హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

JEE Advanced: ఆ రోజున జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పరీక్ష.. షెడ్యూల్​ విడుదల చేసిన ఐఐటీ బాంబే..

JEE Advanced: ఆ రోజున జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పరీక్ష.. షెడ్యూల్​ విడుదల చేసిన ఐఐటీ బాంబే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

దేశంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్​ఐటీల్లో ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) అడ్వాన్స్​డ్​ 2022 షెడ్యూల్​ విడుదలైంది. షెడ్యూల్​ ప్రకారం, ఈ పరీక్ష జూలై 3న జరగనుంది. జూలై 18న ఫలితాలు విడుదల కానున్నాయి.

ఇంకా చదవండి ...

దేశంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్​ఐటీల్లో(NIT) ఇంజనీరింగ్ ప్రవేశాల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్(Entrance) ఎగ్జామినేషన్ (JEE) అడ్వాన్స్​డ్​ 2022 షెడ్యూల్​ విడుదలైంది. షెడ్యూల్​ ప్రకారం, ఈ పరీక్ష జూలై 3న జరగనుంది. జూలై 18న ఫలితాలు విడుదల కానున్నాయి. జేఈఈ అడ్వాన్స్​డ్​కు సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ జూన్ 8 నుంచి జూన్ 14 మధ్య ప్రారంభంకానుంది. జేఈఈ అడ్వాన్సుడ్ పరీక్షలను ఈ సారి ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) బాంబే నిర్వహిస్తోంది. తాజాగా, ఐఐటీ బాంబే జేఈఈ అడ్వాన్సుడ్​ పరీక్ష కోసం www.jeeadv.ac.in అనే ప్రత్యేక వెబ్‌సైట్​ను సైతం లాంచ్​ చేసింది. ఈ వెబ్​సైట్​లోనే జేఈఈ అడ్వాన్సుడ్​ షెడ్యూల్​, అర్హత ప్రమాణాలను పొందుపర్చింది.

జేఈఈ అడ్వాన్సుడ్​ 2022 పరీక్షను దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలు, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (IISc), కొన్ని ఇతర సంస్థల్లో ప్రవేశం కోసం నిర్వహిస్తారు. ఈ పరీక్ష మొత్తం రెండు షిఫ్టులలో జరుగుతుంది. పేపర్ 1 ఉదయం 9 నుండి 12 గంటల వరకు, పేపర్ 2 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 5:30 వరకు నిర్వహిస్తారు. ఫైనల్ ఆన్సర్ కీ, ఆన్‌లైన్ డిక్లరేషన్ అనంతరం ఫలితాలు జూలై 18న వెల్లడికానున్నాయి.

Work From Office-New Rule: ఉద్యోగులను ఆఫీసులకు రమ్మంటున్న ఐటీ కంపెనీలు.. కానీ కొన్ని రోజులు మాత్రం ఇలా..


వారికి కూడా అవకాశం

జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మంది అభ్యర్థులకు మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్​కు హాజరయ్యే అవకాశం ఉంటుంది. అయితే, గతేడాది జేఈఈ మెయిన్స్​లో క్వాలిఫై అయ్యి అడ్వాన్స్​డ్​కు హాజరుకాలేకపోయిన విద్యార్థులు సైతం ఈసారి జేఈఈ అడ్వాన్సుడ్​కు దరఖాస్తు చేసుకోవచ్చు. కోవిడ్​–19 పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని ఈ అవకాశం కల్పించారు. ఇందుకు గాను విద్యార్థులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 కోసం రిజిస్ట్రేషన్​ చేసుకోని ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Explained: మణిపూర్‌ రాష్ట్రానికి వేర్పాటువాదులతో ముప్పు ఎంత..? కేంద్ర ప్రభుత్వ చర్యలు ఏ మేరకు ఫలిస్తాయి..?


“జేఈఈ మెయిన్స్ 2021లో​ క్వాలిఫై అయ్యి జేఈఈ (అడ్వాన్స్‌డ్) 2021కి రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పటికీ, పరీక్షకు హాజరుకాని అభ్యర్థులు JEE (అడ్వాన్స్‌డ్) 2022కి నేరుగా హాజరు కావడానికి అర్హులు. అయితే, వారు తప్పనిసరిగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో జేఈఈ (అడ్వాన్స్‌డ్) 2022 కోసం విజయవంతంగా రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలి.” అని ఐఐటీ బాంబే అధికారిక ప్రకటనలో తెలిపింది. కాగా, జేఈఈ మెయిన్ 2022 షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు. అయితే, ఈ పరీక్షను ఏప్రిల్​, మే నెలల్లో నిర్వహించే అవకాశం ఉంది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, Exams, Jee, Students

ఉత్తమ కథలు