స్‌మెంట్స్ సెక్షన్ కోసం చూడాలి. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 ఇన్ఫర్మేషన్ బ్రౌచర్, ఇన్ఫర్మేషన్ ఫర్ ఫారిన్ నేషనల్ క్యాండిడేట్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఫీజు ఆర్ నౌ అవౌలబుల్ ఆన్ ద వెబ్‌సైట్ అనే లింక్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీకు ఎగ్జామ్స్ డేట్స్ ఎప్పుడో కనిపిస్తుంది.

ఉద్యోగులకు అదిరిపోయే శుభవార్త.. కొత్త ఏడాదిలో పెరగనున్న జీతాలు?

నోటిఫికేషన్ ప్రకారం చూస్తే.. జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ (అడ్వాన్స్‌డ్) 2023‌ను ఏడు జోనల్ కోఆర్డినేటింగ్ ఐఐటీలు నిర్వహిస్తాయి. జాయింట్ అడ్మిషన్ బోర్డు 2023 (జేఏబీ 2023) మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పరీక్షలు జరుగుతాయి. జేఈఈ (అడ్వాన్స్‌డ్) 2023లో అభ్యర్ధి పనితీరు ఆధారంగా బ్యాచిలర్స్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్, డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌ (10+2 స్థాయిలో ప్రవేశం) వంటివి నిర్ణయమౌతాయి. ఈ విధంగా ఈ ఎగ్జామ్ అనేది 2023-24 అకడమిక్ ఇయర్ ప్రవేశానికి ఆధారం అవుతుంది. అయితే జీఈఈ (అడ్వాన్స్‌డ్) 2023, 2023-24 విద్యా సంవత్సరంలో ఐఐటీలలో ప్రవేశానికి సంబంధించిన అన్ని విషయాలలోనూ జేఏబీ 2023 నిర్ణయాలే అంతిమంగా ఉంటాయి.

జేఈఈ (అడ్వాన్స్‌డ్) ద్వారా ఐఐటీలు బ్యాచిలర్స్, ఇంటిగ్రేటెడ్ మాస్టర్స్, ఇంజనీరింగ్, సైన్సెస్ లేదా ఆర్కిటెక్చర్‌లో బ్యాచిలర్ మాస్టర్ డ్యూయల్ డిగ్రీకి దారితీసే అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాన్ని అందిస్తాయి. కోర్సు కరికులం అవసరాలను విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత డ్యూయల్ డిగ్రీ ప్రోగ్రామ్‌లలో నమోదు చేసుకున్న అభ్యర్థులకు బ్యాచిలర్స్, మాస్టర్స్ డిగ్రీలు రెండూ ఇస్తారు. కొన్ని ఐఐటీలలో 4 సంవత్సరాల బ్యాచిలర్స్ ప్రోగ్రామ్‌లో చేరిన విద్యార్థులు బీటెక్‌ (ఆనర్స్) లేదా లేదా బీటెక్ విత్ మైనర్స్ అభ్యసించే అవకాశం ఉంది. డ్యూయల్ డిగ్రీ విద్యార్థులు కూడా మైనర్‌ అభ్యసించవచ్చు.

First published:

Tags: Jee, Jee advanced, JEE Main 2023

ఉత్తమ కథలు