హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Website: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పరీక్షల కోసం అధికారిక వైబ్ సైట్ ప్రారంభం.. ఈసారి పరీక్షల్లో రానున్న మార్పులివే..

JEE Website: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పరీక్షల కోసం అధికారిక వైబ్ సైట్ ప్రారంభం.. ఈసారి పరీక్షల్లో రానున్న మార్పులివే..

IITల్లో ప్రవేశాల కోసం నిర్వహించే JEE (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) అడ్వాన్స్‌డ్ 2022 పరీక్షల కోసం అధికారిక వైబ్ సైట్ jeeadv.ac.in ప్రారంభమైంది. ఈ పరీక్షలను ఈసారి IIT బాంబే నిర్వహిస్తుంది.

IITల్లో ప్రవేశాల కోసం నిర్వహించే JEE (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) అడ్వాన్స్‌డ్ 2022 పరీక్షల కోసం అధికారిక వైబ్ సైట్ jeeadv.ac.in ప్రారంభమైంది. ఈ పరీక్షలను ఈసారి IIT బాంబే నిర్వహిస్తుంది.

IITల్లో ప్రవేశాల కోసం నిర్వహించే JEE (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) అడ్వాన్స్‌డ్ 2022 పరీక్షల కోసం అధికారిక వైబ్ సైట్ jeeadv.ac.in ప్రారంభమైంది. ఈ పరీక్షలను ఈసారి IIT బాంబే నిర్వహిస్తుంది.

  IITల్లో ప్రవేశాల కోసం నిర్వహించే JEE (జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్) అడ్వాన్స్‌డ్ 2022 పరీక్షల కోసం అధికారిక వైబ్ సైట్ jeeadv.ac.in ప్రారంభమైంది. ఈ పరీక్షలను ఈసారి IIT బాంబే నిర్వహిస్తుంది. గతేడాది ఐఐటీ ఖరగ్‌పూర్ నిర్వహించింది. పరీక్షలకు సంబంధించిన సిలబస్, ఇతర వివరాలు అధికారిక వెబ్ సైట్‌‌లో పొందుపర్చారు. అయితే ప్రవేశ పరీక్ష ఎప్పుడు నిర్వహిస్తారనే విషయంపై ఎలాంటి ప్రకటన రాలేదు. ఇప్పటికే UPJEE, WBJEEలతో పాటు అనేక రాష్ట్రస్థాయిల్లో నిర్వహించే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. వీటితో సహా అనేక రాష్ట్ర-స్థాయి ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షలు దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాయి. అలాగే SRMJEE వంటి అనేక ప్రైవేట్ ఇన్‌స్టిట్యూట్‌లు కూడా ఇప్పటికే ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్ష కోసం అనేక సెషన్‌లను నిర్వహించాయి. కాగా, జాతీయ స్థాయి ఇంజినీరింగ్ ప్రవేశానికి సంబంధించిన షెడ్యూల్ కోసం విద్యార్థులు ఎదురుచూస్తున్నారు .

  JEE మెయిన్ 2022 నోటిఫికేషన్ ఫిబ్రవరిలో వెలువడే అవకాశం ఉంది. గతేడాది మాదిరిగానే ఈసారి కూడా నాలుగు దశల్లో పరీక్షలు నిర్వహించే అవకాశం ఉందని విద్యార్థులు భావిస్తున్నారు. విశ్వసనీయ వర్గాల ప్రకారం గతేడాది మాదిరిగానే ఈసారి కూడా ఇంటర్నల్ చాయిస్ ఉండే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్స్‌లోనే కాకుండా, జేఈఈ అడ్వాన్స్‌డ్‌లోనూ అనేక సడలింపులు ఉండనున్నాయి. IIT ప్రవేశానికి అదనంగా మరోసారి ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఇవ్వాలని కోరుతూ కొందరు విద్యార్థులు జాయింట్ అడ్మిషన్స్ బోర్డ్ (JAB)కి లేఖ రాశారు. కోవిడ్-19 కారణంగా గత సంవత్సరం JEE అడ్వాన్స్‌డ్‌ పరీక్షను మరోసారి రాయడానికి విద్యార్థులకు అవకాశం కల్పించారు.

  Engineering Entrance Exam: ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నారా..? వాటికి ఇవే దారులు.. తెలుసుకోండి..

  అలాగే 2021, 2020లో JEE అడ్వాన్స్‌డ్‌లో IIT ప్రవేశం కోల్పోయిన అభ్యర్థులకు మరోసారి ఎంట్రెస్ట్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం కల్పించారు. అయితే నిబంధనల ప్రకారం JEE మెయిన్స్‌లో మొదటి 2.5 లక్షల ర్యాంకులు సాధించిన విద్యార్థులు మాత్రమే JEE అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు రాయడానికి అర్హులు. మరోవైపు JAB 2023 బ్యాచ్ కోసం సిలబస్‌ మారింది. JEE అడ్వాన్స్‌డ్‌‌కు సంబంధించి కాకుండా మెయిన్స్‌లో ఉన్న కొన్ని అధ్యాయాలు కొత్త సిలబస్‌లో ఉన్నాయి. ఈ కొత్త సిలబస్ NCERT, JEE మెయిన్ సిలబస్‌తో IIT ప్రవేశాన్ని మరింత సమకాలీకరించేలా చేస్తుందని నిపుణులు భావిస్తున్నారు.

  NEET and JEE 2022: నీట్, జేఈఈ పరీక్షల కోసం ఈ యాప్‌లో ఫ్రీగా మాక్ టెస్టులు

  అయితే JEE అడ్వాన్స్‌డ్ 2022 కోసం ప్రస్తుతం ఉన్న సిలబస్ కొనసాగుతుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023కు సంబంధించి సవరించిన పాఠ్యాంశాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మూడు సబ్జెక్టుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి. గణితం, రసాయన శాస్త్రం, భౌతికశాస్త్రంలో మార్పులు చేసినట్టు అధికారిక ప్రకటన జారీ అయింది.

  JEE అడ్వాన్స్‌డ్ 2023 సిలబస్‌లో మార్పులు

  ఫిజిక్స్ విభాగంలో General Physics, Mechanics, Thermal Physics, Electromagnetic Wavesతో పాటు మరికొన్ని అంశాలను అదనంగా చేర్చారు. ఇక కెమిస్ట్రీ విభాగంలో Gases and Liquids, Atomic Structure, Chemical Bonding, and Molecular Structure కొత్తగా చేర్చారు. గణితంలో Sets, Relations, and Functions, Algebra లాంటివి సవరించిన సిలబస్ లో ఉన్నాయి. ఇందుకు సంబంధించిన వివరాల కోసం https://jeeadv.ac.in/ అధికారిక వెబ్ సైట్ సందర్శించండి.

  First published:

  Tags: Career and Courses, Exams, Jee, JOBS

  ఉత్తమ కథలు