Home /News /jobs /

JEE ADVANCED 2022 RESCHEDULED EXAM ON AUGUST 28 REGISTRATION BEGINS FROM AUG 7 NS

JEE Advanced 2022: మారిన జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ తేదీ.. ఫీజు చెల్లింపు తేదీ కూడా మార్పు.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కు సంబంధించి తేదీలను ఐఐటీ బాంబే రీ షెడ్యూల్ చేసింది.

    జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ కు సంబంధించి తేదీలను ఐఐటీ బాంబే రీ షెడ్యూల్ చేసింది. వాస్తవానికి ఈ పరీక్ష జులై 3 వ తేదీన నిర్వహించాల్సి ఉండగా.. ఆగస్టు 28కి రీ షెడ్యూల్ చేశారు. మార్చిన షెడ్యూల్ ప్రకారం.. పరీక్ష ఫీజును ఆగస్టు 12 వరకు చెల్లించవచ్చు. అభ్యర్థులు ఆగస్టు 23 నుంచి 28 వరకు ఇందుకు సంబంధించిన అడ్మిట్ కార్డును డౌన్ లోడ్ చెల్లించుకోవచ్చు. జేఈఈ మెయిన్ తేదీలను మార్చడంతో జేఈఈ అడ్వాన్స్డ్ తేదీలను సైతం మార్చాల్సి వచ్చిందని ఐఐటీ బాంబే వెల్లడించింది. ఈ నేపథ్యంలో కొత్త తేదీని తాజాగా విడుదల చేసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ జేఈఈ మెయిన్ పరీక్షలను జూన్, జులైలో నిర్వహించున్నట్లు వెల్లడించింది. జేఈఈ మెయిన్ రెండో విడత జులై 30తో ముగుస్తుంది. మొదటి, రెండో విడతల్లో అర్హత సాధించిన 2.50 లక్షల మంది అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసేందుకు అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో జులై 3న నిర్వహించాల్సి ఉన్న అడ్వాన్స్డ్ ఎగ్జామ్ వాయిదా వేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Exams, Jee, Jee main 2022

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు