హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 సిలబస్‌పై స్పష్టతనిచ్చిన ఐఐటీ బాంబే.. వివరాలిలా..

JEE Advanced: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 సిలబస్‌పై స్పష్టతనిచ్చిన ఐఐటీ బాంబే.. వివరాలిలా..

ఐఐటీ బాంబే జేఈఈ అడ్వాన్స్‌డ్–2022కి సంబంధించిన సిలబస్‌ కాపీని కొత్తగా ప్రారంభించిన www.jeeadv.ac.in వెబ్​సైట్​లో పెట్టింది. అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ మూడు సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్​ వివరాలను పీడీఎఫ్​ ఫార్మాట్​లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఇంకా చదవండి ...

  దేశంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీ(IIT), ఎన్​ఐటీ(NIT) వంటి విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్​ ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్​ ఎంట్రన్స్​ ఎగ్జామ్ (జేఈఈ) నోటిఫికేషన్​ త్వరలోనే విడుదల కానుంది. ఈసారి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) బాంబే ఈ పరీక్షను నిర్వహించనుంది. తాజాగా ఐఐటీ బాంబే జేఈఈ అడ్వాన్స్‌డ్(JEE Advanced–2022)కి సంబంధించిన సిలబస్‌ కాపీని కొత్తగా ప్రారంభించిన www.jeeadv.ac.in వెబ్​సైట్​లో పెట్టింది. అభ్యర్థులు ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌ మూడు సబ్జెక్టులకు సంబంధించిన సిలబస్​ వివరాలను పీడీఎఫ్​ ఫార్మాట్​లో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.అయితే, వచ్చే ఏడాది నిర్వహించనున్న జేఈఈ అడ్వాన్స్‌డ్ 2023 పరీక్ష కోసం సిలబస్‌ను సవరించింది.

  సవరించిన సిలబస్​ను తాజా వెబ్​సైట్​లో అప్‌లోడ్ చేసింది. ఈ సిలబస్​ కాపీని జేఈఈ అడ్వాన్సుడ్​ అధికారిక వెబ్‌సైట్ www.jeeadv.ac.inలో చూసుకోవచ్చు. కాగా, జేఈఈ అడ్వాన్సుడ్​ పరీక్షల తేదీలపై ఇంకా స్పష్టత రాలేదు. వీటికి సంబంధించిన తేదీలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలోనే ప్రకటించనుంది.

  Investing For Retirement: రిటైర్‌మెంట్ కోసం ఇన్వెస్ట్ చేసే ముందు హోమ్ లోన్ క్లియర్ చేయాలా..? నిపుణుల సూచనలు ఇవే..

  సబ్జెక్ట్ వారీగా సిలబస్

  జేఈఈ అడ్వాన్సుడ్​ వెబ్​సైట్​లో పేర్కొన్న సిలబస్ ప్రకారం, కెమిస్ట్రీ సిలబస్​ను.. ఫిజికల్ కెమిస్ట్రీ, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇనార్గానిక్​ కెమిస్ట్రీ వంటి మూడు భాగాలుగా విభజించారు. ప్రతి పేపర్‌లో విద్యార్థులకు 11, 12వ తరగతి ఫిజికల్ కెమిస్ట్రీ స్ట్రీమ్ నుంచి ప్రశ్నలొస్తాయి. ఫిజికల్​ కెమిస్ట్రీ భాగంలో ఆటమ్స్​, మాలిక్యూల్స్​, డాల్టన్ అటామిక్​ థియరీ, మోల్ కాన్సెప్ట్, కెమికల్​ ఫార్ములా, బ్యాలెన్స్​డ్​ కెమికల్​ ఈక్వేషన్లు, న్యూట్రలైజేషన్​, డిస్​ప్లేస్​మెంట్ రియాక్షన్​ టాపిక్స్​పై ప్రశ్నలొస్తాయి. ఇక, ఆర్గానిక్​ కెమిస్ట్రీ భాగంలో గ్యాస్​, లిక్విడ్​ స్టేట్స్​, అటామిక్​ స్ట్రక్చర్​, కెమికల్ బాండింగ్​, ఎనర్జీస్టిక్స్​, కెమికల్ ఈక్విలిబ్రియం, ఎలక్ట్రో కెమిస్ట్రీ టాపిక్స్​ నుంచి ప్రశ్నలు వస్తాయి.

  ఇనార్గానిక్ కెమిస్ట్రీ భాగానికి సంబంధించి వివిధ లోహాలు, సమ్మేళనాల ఐసోలేషన్ టాపిక్స్​పై ప్రశ్నలు ఉంటాయి. వీటితో పాటు 3డీ సిరీస్ పరివర్తన మూలకాలు, ఖనిజాలు, లోహశాస్త్రం నిర్వచనాలు, వాటి లక్షణాల నుంచి కూడా ప్రశ్నలొస్తాయి. ఆల్కనేస్, ఆల్కైన్‌ల తయారీ, లక్షణాలు, రియాక్షన్లు ఆర్గానిక్ కెమిస్ట్రీ సిలబస్‌లో భాగంగా ఉంటాయి. గణితం విషయానికి వస్తే.. బీజగణితం, మాత్రికలు, సంభావ్యత, త్రికోణమితి, విశ్లేషణాత్మక జ్యామితి, కాలిక్యులస్, వెక్టర్‌ల అంశాలపై ప్రశ్నలుంటాయి. ఫిజిక్స్​ విషయానికి వస్తే.. జనరల్​ ఫిజిక్స్​, మెకానిక్స్, థర్మల్ ఫిజిక్స్, ఎలక్ట్రిసిటీ, అయస్కాంతత్వం, ఆప్టిక్స్, మోడ్రన్​ ఫిజిక్స్​పై ప్రశ్నలుంటాయి.

  First published:

  Tags: Career and Courses, EDUCATION, Jee

  ఉత్తమ కథలు